- Home
- Entertainment
- 100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించను, నయనతార రిజెక్ట్ చేసిన పెద్ద సినిమా ఏంటో తెలుసా?
100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించను, నయనతార రిజెక్ట్ చేసిన పెద్ద సినిమా ఏంటో తెలుసా?
నయనతార ఓపెద్ద సినిమాను వదులుకున్నారా? 100 కోట్లు ఇస్తామన్నా ఆమె ఒక హీరోతో సినిమా చేయను అన్నారా? ఈవిషయంలో నిజం ఎంత? ఇంతకీ ఏంటా సినిమా?

లేడీ సూపర్‌స్టార్
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్ గా ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ నయనతార. తన నటనతో పాటు తన ప్రిన్సిపల్స్ తో ఆమె ప్రత్యేకమైన నటిగా గుర్తింపు సాధించారు. 40 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం ఇమేజ్ తగ్గకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది నయనతార. రెమ్యునరేషన్ విషయంలో కూడా టాప్ లో ఉన్న ఈ సీనియర్ బ్యూటీ.. స్టార్ హీరోల సరసన హిరోయిన్ గా నటిస్తూ.. అదరగొడుతోంది. సౌత్ లో తిరుగులేని స్టార్ డమ్ తో దూసుకుపోతోంది నయన్.
KNOW
100 కోట్లు ఇచ్చినా నటించనన్న నయనతార
హిట్ సినిమాలతో పాటు వరుస వివాదాలతో పాపులర్ అయ్యింది నయనతార. ఈక్రమంలో ఆమె గురించి ఓ విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. నయనతార 100 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చినా ఓ హీరోతో నటించనని ఖరాఖండిగా చెప్పేసినట్టు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ లెజండ్ శరవణన్. ఆయనతో సినిమా చేయడానికి నయనతార విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఈ విషయం తమిళ సినీ జర్నలిస్టు బాలు ఆమధ్య కాలంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, 2022లో విడుదలైన "ది లెజెండ్" సినిమాలో శరవణన్ హీరోగా నటించారు. ఈసినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకోవాలని ఆయన గట్టిగా ప్రయత్నించారట. కానీ నయనతార మాత్రం ఈ సినిమాకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.
హీరోకు నో చెప్పిన నయనతార
సినిమాను రిజెక్ట్ చేసిన విషయం గురించి నయనతార ఇప్పటి వరకు మాట్లాడలేదు. కానీ తమిళ మీడియాలో సినిమా జర్నలిస్ట్ గా ఉన్న బాలు ఈ విషయం రివీల్ చేశారు. నయనతార ఇంటి ముందు అప్పుడప్పుడు రోల్స్ రాయ్స్ కారు ఉండేది. అది చూసి ఆశ్చర్యపోయాను. తర్వాత అదే కారు ఒక పెళ్లిలో కనిపించినప్పుడు విషయం తెలిసింది. అది లెజెండ్ శరవణన్ కారు. ఆయన తన సినిమాలో నటించమని నయనతారని చాలా అడిగారు. చాలాసార్లు ఆమె ఇంటికి కూడా వెళ్లారని ఆయన అన్నారు.
నయనతార ఇంటికి వెళ్లిన హీరో ఆమెకు రెగ్యులర్ రెమ్యూనరేషన్ కంటే డబుల్‌గా, అవసరమైతే 100 కోట్లు కూడా ఆఫర్ చేసినట్టు శరవణన్ వర్గాలు ప్రకటించాయని బాలు పేర్కొన్నారు. అయినప్పటికీ నయనతార స్పష్టంగా "100 కోట్లు ఇచ్చినా నటించను" అని చెప్పారట.
నయనతార సినిమాలు
ఈ నేపథ్యంలో, "ది లెజెండ్" సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ ఊర్వశి రౌతేలా నటించింది. కానీ ఈ సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. నయనతార ప్రస్తుతం కెజిఎఫ్ స్టార్ యష్‌తో కలిసి "టాక్సిక్" అనే భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార పాత్ర కీలకంగా ఉండబోతోందని తెలిసింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి వంటి ప్రముఖులు కూడా నటిస్తున్నారు. ఇక ఈసినిమాతో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది నయన్. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.
వ్యాపారంలో రాణిస్తోన్న లేడీ సూపర్ స్టార్
నయనతార బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ సరసన "జవాన్" సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, నయనతారకు దాని ద్వారా 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ లభించినట్టు సమాచారం. ఇక తాజా బిజినెస్ విభాగంలోనూ నయనతార తనదైన ముద్ర వేసుకుంది. సినిమాలతో పాటు చాలా వ్యాపారాలు చేస్తూ.. కోట్లు సంపాదిస్తోంది నయన్. అంతే కాదు సొంత విమానం కలిగిన అరుదైన హీరోయిన్లలో నయనతార ఒకరు. సినిమాలు, వ్యాపారాలతో పాటు పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ కోట్లు గడిస్తోంది స్టార్ హీరోయిన్ .
ధనుష్ తో నయనతార వివాదం
సినిమాలతో పాటు వివాదాలతో పాపులర్ అయ్యింది నయనతార. తన పెళ్లిని డాక్యుమెంటరీగా తెరకెక్కించడానికి ఓ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌తో డీల్ కుదుర్చుకుని ఏకంగా రూ.25 కోట్లు సంపాదించింది నయనతార. ఈ డాక్యుమెంటరీ విషయంలో కూడా వివాదంగా మారింది నటి. విఘ్నేష్ తో ప్రేమలో పడ్డ నానుమ్ రౌడీ థాన్ సినిమాలోని క్లిప్ ను తన డాక్యుమెంటరీలో పర్మీషన్ లేకుండా వాడటంతో, ఈ సినిమా నిర్మాత ధనుష్ ఈ విషయంలో లీగర్ లో ప్రొసీడ్ అయ్యారు. దాంతో ధనుష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది నయన్. ఆ వివాదం ఇంకా కోర్డులో కొనసాగుతూనే ఉంది.

