బాలయ్యతో బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న త్రివిక్రమ్, దానికి కారణం ఎవరో తెలుసా?
Trivikram missed Balakrishna Movie : ఇంత వరకు త్రివిక్రమ్ తో బాలకృష్ణ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి? బాలయ్యతో త్రివిక్రమ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా? దానికి కారణం ఎవరు?

త్రివిక్రమ్ మాటల తూటాలు..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఆయన మాటలు తూటాల్లా పేలతాయి. రచయితగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, డైరెక్టర్ గా మారిన త్రివిక్రమ్. తన డైలాగ్స్ తో సినిమాలను సక్సెస్ వైపు పరుగులు తీయించేయవారు. డైరెక్టర్ కాకముందు కూడా ఆయన డైరెక్టర్ విజయ్ భాస్కర్ దగ్గర రైటర్ గా పనిచేశారు. నువ్వునాకునచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి సినిమాల్లో త్రివిక్రమ్ పంచులగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆతరువాత కాలంలో త్రివిక్రమ్ డైరెక్టర్ గా వేరు కుంపటి పెట్టుకున్నారు.
కిర్రాక్ కాంబినేషన్
టాలీవుడ్‌లో విజయ్ భాస్కర్–త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకప్పుడు సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్లింది. వీరి కలయికలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి, మల్లీశ్వరి, స్వయంవరం, మన్మధుడు వంటి సినిమాలు ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఇప్పటిక ఆ సినిమాలు టీవీలో కనిపిస్తే అలా ఆగిపోయి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు. ఈసినిమాలన్నీ ఇండస్ట్రీ హిస్టరీలో ఆల్ టైమ్ క్లాసిక్స్‌గానే నిలిచిపోయాయి. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నటైమ్ లో నందమూరి బాలకృష్ణతో కూడా సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ అవకాశం ఉపయోగించుకోలేకపోయారు ఈ ఇద్దరు క్రియేటర్స్.
బాలయ్య ఇచ్చిన హామీ..
డైరెక్టర్ విజయ్ భాస్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు వెల్లడించారు. బాలయ్య హీరోగా, ‘బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన లారీ డ్రైవర్ సినిమా సమయంలో విజయ్ భాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఆ సమయంలోనే బాలకృష్ణ విజయ్ భాస్కర్ ప్రవర్తన, టాలెంట్ నచ్చి, ఫ్యూచర్ లో సినిమా చేస్తా అని చెప్పారు. ఆ విషయం గుర్తు పెట్టుకుని విజయ్ భాస్కర్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉండగా ఫోన్ చేసి అడిగారు. అప్పటికీ విజయ్ భాస్కర్ టీమ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరిపోయారు. సినిమా చేయాలని డిస్కషన్స్ మొదలయ్యాయి.
మిస్ అయిన క్రేజీ కాంబినేషన్
కానీ అప్పటికే విజయ్ భాస్కర్ మల్లీశ్వరి సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు కమిట్ అవ్వడంతో, బాలయ్యతో సినిమా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఆతరువాత అసలు సినిమా చేసే అవకాశమే రాలేదుట. విజయ్ భాస్కార్, త్రివిక్రమ్ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అటు బాలయ్య కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండటంతో.. వీరి కాంబో అలా మిస్ అయ్యింది. త్రివిక్రమ్ డైలాగ్స్ కు ఎంత పదును ఉంటుందో అందరికి తెలుసు. ఆయన డైలాగ్స్ బాలయ్య చెపితే ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ అనుకుంటుంటారు. విజయ్ భాస్కర్ లాంటి మాస్టర్స్, బాలకృష్ణ లాంటి మాస్ హీరో కలిసి సినిమా చేయాలనుకున్నా, టైమ్ డిఫరెన్స్ వల్ల చేయలేకపోయారు. వీరి కాంబోలో సినిమా వచ్చుంటే.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది అని అంటున్నారు ఫ్యాన్స్.
దూసుకుపోతోన్న బాలయ్య
ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో అఖండ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నటసింహం. ఈసినిమాతరువాత మరో సినిమా హిట్ అయితే డబుల్ హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో పడినట్టే. సీనియర్ హీరోలలో వెంకటేష్, బాలకృష్ణ మాత్రమే వరుసగా హిట్ సినిమాలు చేయగలుగుతున్నారు. అటు విజయభాస్కర్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. సినిమాలకు దూరంగా ఉంటున్నారు. త్రివిక్రమ్ సంగతి తెలిసిందే. ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో తిరుగులేని కెరీర్ ను కొనసాగిస్తున్నారు.