టచ్ చేస్తే కస్సున లేచే అనసూయ ఆయన విషయంలో సైలెంట్... కారణం చెప్త్మా!
ఈ మధ్య కాలంలో అనసూయను 'ఆంటీ' అన్న పదం వేధించినంతగా మరొకటి వేధించి ఉండదు. ఇక వేధింపైనా ఎగతాళి అయినా అనసూయ అసలు ఊరుకోదు. ఆమె అదే చేసింది.

కత్తి, డాలు పట్టుకొని ట్విట్టర్ క్షేత్రంలో యుద్ధం చేసింది. మూడు రోజులు ఒక్కతే వీర నారీమణిలా చెలరేగిపోయింది. వందల కొద్దీ వచ్చి పడుతున్న మీమ్స్ ని ట్రోల్స్ ని ఒంటరిగా ఎదుర్కొంది. ఆంటీ అన్న ప్రతి ఒక్కరూ నా శిక్ష నుండి తప్పించుకోలేరని శబధం చేసింది. దానిలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సామాన్య జనంతో మౌనం వీడి యుద్ధం చేసిన అనసూయ ఓ సెలెబ్రిటీ సెటైర్ విషయంలో మాత్రం మిన్నకుండి పోయింది. ఏమీ పట్టనట్లు, తన గురించి కానట్లు సైలెంట్ అయిపోయింది. ఇదేంటి మూడు రోజులు ముక్కూ ముఖం తెలియని వాళ్ళను ఎడా పెడా వాయించిన అనసూయ తెలిసిన వాడి విషయంలో ఇలా మౌనంగా ఉండటం అంతుబట్టడం లేదు.
నిజానికి అనసూయ తత్త్వం అది కాదు. టచ్ చేస్తే తాచులా పైకి లేచి బుసకొడుతుంది. వెనుకా ముందు చిన్నా పెద్దా చూసుకోకుండా వాయించేస్తుంది. సీనియర్ నటుడు కోటానే అనసూయ వదల్లేదు. కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా దారుణమైన విమర్శలు చేసింది. బ్రహ్మాజీ సెటైర్ మాత్రం తనకు పట్టనట్లు, ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తోంది.
Anasuya Bharadwaj
నటుడు బహ్మాజి పరోక్షంగా అనసూయను టార్గెట్ చేశారు. ఆంటీ అంటే కేసు పెడతానన్న అనసూయ కామెంట్ కి పరోక్షంగా అంకుల్ అంటే కేసు పెడతా అని ట్వీట్ చేశారు. ఈ మాత్రం హింట్ చాలు అనసూయ చెలరేగిపోవడానికి. అసలు తనవి కానీ, ఎటువంటి సంబంధం లేని గొడవలు కూడా మీదేసుకొని కోట్లాటకు దిగే అనసూయ బ్రహ్మాజీని చూసి భయపడ్డారా? లేక దీని వెనుక ఇంకేమైనా కథ ఉందా?
విడ్డూరం కాకపోతే ఎప్పుడో 2017 లో జరిగిన దాన్నిలైగర్ రిజల్ట్ కి ఆపాదించడం ఏమిటీ? ఆ కర్మఫలం వెంటాడింది అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని కెలకడం ఏమిటీ?. ఈ వివాదంలో అనసూయ అత్యుత్సహం మాత్రమే కనిపిస్తుండగా, ఆమెకు కనీస మద్దతు కరువైంది. తప్పు తెలుసుకునే బ్రహ్మాజీ సెటైర్ మీద స్పందించలేదేమో...