మాజీ భర్తకు మలైకా హగ్గులు... ప్రియుడు అర్జున్ కపూర్ పరిస్థితి ఏంటి!
మాజీ భర్త అర్భాజ్ ఖాన్ తో మలైకా అరోరా సన్నిహితంగా కనిపించడం హాట్ టాపిక్ అవుతుంది. ఎయిర్ పోర్ట్ లో కలిసిన వీరిద్దరి మధ్య పలకరింపులు చోటుచేసుకున్నాయి.

Malaika Arora
బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. అయితే ఆమె సడన్ గా మాజీ భర్త అర్భాజ్ ఖాన్ తో కనిపించారు. ఇద్దరూ మర్యాదపూర్వకంగా కౌగిలించుకున్నారు. ఈ పరిణామం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.
సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్-మలైకా అరోరా 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. చాలా కాలం కలిసి కాపురం చేశారు. మనస్పర్థలతో అనంతరం విడిపోయారు. 2017లో అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి. అర్భాజ్-మలైకాలకు 2002లో అబ్బాయి పుట్టాడు. అతని పేరు అర్హాన్ ఖాన్ కాగా... మలైకా వద్దే పెరుగుతున్నాడు.
కాగా 2016 నుండి అర్జున కపూర్ తో మలైకా రిలేషన్ లో ఉన్నారు. అంతకు ముందే వీరి మధ్య ఎఫైర్ ఉందనేది టాక్. అర్భాజ్ ఖాన్ మలైకాకు విడాకులు ఇవ్వడానికి కారణం అర్జున్ కపూర్ తో ఎఫైరే అనే వాదన ఉంది. మలైకా కార్ డ్రైవర్ ఈమె రాసలీలలు గురించి అర్భాజ్ ఖాన్ తో చెప్పాడట. అలా మొదలైన గొడవలు విడాకులకు దారితీశాయట.
ఇక 49 ఏళ్ల మలైకాతో 37 ఏళ్ల అర్జున్ కపూర్ ప్రేమాయణం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతుంది. మొదట్లో ఈ న్యూస్ సంచలనం రేపగా మెల్లగా జనాలు అలవాటు పడ్డారు. ఇష్టపడ్డాక కులం, మతం, వయసు, పెళ్లి, పిల్లలు అడ్డు ఏంటని ఫిక్స్ అయ్యారు. అర్జున్ కపూర్ వివాహం చేసుకోవడం లేదు. మలైకానే చేసుకుంటాడనే వాదన కూడా ఉంది.
కాగా సడన్ గా మలైకా తన మాజీ భర్తను కలిశారు. ఇద్దరి మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి. వీరి కొడుకు అర్హాన్ ఖాన్ విదేశాలకు వెళుతున్నాడు. దీంతో సెండ్ ఆఫ్ చెప్పేందుకు ఇద్దరూ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఈ క్రమంలో మాటలు కలిశాయి. ఫార్మల్ గా విషింగ్ హగ్ ఇచ్చుకున్నారు. అంతకు మించి ఏమీ లేదు. అనంతరం ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు.
కాగా ఐదు పదుల వయసులో కూడా సూపర్ మోడల్ గా మలైకా అరోరా దూసుకుపోతున్నారు. ఫిట్నెస్ కరెక్ట్ గా మైంటైన్ చేసే మలైకా వయసు దరిచేరనీయడం లేదు. వ్యాయామం, యోగా ఆమె దిన చర్యలో భాగంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటిస్తారు. ఆమె అలానే ఉండి అర్జున్ కపూర్ ముసలివాడైపోయినా ఆశ్చర్యం లేదు.
ఇక అర్జున్ కపూర్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. కపూర్ ఫ్యామిలీ కిడ్ కావడంతో ఏదో నెట్టుకొస్తున్నాడు. స్టార్డమ్ తెచ్చే మూవీ మాత్రం ఇంతవరకు పడలేదు. అర్జున్ కపూర్ చెల్లి జాన్వీ కపూర్ పరిస్థితి కూడా అలానే ఉంది.