మీ రిలేషన్ బయటకు తెలిస్తే నా సినిమా ఎవరూ చూడరు.. విక్రమ్, సదాల ఫై ఫైర్ అయిన శంకర్
2002లో విడుదలైన జయం ఓ సంచలనం. నితిన్, సదా లను వెండితెరకు పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసింది. వెళ్ళవయ్యా వేళ్లూ... అంటూ సదా చెప్పిన డైలాగ్ అప్పట్లో ఫుల్ ఫేమస్.
జయం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన సదా.. సౌత్ లో బిజీ హీరోయిన్ అయ్యారు. తెలుగు, తమిళ్, కన్నడ బాషలలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే స్థాయికి వెళ్లారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, విక్రమ్ వంటి స్టార్స్ సరసన సదా నటించడం జరిగింది.
ఆరంభంలో స్టార్ గా మెరుపులు మెరిపించి సదా కెరీర్ చాలా త్వరగానే డౌన్ అయ్యింది. వరుస పరాజయాల కారణంగా స్టార్స్ నుండి చిన్న హీరోల రేంజ్ కి పడిపోయారు.
విక్రమ్ కి జంటగా ఆమె చేసిన అపరిచితుడు ఆమె కెరీర్ లో అతిపెద్ద హిట్. స్టార్ డైరెక్టర్ శంకర్ అన్నియన్ పేరుతో తమిళంలో తెరకెక్కిన ఆ చిత్రం తెలుగులో అపరిచితుడుగా విడుదలైంది.
ఈ మూవీ షూటింగ్ సమయంలో దర్శకుడు శంకర్ ఓ విషయంలో బాగా అప్ సెట్ అయ్యారట. హీరో విక్రమ్ సదాను చెల్లెమ్మ అని సంభోదించారట. అది విన్న శంకర్ షాక్ అయ్యారట.
నేను మీ ఇద్దరిని రాముడు, సీతలా చూపించాలని అనుకుంటున్నాను, మీరేమో అన్నా, చెల్లి అని పిలుచుకుంటున్నారు. మీ రిలేషన్ బయట తెలిస్తే నా సినిమా ఎవరూ చూడరని, గట్టిగా చెప్పారట.
తెరపై రొమాన్స్ పంచాల్సిన హీరో హీరోయిన్స్ ఆఫ్ స్క్రీన్ లో అన్నా చెల్లిలా ఉంటారని ఆడియన్స్ కి తెలిస్తే, ఆ రొమాన్స్ ఫీల్ కారు, అది సినిమా ఫలితాన్నే దెబ్బ తీస్తుందని శంకర్ పరోక్షంగా చెప్పారట.
ఇక ఎన్టీఆర్, బాలయ్య పై కూడా సదా ఆసక్తిర కామెంట్స్ చేశారు... ఎన్టీఆర్ లాంటి డాన్సర్ ని చూడలేదన్న సదా, బాలయ్య మనసు చిన్నపిల్లాడితో సమానం అన్నారు.
అలాగే జయం సినిమా షూటింగ్ సమయంలో నాన్నతో పాటు ప్రయాణిస్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగినట్లు, తీవ్ర గాయాలైనట్లు తెలియజేసింది సదా. అలీతో సరదాగా ప్రోగ్రాం కి వచ్చిన సదా ఈ విషయాలు వెల్లడించారు.