MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి వీణ స్టెప్ పై అల్లు అర్జున్ బెట్టింగ్... 17 సార్లు చూసినా పొరపాటు, ఇంట్రెస్టింగ్ స్టోరీ!

చిరంజీవి వీణ స్టెప్ పై అల్లు అర్జున్ బెట్టింగ్... 17 సార్లు చూసినా పొరపాటు, ఇంట్రెస్టింగ్ స్టోరీ!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడైన అల్లు అర్జున్ ఆయన మీద పందెం వేశాడట. అయితే ఓడిపోయిన అల్లు అర్జున్ డబ్బులు పోగొట్టుకున్నాడట. ఈ ఆసక్తికర సంగతి ఏమిటో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 15 2024, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chiranjeevi

Chiranjeevi

చిరంజీవి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన డాన్సులు. టాలీవుడ్ లో డాన్సులకు ట్రెండ్ సెట్టర్. ఆయన గ్రేస్ చూస్తే మతిపోతుంది. చిరంజీవికి అశేష అభిమానులను సంపాదించిన పెట్టిన అంశాలతో డాన్సు కూడా ఒకటి. 
 

27
Chiranjeevi

Chiranjeevi


డాన్సుల్లో చిరంజీవిని బీట్ చేసే మరో హీరో దశాబ్దాల పాటు రాలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాకతో చిరంజీవికి గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ చిరంజీవి డాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ గొప్ప డాన్సర్స్ లో ఒకరు. 
 

37

కాగా చిరంజీవి కెరీర్లో ఇంద్ర అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉంది. 2002లో విడుదలైన ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకుడు. అశ్విని దత్ నిర్మించారు. మణిశర్మ అందించిన సాంగ్స్ అద్భుతం  అని చెప్పాలి. ప్రతి ఒక్క సాంగ్ సూపర్ హిట్. వాటిలో 'దాయి దాయి దామ్మా' చాలా ప్రత్యేకం. 

47
Chiranjeevi

Chiranjeevi


దాయి దాయి దామ్మా సాంగ్ కి లారెన్స్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటలో చిరంజీవి వేసిన వీణ స్టెప్ విపరీతంగా పాప్యులర్ అయ్యింది. కాగా అల్లు అర్జున్ ఈ స్టెప్ విషయంలో ఓ పందెం వేశాడట. ఇంద్ర విడుదలైన కొత్తలో ఆ సినిమా గురించి మాట్లాడుతూ స్నేహితుడితో బెట్ కట్టాడట. 
 

57
Chiranjeevi

Chiranjeevi


దాయి దాయి దామ్మా సాంగ్ లో వీణ స్టెప్ వేసేటప్పుడు పక్కనే సోనాలి బింద్రే ఉంటుందని అల్లు అర్జున్ స్నేహితుడు అన్నాడట. లేదు ఇంద్ర నేను 17 సార్లు చూశాను.  అది సోలో స్టెప్ చిరంజీవి మాత్రమే ఉంటారని అల్లు అర్జున్ అన్నాడట. 
 

67
Chiranjeevi

Chiranjeevi


ఇద్దరూ రూ. 25 వేలకు బెట్ కట్టారట. తీరా సాంగ్ చూస్తే వీణ స్టెప్ లో చిరంజీవి పక్కన సోనాలి బింద్రే ఉందట. దాంతో అల్లు అర్జున్ డబ్బులు కోల్పోయాడట. అల్లు అర్జున్ ప్రతిసారి ఆ స్టెప్ వేసేటప్పుడు చిరంజీవిని గమనిస్తూ పక్కన సోనాలి బింద్రే ఉన్న విషయం మర్చిపోయాడట. 
 

77

ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఓ సందర్భంలో చెప్పాడు. ఇక టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్స్ ఎవరు అంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు వినిపిస్తాయి. చిరంజీవి తర్వాత డాన్సుల విషయంలో ఈ ఇద్దరు హీరోలు పేరు తెచ్చుకున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
నిర్మాతలది మామూలు ధైర్యం కాదు, మెగా హీరో మూవీ క్లైమాక్స్ కోసం 20 కోట్ల బడ్జెట్.. మహాభారతాన్ని తలపించేలా
Recommended image2
Toxic Movie: యశ్‌తో కియారా రొమాంటిక్ ఫోజు.. ఫన్నీ కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు
Recommended image3
Shreya Ghoshal: ఆ పాట నాకు సెట్ అవ్వదనుకున్నా.. కానీ నా వాయిసే కరెక్ట్ అయింది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved