Samantha: ట్రెండీ హాట్ టాపిక్... అమ్మా సమంత దేని కోసం నీ ఆరాటం? ఈ రేంజ్ లో అవసరమా?
సమంత వ్యవహారం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. రోజురోజుకూ ఆ విషయంలో అమ్మడు శృతి మించి పోతుంది. అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తుంది. స్టార్ హీరోయిన్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న సమంతకు ఇలాంటి ఫోటో షూట్స్ అవసరమా అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.

Samantha
వెండితెరపై సమంతకు (Samantha) సపరేట్ కలిగి ఇమేజ్ ఉంది. హీరోలకు సమానంగా క్రేజ్ ఆమె సొంతం. 12ఏళ్ల కెరీర్ లో సమంత వెన్నక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఎన్నడూ ఆమె సక్సెస్ గ్రాఫ్ నేలకి చూడలేదు. ఒక్క ప్రభాస్ మినహాయిస్తే ఈ తరం టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో నటించింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా అనేక ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేసింది.
Samantha
సోలో హీరోయిన్ గా 'ఓ బేబీ' వంటి సక్సెస్లు కూడా చూశారు. యూఎస్ లో వన్ మిలియన్ వసూళ్లు సాధించిన టాలీవుడ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా ఓ బేబీ రికార్డులకెక్కింది. ఓ దశ వరకు మితిమీరిన గ్లామర్, స్కిన్ షో చేసిన దాఖలాలు లేవు. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్, కట్టిపడేసే నటన డై హార్డ్ ఫ్యాన్స్ ఏర్పడేలా చేసింది.
నాగ చైతన్య(Naga Chaitanya)తో విడాకుల విషయంలో కూడా అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. వెనకుండి మోరల్ సప్పోర్ట్ ఇవ్వడం జరిగింది. కొందరు గిట్టనివారు సమంతపై అపవాదులు మోపితే, అభిమానులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మానసిక దాడి చేయడం సరైంది కాదని హితవు పలికారు.
సక్సెస్ లో హైట్స్ చూసిన సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ అభిమానుల్లోని ఓ వర్గానికి నచ్చడం లేదు. ఆమె మితిమీరి స్కిన్ షో చేయడం కొందరు జీర్ణించుకోలేకున్నారు. ఫ్యాన్స్ లో ఆమెకున్న ఇమేజ్ రీత్యా ఈ తరహా ఫోటో షూట్స్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా తిరుగులేని విజయాలు సాధించిన నీ ఆరాటం ఇంకా దేని కోసం అంటున్నారు.
సమంత (Samantha Hot Photos)లేటెస్ట్ ఫోటో షూట్ లో చాలా బోల్డ్ గా ఉన్నారు. బ్రాను తలపించేలా ఉన్న టాప్ ధరించి సెన్సేషనల్ లుక్ లో దర్శనమిచ్చారు. ఈ ఫోటో చూసిన ఆమె ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. సమంత ఇలాంటి ఫోటో షూట్స్ చేయకుంటే బాగుండని విజ్ఞప్తి చేస్తున్నారు.
సౌత్ ఇండియాను ఏలిన సమంత ఫోకస్ నార్త్ కి షిఫ్ట్ అయ్యింది. ఆమె బాలీవుడ్ లో రాణించాలని ఆశపడుతున్నారు. దీనిలో భాగంగానే ఇలాంటి ఫోటో షూట్స్ చేస్తున్నారనే వాదన ఉంది. బాలీవుడ్ మేకర్స్ కంటిలో పడాలనే సమంత ఇలా చేస్తున్నారంటున్నారు కొందరు. ఆమె కలలు కూడా నెరవేరుతున్నాయి. రణ్వీర్ సింగ్ తో ఫస్ట్ బాలీవుడ్ మూవీ సమంత ప్రకటించారు.