కొడుకు నిలదీయడంతో ఆ వ్యసనం వదిలేసిన ఎన్టీఆర్, దాన్ని కొనసాగిస్తున్న బాలయ్య! ఏమిటది?
సీనియర్ ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరు ఆయనకున్న వ్యాసనాన్ని ప్రశ్నించాడు. దాంతో ఆయన ఆ అలవాటును వదిలేశాడు. కాగా ఆ అలవాటును బాలకృష్ణ కొనసాగిస్తున్నాడు.
NTR
నందమూరి తారక రామారావు తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశాడు. దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు సేవలు అందించాడు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా అనేక మరపురాని విజయాలు అందుకున్నారు.
NTR
నటుడిగా తనను ఆదరించిన ప్రజలకు సేవ చేయాలని ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేశారు. 1982లో పార్టీ స్థాపించిన ఎన్టీఆర్.. తొమ్మిది నెలల వ్యవధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఎన్టీఆర్ చాలా క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కృషి పట్టుదలతో అనేక మైలురాళ్లను చేరుకున్నారు. మరి ఎంతటి వారికైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఎన్టీఆర్ బలహీనతను ఆయన చిన్న కొడుకు ప్రశ్నించాడట.
ఎన్టీఆర్ కి 12 మంది సంతానం. 8 మంది అబ్బాయిలు కాగా.. 4 గురు అమ్మాయిలు. అబ్బాయిల్లో బాలకృష్ణ, హరికృష్ణ మాత్రమే పాప్యులర్. ఇక కూతుళ్లతో పురంధరేశ్వరి, భువనేశ్వరి గురించి సామాన్య ప్రజలకు తెలుసు. ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన జయశంకర్ కృష్ణ ఓ విషయంలో ఎన్టీఆర్ తో విభేదించాడట. ఆయన్ని నేరుగా ప్రశ్నించాడట.
NTR
ఎన్టీఆర్ కి ఉదయాన్నే ఒక చుట్ట తాగే అలవాటు ఉందట. ఇది ఆయన దిన చర్యలో భాగమట. ఎన్టీఆర్ చుట్ట తాగుతాడన్న సంగతి కుటుంబ సభ్యులందరికీ తెలుసు. కాగా హరికృష్ణకు స్మోకింగ్ అలవాటు ఉంది. ఆయన సిగరెట్స్ ఎక్కువగా తాగేవారట. ఎన్టీఆర్ కి అది నచ్చేది కాదట. సిగరెట్ అలవాటు వదులుకోవాలని హరికృష్ణకు ఎన్టీఆర్ పదే పదే చెబుతూ ఉండేవాడట.
కాగా జయ శంకర్ కృష్ణకు ఇది నచ్చలేదట. తండ్రి ఎన్టీఆర్ చుట్ట తాగుతూ... తన అన్నయ్యను సిగరెట్ మానేయమని నీతులు చెప్పడం ఏమిటి అనుకున్నాడట. మనసులో మాట నేరుగా ఎన్టీఆర్ తో చెప్పేశాడట. నాన్న మీరు చుట్ట తాగుతూ, హరి అన్నను సిగరెట్ మానేయమనడం సరికాదు కాదు... అన్నారట. జయ శంకర్ కృష్ణ ప్రశ్న ఎన్టీఆర్ ని కదిలించిందట. నిజమే కదా.. అని భావించి, మరలా చుట్ట జోలికి పోలేదట.
నిజానికి చుట్ట తాగడం ఎన్టీఆర్ కి వ్యసనం కాదు. నటులకు కంఠం చాలా ముఖ్యం. వాయిస్ మాడ్యులేషన్ కోసం ఆయన రోజూ ఉదయాన్నే ఒక చుట్ట తాగేవారట. ఏదేమైనా.. కొడుకు తనను నిలదీయడంతో ఎన్టీఆర్ ఇకపై చుట్ట తాగ కూడదు అని నిర్ణయించుకున్నాడట. అదన్నమాట సంగతి. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరి వెల్లడించారు.
కాగా ఈ అలవాటును నందమూరి బాలకృష్ణ కొనసాగించడం విశేషం. బాలకృష్ణ సైతం ఉదయాన్నే నిద్రలేస్తారు. లేచిన వెంటనే ఓ చుట్ట తాగుతారు. చుట్ట తాగడం వలన గొంతులోని శ్లేష్మం అంతా బయటకు పోయి.. కంఠం ఫ్రీ అవుతుంది. సినిమాల్లో డైలాగ్స్ చెప్పడానికి అది ఉపయోగపడుతుందని బాలకృష్ణ నమ్ముతున్నారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో బాలకృష్ణ స్వయంగా చెప్పారు.
Balakrishna
బాలకృష్ణ డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్యను ప్రత్యేకంగా మార్చిన అంశాల్లో ఆయన డైలాగ్ డెలివరీ ఒకటి. ఎన్టీఆర్ మాస్ డైలాగ్ చెబితే.. ఫ్యాన్స్ కి పూనకాలే. థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. ఆయన కంచు కంఠం వెనకున్న రహస్యం ప్రతి రోజూ ఉదయం ఒక చుట్ట తాగడమేనట. అది అలవాటుగా కాకుండా కేవలం గొంతు కోసం తాగుతారట.
ప్రస్తుతం బాలకృష్ణ వరుస విజయాలతో జోరు మీదున్నారు. ఆయన నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 చేస్తున్నాడు. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం.