MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • డైరెక్షన్ లో పర్ఫెక్షన్, దర్శకుడు బాపు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు!

డైరెక్షన్ లో పర్ఫెక్షన్, దర్శకుడు బాపు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు!

బాపు-రమణల కాంబినేషన్ లో వచ్చిన అద్భుత చిత్రం పెళ్లి పుస్తకం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పెళ్లి పుస్తకం చిత్ర  షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఘటన తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 12 2024, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

1991లో విడుదలైన పెళ్లి పుస్తకం టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది. పెళ్లి పుస్తకం బాపు-రమణల కాంబోలో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. రాజేంద్ర ప్రసాద్-దివ్య వాణి జంటగా నటించారు. ఈ మూవీ ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎన్టీఆర్-సావిత్రి-ఏఎన్నార్ నటించిన  క్లాసిక్ మిస్సమ్మ చిత్రానికి పెళ్లి పుస్తకం దగ్గరగా ఉంటుంది. ఎన్టీఆర్-సావిత్రి మిస్సమ్మ మూవీలో ఉద్యోగం కోసం భార్య భర్తలుగా నటిస్తారు. పెళ్లి పుస్తకం మూవీలో భార్య భర్తలు అయిన రాజేంద్ర ప్రసాద్-దివ్య వాణి ఉద్యోగం కోసం పరిచయం లేని వ్యక్తులుగా ఒకే ఆఫీస్ లో నటిస్తూ పని చేస్తారు. 

ఆ ఒక్క పోలిక మినహాయిస్తే సన్నివేశాలు, కథనం అంతా భిన్నంగా రాసుకున్నారు. పెళ్లి పుస్తకం చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ''శ్రీరస్తు శుభమస్తు'' సాంగ్ ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో, వీడియోల్లో వినిపిస్తుంది. అంతగా ఫేమస్ అయ్యింది ఈ పాట. బాపు టేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. 
 

36

పెళ్లి పుస్తకం మూవీ షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందట. నటులు సాక్షి రంగారావు, రాధా కుమారి బాదం ఆకు విస్తరిలో ఇడ్లీలు తింటున్నట్లు రమణ స్క్రిప్ట్ లో రాశాడట. బాపు ప్రొడక్షన్ వాళ్లకు ముందు రోజే బాదం ఆకు ఇస్తర్లు కావాలని చెప్పాడట. 

మరుసటి రోజు ఉదయాన్నే షూటింగ్ మొదలైందట. ప్రొడక్షన్ వాళ్ళు బాదం ఆకు ఇస్తర్లకు బదులు మరేవో తెచ్చారట. అడిగింది బాదం ఆకు ఇస్తర్లు కదా అని బాపు ప్రొడక్షన్ వాళ్ళ మీద సీరియస్ అయ్యాడట. దొరకలేదని వారు సమాధానం చెప్పారట. ఇంత పెద్ద హైదరాబాద్ లో బాదం ఆకులు దొరకకపోవడం ఏమిటని... రెండు కార్లలో వెతకడానికి బయలు దేరారట. 

46

చివరికి చిక్కడపల్లిలో ఒకరి ఇంట్లో బాదం చెట్టు కనిపించడంతో ఆకులు తెచ్చి ఇస్తర్లుగా కుట్టారట. అప్పటికి మధ్యాహ్నం అయిపోయిందట. ఇడ్లీలు చల్లారి పోవడంతో మళ్ళీ వేడిగా తెప్పించి షూటింగ్ చేశారట. ఆ చిత్రానికి నిర్మాతలు వారే కావడంతో చిన్న ఆకు వద్ద కాంప్రమైజ్ కాలేదు. 

 

56

ఇంత చేస్తే... ఆ సీన్ ఎడిటింగ్ లో లేపేశారట. నిజానికి ఇడ్లీ ఏ ఆకులో తిన్నారు అనేది ప్రేక్షకులకు అనవసరం. అందులోనూ ఆ ఆకుతో కథ ముడిపడి కూడా లేదు. ప్లేట్ లో పెట్టి సీన్ లాగించేసినా ఓకే. అయితే ఆ కాలం దర్శకుల నిబద్ధతకు ఇది నిదర్శనం. స్క్రిప్ట్ ని గట్టిగా ఫాలో అవ్వాలని చెప్పడానికి ఒక ఉదాహరణ. 

66

బాపు-రమణ కలిసి అనేక చిత్రాలకు పని చేశారు. 2011లో రమణ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనంతరం మూడేళ్లకు 80 ఏళ్ల వయసులో 2014లో బాపు తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిన వీరిద్దరి పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. క్లాసిక్స్ అందించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Recommended image2
Missing Meghana Review: మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్యూ.. రామ్‌ కార్తీక్‌, అంకిత్‌ కొయ్య థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Jabardasth: మెగాస్టార్ నే మెప్పించిన జబర్దస్త్ కమెడియన్, ఒక్క ఏడాది 8 సినిమాలు, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నటుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved