- Home
- Entertainment
- ఫ్యాన్స్ పై విశ్వక్ సేన్ విసుగు, అభిమానులపై యంగ్ హీరో అసహనం.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
ఫ్యాన్స్ పై విశ్వక్ సేన్ విసుగు, అభిమానులపై యంగ్ హీరో అసహనం.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
పండగరోజు తమ హీరోను చూడాలని వచ్చిన అభిమానులను విసుగు చూపించాడు విశ్వక్ సేన్. స్టార్ హీరోలు కూడా తమ ఫ్యాన్స్ విషయంలో ఓపికగా వ్యవహరిస్తుండగా .. ఈ యంగ్ హీరో చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు.

టాలెంట్ తో ఎదిగిన హీరో
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. సొంత టాలెంట్ తో ఎదిగిన హీరో విశ్వక్ సేన్. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నవిశ్వక్ సేన్ (Viswak Sen). హీరోగా ఇమేజ్ తో పాటు.. వివాదాలు కూడా కొనితెచ్చుకుంటుంటాడు . ఇప్పటికే నాలుగైదు వివాదాలతో హల్ చల్ చేసిన యంగ్ హీరో.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యాడు. దీపాళి పండుగ సందర్భంగా అభిమానులతో అతని ప్రవర్తన వివాదానికి దారితీసింది.
వరుసగా ఫెయిల్యూర్స్...
కెరీర్ బిగినింగ్ నుంచే వరుసగా ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నూమా దాస్, హిట్, ఆకాశవాణంలో అర్జున కళ్యాణం, పాగల్ వంటి హిట్ సినిమాలతో ఆడియన్స్ లో మంచి ఇమేజ్ సాధించుకున్నాడు విశ్వక్ సేన్. కానీ ఈ మధ్య కాలంలో యంగ్ హీరో సినిమాలు వర్కౌట్ అవ్వడంలేదు. రీసెంట్ గా విడుదలైన ‘మెకానిక్ రాకీ’ , ‘లైలా’ సినిమాలు ఘోర పరాజయాలు కావడంతో.. పోటీలో వెనకబడిపోతున్నాడు విశ్వక్ సేన్. ఆ రెండు సినిమాల రిజల్ట్ తరువాత విశ్వక్ సేన్ స్వయంగా అభిమానులకు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
అభిమానులపై విశ్వక్ అసహనం
రీసెంట్ గా దీపావళి రోజు అభిమానులపై విశ్వక్ సేన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. విశ్వక్ సేన్ తన ఫ్యామిలీతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, కొంతమంది అభిమానులు ఆయన ఇంటికి వచ్చారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు వచ్చిన ఆ అభిమానులను చూసిన విశ్వక్ సేన్, “దీపావళి పండుగ లేదారా మీకు?” అని అసహనంగా ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ అభిమానులు "అన్నా, ఒక్కసారి మా కోసం క్రిందకు వస్తే, మీ ఫ్యామిలీతో ఒక వీడియో తీసుకుంటాం" అని చెప్పినప్పటికీ, విశ్వక్ సేన్ కేవలం “హ్యాపీ దీపావళి” అంటూ.. నిర్లక్ష్యంగా చేతులు ఊపి లోపలికి వెళ్లిపోయాడు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్
ఈ సంఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజెన్స్ కొందరు, “ఇంత ప్రేమతో ఇంటికి వచ్చిన అభిమానులను ఇలా నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు” అంటున్నారు. మరికొందరు మాత్రం “రెండు మూడు హిట్స్ వచ్చాక ఇలా ప్రవర్తిస్తే, పెద్ద స్థాయిలో ఉంటే ఎలా ఉండేవాడు?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం “పండగ రోజు అతని ఇంటికి వెళ్లి తిట్టించుకోవడం అవసరమా?” అని అభిమానులను తిడుతున్నారు. మొత్తానికి ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.