ఎన్టీఆర్ పరువు జాతీయ స్థాయిలో తీసిన రాజమౌళి, అదో చెత్త మూవీ అంటూ ఓపెన్ కామెంట్!
ఎన్టీఆర్-రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్స్. రాజమౌళి అత్యధికంగా ఎన్టీఆర్ తో చిత్రాలు చేశాడు. అయితే ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పరువు తీశాడు రాజమౌళి. అదో చెత్త మూవీ, ప్రేక్షకుల మైండ్ నుండి డిలీట్ చేయాలని అన్నాడు.
NTR-Rajamouli
రాజమౌళి కెరీర్ ఎన్టీఆర్ తో మొదలైంది. సీరియల్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో సినిమా దర్శకుడు అయ్యాడు. ఇది ఎన్టీఆర్ కి రెండో చిత్రం. ఆయన డెబ్యూ మూవీ నిన్ను చూడాలని ఆడలేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్. ఈ మూవీలో సాంగ్స్ బాగుంటాయి. ఎన్టీఆర్ డాన్స్ ఆడియన్స్ ని ఫిదా చేసింది.
రాజమౌళి-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన రెండో మూవీ సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అనంతరం యమదొంగ, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు వీరిద్దరూ కలిసి చేశారు. రాజమౌళి రెండు దశాబ్దాల కెరీర్లో దర్శకుడిగా చేసింది 12 సినిమాలే. వాటిలో నాలుగు ఎన్టీఆర్ తోనే చేశాడు ఆయన. ఇండియా వైడ్ పలువురు బడా హీరోలు ఆయన డైరెక్షన్ లో నటించాలని కోరుకుంటారు. ఎన్టీఆర్ కి మాత్రం ఆ ఛాన్స్ నాలుగు సార్లు దక్కింది.
NTR-Rajamouli
ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ ఫేమ్ తారా స్థాయికి చేరింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ ల ఈ మల్టీస్టారర్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతర్జాతీయ వేదికలపై ఎన్టీఆర్, రామ్ చరణ్ మెరిశారు. ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఆస్కార్, గ్లోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. ఆర్ ఆర్ ఆర్ ఫేమ్ ఎన్టీఆర్ దేవర చిత్రానికి ప్లస్ అయ్యింది. నార్త్ లో దేవర రూ. 60 కోట్ల వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే..
NTR-Rajamouli
ఎన్టీఆర్ కి ఇంత కీర్తి తెచ్చి పెట్టిన రాజమౌళి ఓ సందర్భంలో ఆయన పరువు తీశాడు. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ ఓ నేషనల్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సదరు ఇంటర్వ్యూలో యాంకర్ ... ప్రేక్షకుల మైండ్ నుండి ఈ సినిమా తీసేయాలి అంటే.. అది ఏ సినిమా అంటారు? అని అడిగారు. ఈ ప్రశ్నకు తడుముకోకుండా రాజమౌళి.. స్టూడెంట్ నెంబర్ వన్ అన్నారు .
పక్కనే ఉన్న ఎన్టీఆర్ ఒకింత ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ అపరికత్వతతో కూడుకున్న మూవీ. ఆ సినిమా చూసినప్పుడల్లా నేను ఇబ్బందిగా ఫీల్ అవుతాను, అన్నారు.అది రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసిన మూవీ అయినప్పటికీ.. ఆ కామెంట్స్ ఇబ్బంది పెట్టాయి.
గతంలో కూడా రాజమౌళి ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నా ఫస్ట్ మూవీ హీరో ఏంటి ఇలా ఉన్నాడని తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాను. సరేలే కుంటి గుర్రంతో రేస్ గెలిచినప్పుడే కదా.. మజా ఉంటుందని సరిపెట్టుకున్నాను, అన్నారు. ఎన్టీఆర్ ని రాజమౌళి దారుణంగా కుంటి గుర్రంతో పోల్చాడు. అయితే షూటింగ్ మొదలయ్యాక తన అభిప్రాయం మారిపోయినట్లు వెల్లడించాడు.