- Home
- Entertainment
- నాని నుంచి చిరంజీవి వరకు, స్టార్ హీరోల అప్‌కమింగ్ మూవీస్.. గ్యారెంటీ హిట్ అనే నమ్మకమున్నవి ఇవే, మీరేమంటారు ?
నాని నుంచి చిరంజీవి వరకు, స్టార్ హీరోల అప్‌కమింగ్ మూవీస్.. గ్యారెంటీ హిట్ అనే నమ్మకమున్నవి ఇవే, మీరేమంటారు ?
రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, అఖండ 2 లాంటి చిత్రాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. వీటిలో కచ్చితంగా హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్న చిత్రాలేంటో చూద్దాం.

స్టార్ హీరోల అప్‌కమింగ్ మూవీస్
టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి కొన్ని క్రేజీ చిత్రాలు రాబోతున్నాయి. అఖండ 2, రాజా సాబ్ లాంటి చిత్రాలు కొన్ని నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయి. మరికొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. చిరంజీవి, బాలయ్య, ప్రభాస్, రవితేజ, రాంచరణ్, మహేష్ లాంటి హీరోల నుంచి రాబోతున్న చిత్రాలు ఏంటి ? ఆ చిత్రాలలో ఏవి గ్యారెంటీ హిట్ అనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయో తెలుసుకునేందుకు వివరాల్లోకి వెళదాం.
బాలకృష్ణ - అఖండ 2
బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ సినిమాల ట్రాక్ రికార్డ్ దృష్ట్యా అఖండ 2 చిత్రం బ్లాక్ బస్టర్ ఖాయం అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన అఖండ 2 ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగా వైరల్ అయింది. సింహా, లెజెండ్, అఖండ లాంటి చిత్రాలు బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చి ఘన విజయం సాధించాయి.
రిలీజ్ డేట్ : డిసెంబర్ 5, 2025
రవితేజ - మాస్ జాతర
మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో రెండోసారి తెరకెక్కుతున్న చిత్రం మాస్ జాతర. ధమాకా తరహాలో శ్రీలీల, రవితేజ మ్యాజిక్ చేస్తే ఈ మూవీ హిట్ కావచ్చు. కానీ త్వరలో రిలీజ్ ఉన్నప్పటికీ ఈ మూవీకి సరైన బజ్ లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
రిలీజ్ డేట్ : అక్టోబర్ 31, 2025
ప్రభాస్ - రాజా సాబ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఎడి లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వినోదం అందించడంలో మారుతికి మంచి గుర్తింపు ఉంది. ప్రభాస్ కామెడీ అదరగొట్టేస్తారు. కానీ మారుతి చివరి చిత్రం పక్కా కమర్షియల్ మూవీ ఫ్లాప్ అయింది. దీనితో రాజా సాబ్ చిత్రాన్ని మారుతి ఎలా హ్యాండిల్ చేశారనే చిన్న టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉంది.
రిలీజ్ డేట్ : జనవరి 9, 2026
చిరంజీవి - మన శంకర వరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి తొలి కాంబినేషన్ లో మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రం రూపొందుతోంది. ఇది కూడా కామెడీ ఎంటర్టైనర్. ఈ మూవీలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్నారు. అనిల్ రావిపూడి పరాజయం ఎరుగని దర్శకుడు. చివరి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం మూవీ టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. చిరంజీవి కామెడీ ఎలా చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనితో ఈ మూవీ మినిమం గ్యారెంటీ హిట్ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
రిలీజ్ డేట్ :సంక్రాంతి రిలీజ్, 2026
రామ్ చరణ్ - పెద్ది
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ మూవీ కోసం చరణ్, బుచ్చిబాబు ఇద్దరూ ప్రాణం పెట్టేస్తున్నారు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆ మధ్యన వచ్చిన గ్లింప్స్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తోంది. జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. బుచ్చిబాబు విజన్, డెడికేషన్ చూస్తుంటే ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రిలీజ్ డేట్ : మార్చి 27, 2026
నాని - ది ప్యారడైజ్
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో దసరా తర్వాత ది ప్యారడైజ్ అనే చిత్రం రూపొందుతోంది. దసరా మూవీలో డైరెక్టర్ శ్రీకాంత్ నానిని మాస్ లుక్ లో చూపించిన విధానం మెప్పించింది. ప్యారడైజ్ మూవీ అంతకు మించి వైల్డ్ గా ఉండబోతోందని ఆల్రెడీ హింట్ ఇచ్చారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు నాని కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ అవుతుందని భావిస్తున్నారు.
రిలీజ్ డేట్ : మార్చి 26, 2026
అల్లు అర్జున్ - AA 22
పుష్ప 2 లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబోలో 800 కోట్ల బడ్జెట్ లో సైన్స్ ఫిక్షన్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో పార్లల్ యూనివర్స్ కాన్సెప్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అట్లీ వరుస విజయాలు అందుకుంటున్నారు. గొప్ప విజన్ ఉన్న దర్శకుడు. దీనితో AA 22 చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయం అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రిలీజ్ కి టైం పడుతుంది.
రిలీజ్ డేట్ : ఖరారు కాలేదు
మహేష్ బాబు - SSMB 29
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ తొలిసారి చిత్రం రాబోతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే 1000 కోట్ల అత్యధిక బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఫారెస్ట్ అడ్వెంచర్ కథతో ఈ చిత్రం ఉండబోతోంది. ఇందులో హిందూ పురాణాలకు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. రాజమౌళి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. SSMB 29 తో బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు ప్రపంచస్థాయిలో సంచలనం సృష్టించబోతున్నారు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రిలీజ్ డేట్ : ఖరారు కాలేదు