వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్, తెలుగులో ఎంత వసూలు చేసిందో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా వార్ 2. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈసినిమాలో ఎన్టీఆర్ స్పెషల్ పాత్రలో మెరిశాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమా తుది అంచనా ప్రకారం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది. ఇండియాలో వార్ 2 కలెక్షన్స్ ఎంత..? ఎన్టీఆర్ ప్రభావంతో తెలుగు లో భారీగా వసూలు చేసిందా? ప్రపంచ వ్యాప్తంగా వార్ 2 ఎంత వసూలు చేసింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెట్టడం, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేయడం టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమా హైప్ చాలా భారీగా ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల నుంచి 90 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్టు సమాచారం.
KNOW
వార్ 2 ఫస్ట్ డే బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు :
హిందీ వెర్షన్ (ఇండియా): 40 కోట్ల వరకు గ్రాస్
తెలుగు వెర్షన్: 30 కోట్ల వరకు
తమిళ వెర్షన్: 1 కోటి
ఓవర్సీస్ మార్కెట్: 15 కోట్ల వరకు
అడ్వాన్స్ బుకింగ్స్ లో హవా
అయితే ఈసినిమాకు బాలీవుడ్ లో హృతిక్ రోషన్, టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఇమేజ్ వల్ల, సినిమా రిలీజ్ కు ముందు నుంచే మంచి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవడంతో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వసూళ్లకు సబంధించిన వివరాలు ఒక అంచనా మాత్రమే. వార్ 2 సినిమా నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన ఇంత వరకూ రాలేదు. మూవీ యూనిట్ నుంచి అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.
వీకెండ్ హాలీడేస్ ప్రభావం
ఇక ఇదే రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా తొలి రోజే సుమారు 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.ఇదిలా ఉండగా, ఈ వారం మధ్యలో ఇండిపెండెన్స్ డే హాలిడే కావడంతో రెండు సినిమాలకు కూడా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం వంటి వీకెండ్ డేస్ కూడా ఉండటంతో వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, కలెక్షన్లు పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన ఈసినిమాలకు కలెక్షన్లు భారీగానే ఉండే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్
వార్ 2 సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా తన సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీపై ఫోకస్ పెట్టారు. ప్రశాంత్ నీల్ సినిమా కంప్లీట్ అయిన తరువాత తారక్ వెంటనే దేవర 2 సినిమా షూటింగ్ లో జాయిన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.