రష్మిక నువ్వు దమ్ము కొడతావా, విజయ్ దేవరకొండ నీకు మధ్య డాష్ డాష్ అంటగా... బ్యూటీ షాకింగ్ ఆన్సర్స్
హీరోయిన్ రష్మిక మందాన ఫేమ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ చేరింది. ప్రస్తుతం ఆమె చేతిలో బడా బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇక హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా మిషన్ మజ్ను మూవీ చేస్తున్నారు రష్మిక. దీనితో పాటు అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై మూవీలో రష్మిక కీలక రోల్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మరో తెలుగు చిత్రంలో రష్మిక హీరోయిన్ గా చేయడం విశేషం. తక్కువ కాలంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న రష్మిక లో దూసుకుపోతుంది.
ఇక లక్షలాదిగా ఉన్న తన అభిమానులతో తరచూ సోషల్ మీడియా ద్వారా సంభాషిస్తూ ఉంటుంది రష్మిక. గుడ్ బై మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన రష్మిక, షూటింగ్ గ్యాప్ లో ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ఛాట్ లో పాల్గొన్నారు.
సెలబ్రిటీ లైన్ లోకి వస్తే కాచుకొని ఉండే ఫ్యాన్స్ అనేక ప్రశ్నలు అడగడం జరిగింది. ఆసక్తికరంగా ఓ నెటిజెన్ మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? అని అడిగారు. దానికి నాకు ఆ అలవాటు లేదు, అలాగే స్మోక్ చేసేవారి పక్కన కూడా నేను ఉండను అన్నారు.
స్మోకింగ్ అంటే తనకు అసహ్యం అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇక మరొక నెటిజెన్ విజయ్ దేవరకొండ మీకు ఏమి అవుతాడు, మీ రిలేషన్ ఏమిటని అడగడం జరిగింది. విజయ్ దేవరకొండ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ రష్మిక సమాధానం చెప్పారు.
ముంబైలో కలిసి చక్కర్లు కొడుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక పై డేటింగ్ పుకార్లు రావడం జరిగింది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రష్మిక తాజా రెస్పాన్స్ ఆసక్తి రేపుతోంది.
ఇక తనకు ఆరు భాషలు వచ్చని గొప్పగా చెప్పింది రష్మిక. తెలుగులో కూడా అనర్గళంగా మాట్లాడేస్తుంది రష్మిక మందాన. ఇక ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదని, తనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.
కెరీర్ బిగినింగ్ లోనే రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. నిశితార్థం కూడా జరుపుకున్న ఈ జంట పెళ్లి చేసుకుకుండా బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పట్లో వీరి లవ్ బ్రేకప్ కన్నడ మీడియాను షేక్ చేసింది.