- Home
- Entertainment
- చిరంజీవితో ఆటో జానీ మూవీ ప్లాన్ చేసిన పూరి జగన్నాథ్, చివరి నిమిషంలో చెడగొట్టింది ఎవరో తెలుసా?
చిరంజీవితో ఆటో జానీ మూవీ ప్లాన్ చేసిన పూరి జగన్నాథ్, చివరి నిమిషంలో చెడగొట్టింది ఎవరో తెలుసా?
గతంలో చిరంజీవితో మెగా మూవీ ప్లాన్ చేశాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఆటో జానీ టైటిల్ కూడా పెట్టాడు. మెగాస్టార్ కు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడు. కానీ చివరి నిమిషంలో ఈసినిమా ఎందుకు ఆగిపోయింది?

పూరీ మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్
పూరీ జగన్నాథ్ టాలీవుడ్ లో చాలా కష్టపడి పైకి వచ్చిన దర్శకుడు. కష్టాన్ని నమ్మకుని సినిమాలు చేసే వ్యక్తి. డబ్బుకు విలువివ్వని దర్శకుడు. పూరీ మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హీరోయిజంలో కూడా నెగెటీవ్ యాంగిల్ ను పూరీ మాత్రమే చూపించగలడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరీ.. రవితేజను ఇడియట్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హీరోగా నిలబెట్టాడు. కానీ తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనను నమ్మి తాను స్టార్లను చేసిన హీరోలెవరు రాలేదని బాధపడుతుంటాడు పూరీ.
మెగా మూవీ చేయాలని కోరిక
ఎంతో మంది స్టార్స్ తో సినిమాలు చేసిన పూరీ జగన్నాథ్ కు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలని కోరక ఉండేది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన దర్శకుడు, ఛాన్స్ వస్తే తమ అభిమాన హీరోతో అద్భుతమైన సినిమా చేయాలని అనుకున్నాడట. లక్కీగా మెగా 150 సినిమా చేసే అవకాశం పూరీకి వచ్చిందట. ఓ సారి చిరంజీవిని ఓ సారి కలిసినప్పుడు, మీరు ఒకే అంటే ప్రస్తుతం టైటిల్ రెడీగా ఉంది ఆటోజానీ.. దాని చుట్టు అద్భుతమైన కథ రాసుకోని వస్తాను అన్నారు. దాంతో మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, మెగా ఆడియన్స్ ఎంజాయ్ చేయగలిగేలా కథను రాసుకుని వచ్చి వినిపించారు. చిరంజీవికి కూడా ఆ కథ బాగా నచ్చింది. సినిమా చేయడానికి కూడా రెడీ అయిపోయాడు.
ఆటో జానీ ఎందుకు ముందుకు వెళ్లలేదు.
చిరంజీవి ఆటో జానీ కథకు సరే అన్నారు. కానీ ఆతరువాత ఆయన పాలిటిక్స్ లోకి వెళ్లడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. చిరంజీవి 150 సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆటోజానీ లాంటి సినిమా చేయడం కరెక్ట్ కాదని ఆయన చుట్టు ఉన్నవారు చెప్పడం మొదలు పెట్టారు. చుట్టూ చేరి పొలిటికల్ గా మైనస్ అవుతుందని, అదని, ఇదని చాలా రకాలుగా ఆయనతో అన్నారు. దాంతో ఈసినిమాను తరువాత చూద్దాం అని చిరంజీవి అన్నారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పూరీ జన్నాథ్ స్వయంగా వెల్లడించారు. మెగా ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కథ రాసుకున్న పూరీ.. చివరకు చిరంజీవితో సినిమా చేయలేకపోయారు. ఈ విషయంలో చిన్న బాధ ఎప్పుడు వెంటాడుతుంది అని పూరీ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వరుస ప్లాప్ సినిమాలు.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ వరుస ప్లాప్ సినిమాలతో ఇబ్బందిపడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తరువాత పూరీ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. లైగర్ తరువాత విజయ్ దేవరకొండతో జనగణమన సినిమా చేయాలని అనుకున్నాడు పూరీ, కానీ లైగర్ డిజాస్టర్ తో ఆ ప్రయత్నం ఆపేశాడు. ఆతరువాత రామ్ తో డబుల్ ఇస్మార్ట్ శంకర్ చేసినా.. అది కూడా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఓ మూవీ చేస్తున్నాడు పూరీ. ఈసినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది.
చిరంజీవి సినిమాలు
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా వరుసగా సినిమాలు లైన్ చేస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర రిలీజ్ కు ముస్తాబవుతుండగా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మనశంకరవరప్రసాదు షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. ఈ సినిమాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఈరెండు సినిమాలతో పాటు బాబీతో మరో మూవీ అనౌన్స్ చేశాడు చిరంజీవి. ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. 70 ఏళ్ళ వయస్సులో కూడా స్పెప్పుల్లో అదే గ్రేస్ ను మెయింటేన్ చేస్తున్నాడు మెగాస్టార్. ఫిట్ నెస్ విషయంలో కుర్ర హీరోలకు కూడా పోటీ ఇస్తున్నాడు.