- Home
- Entertainment
- Natu Natu Song: నాటు నాటు సాంగ్ రాజమౌళి ఇక్కడ నుండి లేపేశారా?... కాపీ చేయనంటూనే దొరికిపోయాడు!
Natu Natu Song: నాటు నాటు సాంగ్ రాజమౌళి ఇక్కడ నుండి లేపేశారా?... కాపీ చేయనంటూనే దొరికిపోయాడు!
ఎంత పెద్ద దర్శకుడైన కాపీ ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే. ఇతర భాషా చిత్రాల్లోని అద్భుతమైన సన్నివేశాలు,పాటలు, యాక్షన్ సీన్స్ కొందరు దర్శకుడు కావాలనే లేపేస్తారు. కొన్నిసార్లు అనుకోకుండా సింక్ అవుతూ ఉంటాయి. అయితే దీన్ని దర్శకులు స్ఫూర్తిగా అభివర్ణిస్తారు.

RRR Movie
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కూడా దీనికి మినహాయింపు కాదు. ఆయన గత చిత్రాలలోని కొన్ని సన్నివేశాలపై కాపీ ఆరోపణలు వచ్చాయి. కాగా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ ఈవెంట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆరోపణలు వస్తూనే ఉంటాయి, సినిమాలో అది ఒక భాగం, కాఫీ చేసినా చేయకున్నా ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి ఆరోపణలు చేస్తారని చెప్పుకొచ్చారు.
RRR Movie
కాగా ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)లో కూడా ఆయన్ను ఓ కాపీ మరక వెంటాడుతుంది. సోషల్ మీడియాలో దీని గురించి ప్రత్యేకంగా చర్చ నడుస్తుంది. ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'నాటు నాటు సాంగ్' విశేష ఆదరణ దక్కించుకుంది. సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరు హీరోల ఎనర్జిటిక్ స్టెప్స్ గూస్ బంప్స్ కలిగించాయి.
RRR Movie
విజువల్ ట్రీట్ గా ప్రేక్షకులు పొగుడుతున్న ఈ నాటు నాటు సాంగ్(Natu Natu song) కూడా కాపీనే అంటున్నారు కొందరు. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి హాలీవుడ్ కమెడియన్స్ ఓ సాంగ్ కి చేసిన స్టెప్స్ నాటు నాటు సాంగ్ కి దగ్గరగా ఉన్నాయి. సదరు వీడియో తెరపైకి తెచ్చిన నెటిజెన్స్ రాజమౌళి వారిని కాపీ చేశారంటున్నారు. నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన ప్రేమ్ రక్షిత్ కి రాజమౌళి సూచనలు చేసి ఉంటారని అంటున్నారు.
RRR Movie
అయితే ఈ ఆరోపణలు రాజమౌళి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని మరొక వర్గం వాదిస్తుంది. ఎప్పుడో వందేళ్ల క్రితం పాటలో ఇద్దరు ఆర్టిస్టుల సింక్ చేస్తూ డాన్స్ చేసినంత మాత్రాన నాటు నాటు సాంగ్ ని కాపీ చేశారనడంలో అర్థం లేదంటున్నారు. ఆ మాటకు వస్తే ఇండియాలో ఇప్పటికే ఇద్దరు హీరోలు కలిసి డాన్స్ చేసిన పాటలు ఉన్నాయంటున్నారు.
RRR Movie
బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ మొదట్లోనే ఈ ఆరోపణ చేశారు. మూవీలో హ్రితిక్, టైగర్ ష్రాఫ్ కలిసి చేసిన సాంగ్ స్ఫూర్తిగా నాటు నాటు సాంగ్ రాజమౌళి తెరకెక్కించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు వస్తూ ఉండేవే. జనాలకు కూడా ఇవేమి అవసరం లేదు. కాపీ కానీ, సృజన కానీ వాళ్లకు నచ్చితే చాలు.
RRR Movie
ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి మరొక ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. తెలుగు స్టేట్స్ లో ఏకంగా బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల వసూళ్లకు దగ్గరవుతుంది.