చిరుని చూసి ` ఈ ఆంటీ ఎవరు` అడిగారు, అది కదా సక్సెస్ అంటే
పిల్లలు కూడా `అమ్మా.. ఈ ఆంటీ ఎవరు` అంటూ సురేఖని అడిగారట. తాను నోరు విప్పేంత వరకూ ఎవరూ ..
దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ఇటీవల పద్మవిభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
Chiranjeevi Konidela
ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి అభిమానులు ఆయన కృషి, పట్టుదల, ఆయన వేసిన విభిన్నమైన పాత్రలను గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి విభిన్నమైన గెటప్ లలో చిరంజీవి వేసిన ఆంటి లా కనపడటే గెటప్ ఒకటి.
Chiranjeevi Konidela
అప్పటికీ ఇప్పటికీ లేడీ గెటప్పులంటే మన స్టార్ హీరోలకు సరదా. ప్రతీ హీరో డూ ఎప్పుడో ఒకప్పుడు మీసం తీసేసి, చీర కట్టి అలరించిన వాళ్లే. మేడమ్ సినిమాతో రాజేంద్ర ప్రసాద్, చిత్రం భళారే విచిత్రం సినిమాతో నరేష్ లాంటి వాళ్లయితే – సినిమా మొత్తం చీరలోనే కనిపించిన సందర్భాలున్నాయి. కమల్ హాసన్ ..భామనే సత్య భామనే అయితే చెప్పక్కర్లేదు. ఇక చిరంజీవి కూడా లేడీ గెటప్పుతో అదరగొట్టి ఆ లిస్ట్ లో చేరారు.
Chiranjeevi Konidela
జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘చంటబ్బాయి’ సినిమాలోని ఓ పాటలో చిరు అమ్మాయిలా మారిపోయాడు. చిరుని మీసం లేకుండా, లేడీ గెటప్పులో చూడడం అదే మొదటి సారి. అదే చివరి సారి కూడా. చంటబ్బాయి లోని ఓ పాట కోసం జంథ్యాల చిరుతో రకరకాల గెటప్పులు వేయించారు.
అందులో చార్లిచాప్లిన్, లేడీ గెటప్పులు ప్రధానమైనవి. ఈ రెండు గెటప్పుల విషయంలోనే చిరు బాగా కొద్దిగా కంగారుపడ్డారట. చార్లి చాప్లిన్ గెటప్ వేయడానికి భయపడిన చిరు… ఇంటి దగ్గర మేకప్ టెస్ట్ చేయించుకుని, ఓ ట్రైల్ షూట్ చేసి, నమ్మకం కుదిరాకే, సెట్స్‌పైకి వెళ్లార్ట.
Chiranjeevi
ఇక లేడీ గెటప్ విషయానికి వస్తే... చిరంజీవిని అందకు ముందు ఆడ వేషం వేయమని ఎవరూ అడగలేదు. జంథ్యాల అలా ఆంటీలా కనపడమని అడిగేసరికి..మొదట చిరంజీవికి సిగ్గేసిందట. అలా కనిపిస్తే, ఫ్యాన్స్ ఎలా స్వీకరిస్తారో, అనే భయం కూడా కలిగిందని ఆయనే చెప్పుకొచ్చారు. కానీ.. కొత్తగా ఉంటుందన్న ధీమాతో లేడీ గెటప్పుకి ఓకే చెప్పారు. ఆ రోజు షూటింగ్ అయిపోయిన వెంటనే, అదే గెటప్పుతో చిరు ఇంటికి వెళ్లారట.
Chiranjeevi
చిరంజీవిని అలా లేడీ గెటప్ లో చూసి.. శ్రీమతి సురేఖ కూడా గుర్తు పట్టలేదట. పిల్లలు కూడా `అమ్మా.. ఈ ఆంటీ ఎవరు` అంటూ సురేఖని అడిగారట. తాను నోరు విప్పేంత వరకూ ఎవరూ తనని గుర్తించలేదని చిరు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆడ వేషంలో చిరు ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసినా,.. శ్రీమతికి మాత్రం నచ్చలేదట.`ఇంకెప్పుడూ ఇలాంటి గెటప్పులు వేయకండి. మీకు మళ్లీ మీసాలు వచ్చేంత వరకూ నా దగ్గరకు రాకండి` అంటూ అన్నారట సురేఖ. ఆ తరవాత.. చిరు ఎప్పుడు మీసాలు తీసేసే పాత్రలు చేయలేదు.