MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వర్మ ‘సిండికేట్‌’ నటించబోతున్న స్టార్స్ వాళ్లేనా?

వర్మ ‘సిండికేట్‌’ నటించబోతున్న స్టార్స్ వాళ్లేనా?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పాత తప్పులను సరిదిద్దుకుంటూ, ప్రేక్షకుల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి 'సిండికేట్' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో అమితాబ్, జేడి చక్రవర్తి, నాగార్జున, మోహన్ లాల్, అజయ్ దేవగన్ వంటి సీనియర్ నటులు నటించే అవకాశం ఉంది.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 23 2025, 08:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ   ఏం చేసినా.. ఏం మాట్లాడినా..అది సెన్సేషన్. సినిమాలు హిట్, ఫ్లాఫ్ లు కన్నా ఆయన వివాదాలకు కేరాఫ్ గా మారిపోయారు. ఒకప్పుడు సినీ లవర్స్ కు హిట్ మూవీ అందించిన ఆర్జీవీ గత కొంతకాలంగా వెనకపడ్డారు.

ప్రేక్షకుల పల్స్ కు సంభందం లేకుందా తనకు ఇష్టం వచ్చినట్టు.. సినిమాలు తీస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అంతే కాదు సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదోక పోస్ట్ పెట్టి అగ్గి రాజేస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటారు ఈయన. అయితే తాను మారిపోయినట్లు వర్మ చెప్తూ ఓ సినినిమా ప్రకటించారు

26


వర్మ ఈ గత కొంతకాలంగా తాను తీస్తున్న సినిమాల పట్ల ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఇటీవల తన సోషల్‌మీడియా పోస్ట్‌లో పశ్చాత్తాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘సత్య’ సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయని, తాను ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయానని, ఇక నుంచి తన స్థాయి ప్రమాణాలతో సినిమాలు చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేశారు. 
 

36


గత కొంతకాలంగా తాను తీస్తున్న సినిమాల పట్ల ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఇటీవల తన సోషల్‌మీడియా పోస్ట్‌లో పశ్చాత్తాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘సత్య’ సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయని, తాను ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయానని, ఇక నుంచి తన స్థాయి ప్రమాణాలతో సినిమాలు చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేశారు.

ఆ దిశగా అడుగులు వేయడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ‘సిండికేట్‌’ పేరుతో రామ్‌గోపాల్‌వర్మ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సినిమాలో ఎవరు నటించబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. 

46


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సిండికేట్ చిత్రంలో అమితాబ్, జేడి చక్రవర్తి,నాగార్జున, మోహన్ లాల్, అజయ్ దేవగన్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో స్టార్ హీరోని ఆయన సంప్రదించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ నటులతో ఈ సినిమాని ఓ మల్టీ స్టారర్ గా తీర్చిదిద్దాలని, కొత్త వాళ్లతో వెళ్లకూడదని ఆయన ఫిక్స్ అయ్యినట్లు చెప్పుకుంటున్నారు.

56


 ఈ చిత్రం గురించి వర్మ మాట్లాడుతూ...‘అత్యంత భయంకరమైన జంతువు ఒక్క మనిషి మాత్రమే’ అనే పాయింట్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. ‘70దశకంలో ఉండే వీధి రౌడీలు అనంతరం రాజకీయాలను వృత్తిగా చేపట్టడంతో కనుమరుగయ్యారు.

బంగారం, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల స్మగ్లర్లు ఆర్థిక సంస్కరణ వల్ల ఆ వృత్తిని వదిలేశారు. ముంబయి డీ కంపెనీ, ఆల్‌ఖైదా వంటి టెర్రరిస్ట్‌ సంస్థలు పతనావస్థకు చేరాయి. వీరందరికి కంటే ప్రమాదకరంగా ఇప్పుడు ‘సిండికేట్‌’ రాబోతున్నది. 
 

66


ఇది రాజకీయ సంస్థలు, రాజకీయాలు, బడా పారిశ్రామిక వేత్తలు, మిలిటరీ కలబోసిన పవర్‌ఫుల్‌ ‘సిండికేట్‌’. ఆధునిక భారతాన్ని ప్రమాదంలో నెట్టేసే భయంకరమైన కూటమి. నేరం కాలానికి అనుగుణంగా ఎలా రూపాన్ని మార్చుకుంటుందో ఈ సినిమాలో చూడబోతున్నారు.

ఇదొక ఫ్యూచరిస్టిక్‌ సినిమా అనుకోవచ్చు. సమీప భవిష్యత్తుకు అద్దం పడుతుంది. గత కొంతకాలంగా దర్శకుడిగా నేను చేసిన తప్పులను, వైఫల్యాలను ఈ ‘సిండికేట్‌’ తుడిచివేస్తుందని వాగ్దానం చేస్తున్నా’ అని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ.. ఇచ్చి పడేసే గోత్రంతో ఇరగదీసిన పవర్ స్టార్, కానీ
Recommended image2
Dhurandhar 2 Review: ధురంధర్‌ 2 మూవీ రివ్యూ, రేటింగ్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
జోరందుకున్న ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్, గంటల వ్యవధిలోనే ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved