- Home
- Entertainment
- త్రివిక్రమ్ శ్రీనివాస్ ను భయపెట్టిన సీనియర్ నటుడు? క్యారెక్టర్ ఆఫర్ చేద్దామంటే ఆలోచించిన స్టార్ డైరెక్టర్
త్రివిక్రమ్ శ్రీనివాస్ ను భయపెట్టిన సీనియర్ నటుడు? క్యారెక్టర్ ఆఫర్ చేద్దామంటే ఆలోచించిన స్టార్ డైరెక్టర్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కాని ఓ నటుడు మాత్రం త్రివిక్రమ్ నే భయపెట్టాడు. ఆయన క్యారెక్టర్ ఆఫర్ చేయడానికి కూడా భయపడేలా చేసిన స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?

మాటల మాంత్రికుడు
చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాత్రికుడు సినిమాలో ఎవరికైనా నచ్చేది ఆయన డైలాగ్స్, పంచ్ లు, సెపరేట్ హీరోయిజం ఆయన సినిమాల్లో కనిపిస్తుంటుంది. అందుకే త్రివిక్రమ్ సినిమాలంటే జనాల్లో ఆసక్తి ఉంటుంది. సినిమాలో కథతో పాటు ఆయన డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.చాలా వరకు హీరోలకు మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు. కాని టాలీవుడ్ లో కొంత మంది డైరెక్టర్లకు కూడా డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, ఇలా కొంత మంది డైరెక్టర్లకు సెపరేట్ గా ఫ్యాన్స్ ఉంటారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన సినిమాలోని కథ, పాత్రలు ముఖ్యంగా డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతే కాదు త్రివిక్రమ్ తో సినిమా అంటే పద్ద పెద్ద హీరోలు కూడా వెంటనే కాల్షీట్లు ఇస్తుంటారు. స్టార్ యాక్టర్స్ ఎవరైనా ఆయన సినిమాలో అవకాశం రాకుండాపోతుందా అని ఎదురుచూస్తుంటారు.
KNOW
త్రివిక్రమ్ నే భయపెట్టిన నటుడు
క్యారెక్టర్ కు తగ్గట్టు నటులను ఎంచుకుని కబురు పంపిస్తే చాలు త్రివిక్రమ్ సినిమాకు వెంటనే సైన్ చేస్తారు ఎవరైనా. కాని ఓ నటుడితో మాత్రం తన సినిమాలో పాత్ర చేయించలేకపోయారట త్రివిక్రమ్. ఆయన మాత్రమే చేయాలి అనుకున్న పాత్రలు కూడా చేస్తారా అని అడిగే ధైర్యం కూడా చేయలేకపోయారట. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా? తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు వెళ్లైన త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.. ఓ నటుడి గురించి ఆయన మాట్లాడుతూ.. నేను నా సినిమాలో ఆయనను తీసుకోవాలని అనుకున్నా.. కానీ ఎవరో ఆయన ఒప్పుకోడు అని చెప్పారని తెలిపాడు. ఇంతకూ త్రివిక్రమ్ చెప్పింది ఎవరి గురించో కాదు ఆర్. నారాయణ మూర్తి గురించే ఆయన ఈ మాటలు అన్నారు.
ఆర్. నారాయణ మూర్తి కొత్త సినిమా
తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్. నారాయణ మూర్తి నటించిన యూనివర్సిటీ లో పేపర్ లీక్ అనే సినిమా చూశారు. ఆ సినిమా గురించి.. నారాయణమూర్తి గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “నారాయణమూర్తి గారు వన్ మ్యాన్ ఆర్మీ.. ఆయన సినిమాలో రాజు ఆయనే, సైనికుడు, మంత్రి అన్నీ ఆయనే.. నొక్కబడే గొంతులు గురించి మాట్లాడటానికి ఒక గొంతు ఉంది.. అది అందరికి వినిపించాలి ఆలాంటి గొంతు ఆర్ నారాయణమూర్తి”.
మీలా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు
“ఈ సినిమా చూడటానికి వచ్చినప్పుడు అయ్యబాబోయ్ 2 గంటలు సినిమా చూడాలా.? అనిపించింది. కానీ సినిమా చాల ఫాస్ట్ గా జరిగిపోయింది. అందులో కథను అద్భుతంగా చూపించారు. ఆర్ నారాయణ మూర్తిని ఎందుకు గౌరవిస్తారంటే.. మీ అభిప్రాయం గురించి చెప్పే తీరు.. దాన్ని ఎవ్వరూ.. ప్రశ్నించలేరు. ఆ నిబ్బద్దత నచ్చే నేను ఇక్కడికి వచ్చాను. ఇంతలా రాజీ పడకుండా బ్రతకడం అందరి వల్ల సాధ్యం కాదు. నా వల్ల కూడా కాదు. నేను చాలా సార్లు రాజీపడ్డాను. ఆర్ నారాయణ మూర్తిగారు మరిన్ని సినిమాలు తీయాలి. ఎన్నో సూపర్ హిట్స్ అందుకోవాలి అని త్రివిక్రమ్ అన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పెషల్ కామెంట్స్
అంతే కాదు ఈసందర్భంగా త్రివిక్రమ్ చేసిన స్పెషల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. '' నా సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని అనుకున్నాం.. కానీ నాకు ఎవరో చెప్పారు. మీరు అడిగినా ఆయన చేయరు అని చెప్పారు. రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఆర్ నారాయణమూర్తి గారిని ఎవరు కొనలేరు అని చెప్పారు. అందుకే నేను ఆ ప్రయత్నం కూడా మానుకున్నాను. ఇలాంటి విషయాలు ఎవరు చెప్పినా జనాలు వినరు. కానీ ఇలాంటి సినిమాల ద్వారా మీరు చెప్తేనే వారు వింటారు. ఎందుకు వింటారంటే.. మీరు ఇలాంటివి డబ్బు కోసమో, సక్సెస్ కోసమో చెప్పారు, కమర్షియల్ గా సినిమాలు తీయ్యారు. నిజంగా జనాల కోసం చెప్తారు. ఈ సినిమా ఆడాలి.. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఆగస్టు 22న ఈ సినిమా విడుదల అవుతుంది”.. అందరూ చూడండి అంటూ త్రివిక్రమ్ అన్నారు.

