MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anushka Shetty: స్వీటీ శెట్టిని అనుష్కగా మార్చిన హీరో ఎవరు, అనుష్క శెట్టి పేరు వెనుక టాప్ సీక్రేట్ ఏంటో తెలుసా?

Anushka Shetty: స్వీటీ శెట్టిని అనుష్కగా మార్చిన హీరో ఎవరు, అనుష్క శెట్టి పేరు వెనుక టాప్ సీక్రేట్ ఏంటో తెలుసా?

Anushka Shetty: టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ తో వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క శెట్టి. ఆమె అసలు పేరు అది కాదని ఎంత మందికి తెలుసు. స్వీటి శెట్టిగా ఉన్న ఆమె పేరును అనుష్కగామార్చిన హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 11 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాలీవుడ్ కు జెజమ్మ..
Image Credit : Instagram

టాలీవుడ్ కు జెజమ్మ..

టాలీవుడ్‌లో ‘జెజమ్మ’గా, ‘దేవసేన’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి. గ్లామర్ పాత్రలకైనా, నటనకు ప్రాధాన్యమున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలకైనా ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అయితే, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఆమె పేరు అనుష్క కాదు. కర్ణాటకకు చెందిన ఈ మంగళూరు భామ అసలు పేరు 'స్వీటీ శెట్టి'. మరి ఈ స్వీటీ శెట్టి స్క్రీన్ నేమ్ 'అనుష్క'గా ఎలా మారింది? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నాగార్జున జోడీగా అనుష్క శెట్టి మొదటి సినిమా..
Image Credit : Asianet News

నాగార్జున జోడీగా అనుష్క శెట్టి మొదటి సినిమా..

సినిమాల్లోకి రాకముందు అనుష్క బెంగళూరులో యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవారు. ఆమె అందం, వ్యక్తిత్వం చూసిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, తను తెరకెక్కించబోయే 'సూపర్' సినిమా కోసం ఆమెను ఎంపిక చేశారు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే, వెండితెరకు పరిచయం చేసేటప్పుడు 'స్వీటీ' అనే పేరు కంటే క్యాచీగా ఉండే మరో పేరు పెడితే బాగుంటుందని మూవీ టీమ్ అనుకున్నారట.

34
స్వీటీని అనుష్కగా మార్చింది ఎవరు?
Image Credit : Asianet News

స్వీటీని అనుష్కగా మార్చింది ఎవరు?

ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'అంజి' సినిమా విడుదలైంది. ఆ సినిమాలో ఓ పాటకు పాపులర్ గాయని అనుష్క మంచందా పాడారు. 'సూపర్' సినిమా ఆడిషన్స్ , ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడు చిత్ర యూనిట్ ఆ పాటను వినడం , ఆ పేరును గమనించడం జరిగింది. 'అనుష్క' అనే పేరు చాలా కొత్తగా, పలకడానికి వినసొంపుగా అనిపించడంతో.. కింగ్ నాగార్జున, పూరీ జగన్నాథ్ కలిసి స్వీటీ శెట్టికి 'అనుష్క శెట్టి' అనే స్క్రీన్ నేమ్ ఖరారు చేశారు.

44
కలిసొచ్చిన పేరు..
Image Credit : our own

కలిసొచ్చిన పేరు..

సూపర్' సినిమా టైటిల్ కార్డ్స్ లో ఆమె పేరు అనుష్కగా పడింది. ఆ పేరు ఆమెకు బాగా కలిసి వచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క, ఆ తర్వాత విక్రమార్కుడు, అరుంధతి, బాహుబలి వంటి చిత్రాలతో సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. పేరు మారినా, ఇండస్ట్రీలోని సన్నిహితులు, అభిమానులు ఇప్పటికీ ఆమెను ప్రేమగా 'స్వీటీ' అని పిలుచుకుంటారు. ఒక గాయని పేరు మీదుగా అనుష్కగా మారిన స్వీటీ, ఇప్పుడు కోట్లాది మంది గుండెల్లో స్టార్ హీరోయిన్‌గా నిలిచిపోయారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Srinidhi Shetty: ఆ విషయంలో యశ్ కంటే నానినే బెస్ట్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి సంచలన కామెంట్స్..
Recommended image2
Pawan-Singeetam Movie: జీసస్‌ కథతో పవన్‌ కళ్యాణ్‌ మూవీ.. సింగీతంతో చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది?
Recommended image3
Singeetham Top 10 Movies: సినిమా సైంటిస్ట్.. సింగీతం శ్రీనివాసరావు టాప్ 10 క్లాసిక్ మూవీస్, మయూరి నుంచి భైరవ ద్వీపం వరకు..
Related Stories
Recommended image1
ANR: 88 ఏళ్ల వయసులో 23 ఏళ్ల హీరోయిన్ పై ఏఎన్నార్ రొమాంటిక్ కామెంట్స్, మిల్క్ బ్యూటీపై మనసుపడ్డ హీరో..
Recommended image2
Facts: ఎడారిలో పాత్రలను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా? నీళ్లు లేకుండానే అంట్లు ఎలా క్లీన్ అవుతాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved