MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 2024: ఈ ఏడాది అత్యధిక టికెట్స్‌ అమ్ముడైన సినిమా ఏదంటే..!

2024: ఈ ఏడాది అత్యధిక టికెట్స్‌ అమ్ముడైన సినిమా ఏదంటే..!

బుక్‌మైషో వారి ఇయర్ ఎండ్ రిపోర్ట్ ప్రకారం, 2024లో పుష్ప 2, దేవర, కల్కి వంటి అనేక సినిమాలు విడుదలయ్యాయి. అయితే, పుష్ప 2 ఒక్క రోజులోనే అత్యధిక టిక్కెట్లను అమ్ముడైన చిత్రంగా నిలిచింది, 10.8 లక్షల మంది ప్రేక్షకులు సినిమాను వ్యక్తిగతంగా చూశారు.

2 Min read
Author : Surya Prakash
Published : Dec 21 2024, 08:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
BookMyShow, Pushpa 2: The Rule, KALKI, DEVARA

BookMyShow, Pushpa 2: The Rule, KALKI, DEVARA



BookMyShow వారి ఇయిర్ ఎండ్ రిపర్ట్ ను #BookMyShowThrowback పేరుతో విడుదల చేసింది. 2024 సంవత్సరంలో దేశంలో అతి పెద్ద రిలీజ్ లుగా పుష్ప 2, దేవర, కల్కి, ఫైటర్, స్ట్రీ 2, సింగం ఎగైన్, మరియు భూల్ భూలయ్యా 3తో సహా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఎక్కువ ఎక్కువ ఎక్సపెక్టేషన్స్  ఉన్న విడుదలలు జరిగాయి. అయితే,  వీటిలో ఏ సినిమా బుక్ మై షోలో ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యింది అనేది ఆసక్తికరమైన విషయం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
allu arjun movie Pushpa 2

allu arjun movie Pushpa 2


అతి త్వరలో 2024 వెళ్లిపోతోంది. 2025 కు స్వాగతం పలకనుంది ప్రపంచం.  కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో  ఈ ఏడాదిలో చాలా చిత్రాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్త్రీ-2, సింగం ఏగైన్, భూల్ భూలయ్యా-2 లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. 
 

35
actor allu arjun movie pushpa 2

actor allu arjun movie pushpa 2


అయితే ఈ లిస్ట్ లో అత్యధిక క్రేజ్ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచింది. అదే సమయంలో  తాజాగా పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఒక్క రోజులోనే అత్యధిక టికెట్స్ అమ్ముడైన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో అఫీషియల్ గా వెల్లడించింది. అంతేకాకుండా అత్యధికంగా 10.8 లక్షల మంది సోలో ఆడియన్స్‌ చూసినట్లు  చెప్పుకొచ్చింది.
 

45


 భారతీయ సినీ చరిత్రలో కమర్షియల్‌ సినిమాకు సరికొత్త నిర్వచనాన్ని చెబుతోంది ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa 2: The Rule). 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా కనిపించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1508 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు రాబట్టే విషయంలో ‘పుష్పరాజ్‌’ వాయువేగంతో దూసుకుపోతున్నాడు.  

55
actor allu arjun movie pushpa 2 the rule

actor allu arjun movie pushpa 2 the rule


‘పుష్ప2: ది రూల్‌’  మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1,508 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.  ‘కేజీయఫ్‌2’ (రూ.1250 కోట్లు), ‘RRR’ (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్‌ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప2’.. ‘బాహుబలి2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా వెళ్తోంది. అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన భారతీయ చిత్రాల జాబాతాలో ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ (రూ.2,024 కోట్లు) టాప్‌లో ఉంది. ముంబయి సర్క్యూట్‌లో రూ.200 కోట్లు (నెట్‌) సాధించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన ‘పుష్ప 2’ హిందీలో రూ.618.50 కోట్లు (నెట్‌) వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Movie: రాజమౌళి కల చెల్లాచెదురు, వారణాసిలో ఆ సీన్లు లేనట్లే.. జక్కన్న ఎందుకిలా చేశారు ?
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్, మండిపడుతున్న నెటిజన్లు
Recommended image3
Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved