MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అప్పుడే పూరి జగన్నాధ్ పనైపోయింది అన్నారు, కానీ కొడితే దెబ్బకి బాక్సాఫీస్ షేక్.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్..

అప్పుడే పూరి జగన్నాధ్ పనైపోయింది అన్నారు, కానీ కొడితే దెబ్బకి బాక్సాఫీస్ షేక్.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లైగర్ చిత్రంతో పూరి జగన్నాధ్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గాయాన్ని డబుల్ ఇస్మార్ట్ చిత్రం మానేలా చేస్తుంది అని అంతా భావిస్తున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Aug 14 2024, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లైగర్ చిత్రంతో పూరి జగన్నాధ్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గాయాన్ని డబుల్ ఇస్మార్ట్ చిత్రం మానేలా చేస్తుంది అని అంతా భావిస్తున్నారు. పూరి జగన్నాధ్, రామ్ పోతినేని వెండితెరపై చేసే మ్యాజిక్ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. 

25

అయితే ఇలాంటి ఎదురుదెబ్బలు పూరి జగన్నాధ్ కి కొత్తేమి కాదు. లైగర్ చిత్రంతో పూరి జగన్నాధ్ పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. పూరి పనైపోయింది అని అంతా అన్నారు. దీనిపై స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వివి వినాయక్ మాట్లాడుతూ.. పూరిని కామెంట్ చేసే వాళ్లంతా ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంటారు. 

35

కానీ పూరి స్టామినా ఏంటో నాకు తెలుసు. కరెక్ట్ స్క్రిప్ట్ తో వస్తే పూరి జగన్నాధ్ ని మించినోడు లేడు. పూరి అంటే నాకు చాలా ఇష్టం. లైగర్ మాత్రమే కాదు.. అంతకు ముందు చాలా సార్లు పూరి జగన్నాధ్ గురించి ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. పోకిరికి ముందు పూరి పనైపోయింది అన్నారు. 

45

పోకిరి చిత్రానికి ముందు.. ఆంధ్రావాలా, 143 లాంటి ఫ్లాప్ చిత్రాలు ఎదురయ్యాయి. హిందీలో ఒక చిత్రంకి చేస్తే అది కూడా డిజాస్టర్. సూపర్ మూవీ యావరేజ్ గా నిలిచింది. దీనితో పూరి పనైపోయింది అని అన్నారు. కానీ పోకిరి చిత్రంతో కొడితే బాక్సాఫీస్ షేక్ అయింది. ఇప్పటికి నాకు బెస్ట్ స్క్రిప్ట్ అనిపించే చిత్రం పోకిరి అని వివి వినాయక్ అయ్యారు. 

55

పోకిరి కన్నా బాగా డబ్బు తెచ్చిపెట్టిన చిత్రాలు ఉండొచ్చు. కానీ అలాంటి మెస్మరైజింగ్ స్క్రిప్ట్ మరొకటి లేదు అని అన్నారు. పూరి జగన్నాధ్ తప్పకుండా కంబ్యాక్ అవుతాడని వివి వినాయక్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrithyunjay Review: `మృత్యుంజయ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. శ్రీవిష్ణుకి మరో హిట్‌ పడిందా?
Recommended image2
రామ్ చరణ్ కోసం రాసిన కథతో.. అల్లు అర్జున్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? నిజమెంత?
Recommended image3
Saraswathi Review: సరస్వతి మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌ దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved