పవన్ తో రేణూ పిల్లలు... మళ్ళీ ఇద్దరు ఒక్కటయ్యారా?
First Published Dec 2, 2020, 1:42 PM IST
దాదాపు 10ఏళ్ళు పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ కలిసి కాపురం చేశారు. బద్రి సినిమాతో మొదలైన వీరి బంధం 2011 వరకు కొనసాగింది. 2012లో అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. పిల్లలు అకీరా, ఆద్య తల్లి దగ్గరే పెరుగుతున్నారు.

పవన్ తో విడిపోయాక తాను పడిన మానసిక వేదన, ఆర్థిక ఒడిదుడుకుల గురించి రేణూ బహిరంగానే మాట్లాడారు. తన స్వశక్తితో ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేశానని, పవన్ నుండి ఆర్థికంగా తనకు ఎటువంటి మద్దతు లభించలేదని అన్నారు.

పరోక్షంగా పవన్ ని పెళ్లి చేసుకోవడం వలన పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా నష్టపోయానని రేణూ దేశాయ్ అనేక ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. ఈ విషయంలో రేణూపై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా దాడికి దిగారు. రేణూ రెండో పెళ్లిని కూడా పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?