MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి కోరుకున్నట్లు అల్లు అర్జున్ అల్లుడుగా ఇంటికి వచ్చి ఉంటే... పెద్ద కథే నడిచిందిగా!

చిరంజీవి కోరుకున్నట్లు అల్లు అర్జున్ అల్లుడుగా ఇంటికి వచ్చి ఉంటే... పెద్ద కథే నడిచిందిగా!

మేనల్లుడైన అల్లు అర్జున్ ని చిరంజీవి ఇంటికి అల్లుడు చేసుకోవాలని అనుకున్నాడట. అదే జరిగి ఉంటే సమీకరణాలు మారిపోయేవి. ఏం జరిగింది అంటే...  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 11 2024, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల మొదటి వివాహం అప్పట్లో టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. ఆమె శిరీష్  భరద్వాజ్ అనే వ్యక్తిని 2007లో ప్రేమ వివాహం చేసుకుంది.  ఎవరికీ తెలియకుండా ఆర్యసమాజ్ లో శిరీష్  ని పెళ్లి చేసుకుని శ్రీజ మీడియా ముందుకు వచ్చింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది. శ్రీజ తీరు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. శ్రీజ దంపతులకు నివృతి అనే కూతురు జన్మించింది.  కొంతకాలం తర్వాత శ్రీజ - శిరీష్ మధ్య విభేదాలు తలెత్తాయి. 
 

25

తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ శిరీష్  భరద్వాజ్ పై శ్రీజ కేసు పెట్టింది. అనంతరం విడాకులు తీసుకుంది. 2014లో శ్రీజ -శిరీష్ విడిపోయారు. ఆ తర్వాత  శ్రీజ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది. పెద్దలు కుదిర్చిన కళ్యాణ్ దేవ్ తో అంగరంగ వైభవంగా ఆమె పెళ్లి జరిగింది. కళ్యాణ్ దేవ్ రెండు మూడు సినిమాల్లో కూడా నటించడం విశేషం. కాగా కళ్యాణ్ - శ్రీజ లకు నివిష్క అనే అమ్మాయి ఉంది. 
 

35
Sreeja Konidela

Sreeja Konidela


అయితే గత రెండేళ్లుగా శ్రీజ కళ్యాణ్ తో దూరంగా ఉంటుంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి చిరంజీవి దగ్గరే ఉంటుంది. కళ్యాణ్ తో ఆమె విడాకులు తీసుకుందా లేక మరేదైనా కారణం ఉందో తెలియదు. కానీ అతనితో కలిసి లేదు అని స్పష్టమైంది. చాలా కాలంగా ఇద్దరు కలిసి కనిపించడం లేదు. పైగా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో వాళ్ళు విడిపోయారు అని ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు. 
 

45
Sreeja-Kalyan Dev

Sreeja-Kalyan Dev


అయితే ప్రస్తుతం శ్రీజ సోలో గా ఉంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అయితే శ్రీజ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలు పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా శ్రీజ కి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతుంది. 

55
Chiranjeevi

Chiranjeevi

ఆమె శిరీష్ ని ప్రేమ వివాహం చేసుకోకపోతే...  అల్లు అర్జున్ చిరంజీవి అల్లుడు అయ్యేవాడట. శ్రీజకు అల్లు అర్జున్ తో వివాహం చేయాలని చిరంజీవి ఎంతో ఆశపడ్డారట. అల్లు అరవింద్ కూడా శ్రీజను తన ఇంటి కోడలిగా చేసుకోవాలని అనుకున్నారట. కానీ శ్రీజ, ప్రేమ వివాహం చేసుకుంది. లేదంటే ఆమె జీవితం మరోలా ఉండేది. స్టార్ హీరో భార్యగా శ్రీజ ఉండేవారు. ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sharwanand: సోషల్ మీడియా నుంచి శర్వానంద్ పెళ్లి ఫోటోలు మాయం..నిజంగానే విడిపోతున్నారా ?
Recommended image2
Ravi Dubey House: 'రామాయణం' లక్ష్మణుడు రవి దుబే ఇల్లు చూశారా? అదొక ఇంద్రభవనం.. 7 ఫొటోల్లో చూడండి
Recommended image3
Ramayana Movie: 'రామాయణ'కి 700 కోట్ల OTT ఆఫర్.. మేకర్స్ ఎందుకు వద్దన్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved