MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • తన డిజాస్టర్ సినిమాని మెచ్చుకుంటూ మహేష్ బాబు కామెంట్,షాక్ లో ప్యాన్స్

తన డిజాస్టర్ సినిమాని మెచ్చుకుంటూ మహేష్ బాబు కామెంట్,షాక్ లో ప్యాన్స్

 మహేష్ బాబు కు తన సినిమాల్లో  బాగా నచ్చిన సినిమా ఏదో తెలిస్తే మతి పోతుంది. ఆ విషయం రీసెంట్ గా తెలియచేసారు. 

4 Min read
Author : Surya Prakash
Published : Jun 12 2024, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ అనతికాలంలోనే స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. తన కెరీర్ లో  ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. అనవసరమైన వివాదాల జోలికి పోకుండా ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉంటూ తన సినిమాలు తాను చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు. ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాఫ్ అయినా ఫ్యాన్స్ కు బాగానే నచ్చుతాయి. ఆ సినిమాల్లో మహేష్ నటనను మెచ్చుకోకుండా ఉండలేరు. అలాగే మహేష్ అభిమానులు తమ హీరో సినిమాల్లో తమకు బాగా నచ్చినవి చెప్తూంటారు. మరి మహేష్ బాబు కు తన సినిమాల్లో  బాగా నచ్చిన సినిమా ఏదో తెలిస్తే మతి పోతుంది. ఆ విషయం రీసెంట్ గా తెలియచేసారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

 సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘హరోం హర’ (Harom Hara). జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.   ఈవెంట్‌లో మహేశ్‌ బాబుతో (Mahesh Babu) మాట్లాడిన ఫోన్‌ రికార్డును సుధీర్‌బాబు ప్లే చేశారు. అందులో సుధీర్‌ అడిగిన కొన్ని ప్రశ్నలకు మహేశ్‌ సమాధానమిచ్చారు. ఆ ప్రశ్నల్లో భాగంగా తన సినిమాలు గురించి చెప్పుకొచ్చారు. ఇంతకీ మహేష్ ని ఏం ప్రశ్నలు అడిగారు.

312

సుధీర్‌బాబు: సినిమాల్లో మొదటిసారి గన్స్‌ ఉపయోగించినప్పుడు ఎలా అనిపించింది? చెప్పగలరా అనే ప్రశ్నకు మహేశ్‌ బాబు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.  గన్స్‌ ఉపయోగించడంపై నేను ప్రత్యేక శిక్షణేం తీసుకోలేదు. ‘టక్కరి దొంగ’లో ఎక్కువగా గన్స్‌ వాడాం. ఆ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం అన్నారు. ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ అభిమానులకు ఆ సినిమా చాలా ఇష్టం.
 

412

ఇక  సుధీర్‌బాబు:  గన్స్‌ను చూపించిన సినిమాల్లో నీకు నచ్చింది ఏది? అని అడిగారు. దానికి మహేశ్‌ బాబు: నాన్న గారు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’. ఆ సినిమాను వందసార్లు చూసుంటాను. నాకు చాలా ఇష్టమైన చిత్రమది అని చెప్పుకొచ్చారు. ఈ విషయం చాలా సార్లు మహేష్ ఇంతకు ముందు కూడా చెప్పారు. 
 

512

అలాగే సుధీర్‌బాబు: నువ్వు నటించిన ‘నిజం’ సినిమా గురించి ఆసక్తికర విషయాలేమైనా గుర్తున్నాయా?. అనగానే మహేశ్‌ బాబు: నాకు చాలా నచ్చిన సినిమా అది. అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్‌ చెప్పాలి. ‘నిజం’ చేసినందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాను అని చెప్పి షాక్ ఇచ్చారు. ఎందుకంటే నిజం చిత్రం డిజాస్టర్ అయ్యింది. 
  

612

మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నిజం’. ‘చిత్రం’ ‘నువ్వు నేను’ ‘జయం’ వంటి చిత్రాల తర్వాత తేజ దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడం.. అలాగే ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ కావడంతో ‘నిజం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా  విజయాన్ని సాధించలేదు. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది ‘నిజం’. అయితే ఈ సినిమా తనకు బాగా ఇష్టం అంటున్నారు మహేష్ బాబు. 
 

712

అలాగే నిజం మూవీని ‘చిత్రం మూవీస్’ బ్యానర్ పై స్వయంగా తేజ నిర్మించడం జరిగింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా ఆయనకు మంచి బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడానికి కారణం.. ‘ఒక్కడు’ తర్వాత మహేష్ ఇమేజ్ పెరగడం అని తేజ ఓ సందర్భంలో చెప్పాడు.
 

812

 తాను ‘బాబీ’ సినిమా చూశాక ‘నిజం’ చిత్రానికి మహేష్ బాబుని హీరోగా అనుకున్నాడట. అప్పటికి ‘ఒక్కడు’ ఇంకా ప్రారంభం కాలేదు. నిజానికి ‘ఒక్కడు’ కంటే ‘నిజం’ ముందుగా రావాల్సిన మూవీ. ఇక  ‘నిజం’ షూటింగ్ డిలే అవ్వడంతో ‘ఒక్కడు’ ముందుగా వచ్చింది. అయితే ‘నిజం’ ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం మంచి హిట్ అని దర్శకుడు తేజ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ‘నిజం’ చిత్రం తన గత సినిమాలలానే రూ.10 కోట్ల పైనే వసూళ్లు రాబట్టిందట. కానీ అందరూ ఈ సినిమా ప్లాప్ అని చెప్పుకుంటారు కానీ కమర్షియల్ గా మాత్రం మంచి సక్సెస్ అందుకున్న సినిమా ఇది అంటూ తేజ చెప్పుకొచ్చారు.

912

కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీగానే వచ్చాయి.నిజం సినిమాకు ముందు తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో సంబరం మినహా మిగిలిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో నిజం సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. మహేష్ బాబు పాత్ర చిత్రణ సరిగ్గా లేదని మెజారిటీ ప్రేక్షకులు భావించారు.

1012

నిజం సినిమాలో హీరో తన తల్లి సహకారంతో మాత్రమే హీరో అన్ని పనులు చేస్తుండటం, కథ, కథనంలోని లోపాలు, ప్రకాష్ రాజ్ పాత్రకు అతిగా ప్రాధాన్యత ఉండటం, ఇతర కారణాల వల్ల సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.రాశి పాత్ర కూడా సినిమాకు మైనస్ అయింది.

1112

ఇక ఈ సినిమాలోని నటనకు మహేష్ బాబుకు, తాళ్లూరి రామేశ్వరికి అవార్డులు వచ్చాయి.ఒక్కడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మహేష్ బాబుకు నిజం సినిమా ఫలితం తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. అయితే ఆ తర్వాత తేజతో మరో సినిమా చేయలేదు మహేష్ బాబు. 

1212

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు మహేష్ .ఆ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ... "నా నెక్స్ట్ మూవీ మొదలైంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇంకా క్యాస్టింగ్ పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే సెలక్ట్ చేశాం. ఆయన పేరు మహేష్ బాబు.. తెలుగు యాక్టర్. మీలో చాలా మందికి ఆయన తెలుసు అనుకుంటా. మహేష్ చాలా అందగాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ టైమ్‌లో మహేష్‌ను ఇక్కడికి తీసుకువచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను." అంటూ రాజమౌళి చెప్పారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved