- Home
- Entertainment
- మొత్తం నాశనం చేశావ్.. మహేష్ బాబుపై రాజమౌళి ఫైర్.. ఎస్‌ఎస్‌ఎంబీ29లో సర్‌ప్రైజ్‌లు లీక్
మొత్తం నాశనం చేశావ్.. మహేష్ బాబుపై రాజమౌళి ఫైర్.. ఎస్‌ఎస్‌ఎంబీ29లో సర్‌ప్రైజ్‌లు లీక్
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో మొదటిసారి మూవీ రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను మహేష్ లీక్ చేశారు. దీంతో జక్కన్న ఫైర్ అయ్యారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది.

మహేష్, రాజమౌళి మూవీపై భారీ అంచనాలు
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రం `ఎస్‌ఎస్‌ఎంబీ29`. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. చాలా ప్రైవేట్‌గా షూటింగ్‌ని చేస్తున్నారు రాజమౌళి. షూటింగ్ డిటెయిల్స్ కూడా ఇవ్వడం లేదు. అయితే ఇప్పటికే పలు లీక్‌లు బయటకు వచ్చాయి. షూటింగ్ సెట్‌లోని ఫోటోలు బయటకు వచ్చాయి. ఓ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ లీక్‌లు సినిమాని డ్యామేజ్ చేసేలా ఉన్నా, అవి మూవీపై అంచనాలను అమాంతం పెంచాయి. రాజమౌళి చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారనేది అర్థమయ్యింది.
ఈ నెలలో `ఎస్‌ఎస్‌ఎంబీ29` అప్ డేట్ ఇవ్వబోతున్నా రాజమౌళి
ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని మహేష్ ప్రీ లుక్ ని విడుదల చేశారు. నవంబర్‌లో అప్ డేట్ ఇస్తామని తెలిపారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్‌ని విడుదల చేస్తారని తెలుస్తోంది. నవంబర్ 15న ఒక ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో నవంబర్ నెల శనివారం నుంచే ప్రారంభమైంది. దీంతో మహేష్ ఆగలేదు. నవంబర్ నెల వచ్చిందని రాజమౌళికి గుర్తు చేశారు. `నవంబర్ నెల వచ్చింది రాజమౌళి` అంటూ కన్నెర చేశారు. దీనికి జక్కన్న కూడా స్పందించారు. `ఎస్.. ఏ సినిమాలకు రివ్యూ ఇద్దామనుకుంటున్నారు ఈ నెల` అని సెటైర్ వేశారు.
రాజమౌళిపై మహేష్ బాబుకి కోపం
దీంతో మండిపోయిన మహేష్ `మీరు ఎప్పటికీ మహాభారతం తీస్తూనే ఉంటారు సార్. ముందుగా నవంబర్‌లో మీరు మాకు ఏదో హామీ ఇచ్చారు. దయజేసి మీ మాట నిలబెట్టుకోండి` అని సూచించారు. దీనికి రాజమౌళి రియాక్ట్ అవుతూ, `ఇప్పుడే ప్రారంభమైంది మహేష్. నెమ్మదిగా ఒక్కొక్కటిగా వెల్లడిస్తాం` అని తెలిపారు. ఇక ఆపులేకపోయిన మహేష్ `ఇంత నెమ్మది ఎలా సార్. 2030లో ప్రారంభిస్తారా?` అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. `మీకు తెలుసో లేదో.. మన దేశీ అమ్మాయి ప్రియాంక చోప్రా జనవరి నుంచే ఇన్‌స్టా స్టోరీలలో హైదరాబాద్‌లోని ప్రతి వీధిలో పోస్ట్ చేస్తుంద`ని వెల్లడించారు.
ప్రియాంక ఎంట్రీతో మహేష్‌పై జక్కన్న ఫైర్
దీంతో ప్రియాంక చోప్రా రంగంలోకి దిగింది. `హలో హీరో.. మీరు సెట్‌లో నాతో పంచుకునే అన్ని స్టోరీలను లీక్ చేయాలనుకుంటున్నారా? మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా ఎసేస్తా` అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో రాజమౌళికి కోపం వచ్చింది. ప్రియాంక చోప్రా పేరుని ఎందుకు బయటపెట్టావంటూ మండిపడ్డాడు. నువ్వు సర్‌ప్రైజ్‌లను నాశనం చేస్తున్నావంటూ ఫైర్ అయ్యారు. దీనికి మహేష్ రియాక్ట్ అవుతూ, `సర్ప్రైజా మీరు చెప్పేది పృథ్వీరాజ్ సుకుమారన్ గురించా?` అంటూ అమాయకంగా అసలు విషయాన్ని బయటపెట్టారు. దీంతో పృథ్వీరాజ్ రంగంలోకి దిగారు. `రాజమౌళి సర్, ఈ హైదరాబాద్ వెకేషన్స్ కోసం నాకు అలిబిస్ అయిపోతుంది. నేను దీన్ని ఇంకా ఇలానే కొనసాగిస్తే, నా ఫ్యామిలీకి నాపై అనుమానాలు స్టార్ట్ అవుతాయి` అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
మహేష్‌పై చిర్రెత్తిపోయిన రాజమౌళి
రాజమౌళికి చిర్రెత్తిపోయింది. `మహేష్ నువ్వు ఇప్పుడు కూడా అన్నీ నాశనం చేస్తున్నా`వంటూ ఫైర్ అయ్యారు. దీంతో రాజమౌళిని కూల్ చేసే ప్లాన్ చేశారు సూపర్ స్టార్. `దీనిని సంధి అని పిలుద్దాం. రేపు ఏదో ఒకటి పెట్టు. అయినా ఇప్పటికే అందరికీ అది తెలుసు. మీరు ఇప్పటికీ దాన్ని సర్‌ప్రైజ్ అని ఫీలవుతున్నారు చూడూ` అంటూ నవ్వుల ఎమోజీని పంచుకున్నారు మహేష్. ఇదంతా రాత్రి ట్విట్టర్(ఎక్స్)లో రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల మధ్య జరిగిన కన్వర్జేషన్. వీళ్లు గొడవ పడుతూనే `ఎస్‌ఎస్‌ఎంబీ29`కి సంబంధించిన ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. చాట్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. మొత్తానికి ఈ ఆదివారం ఏదో ఒక అప్ డేట్ రాబోతుందని అర్థమవుతుంది.
మహేష్, రాజమౌళి మూవీకి `వారణాసి` టైటిల్ ?
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా `ఎస్‌ఎస్‌ఎంబీ29`(వర్కింగ్ టైటిల్)తో మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దీనికి వారణాసి` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది. దీనికి అంతర్జాతీయ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు కూడా పనిచేయబోతున్నారట. అదే సమయంలో హాలీవుడ్ స్టూడియోలు కూడా భాగమయ్యాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో ప్రపంచ సాహసికుడిగా మహేష్ కనిపిస్తారని సమాచారం.