ఎట్టకేలకు ప్రభాస్ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ రిలీజ్అయ్యింది. హనురాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న సినిమాకు అందరు అనుకున్న విధంగానే ఫౌజీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్ని రహస్యాలు ఉన్నాయో తెలుసా? 

టైటిల్ కార్డు పడింది..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో.. అత్యంత ప్రతిష్టాత్మక తెరకెక్కుతోన్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా టైటిల్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. పీరియాడికల్ డ్రామా కథతో రూపొందుతున్న ఈమూవీకి.. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న విధంగానే ఫౌజీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు టీమ్. ప్రభాస్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన పౌజీ పవర్‌ఫుల్ టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రీలుక్ తోనే హైప్ పెంచిన దర్శకుడు

అసలు ముందుగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు టీమ్. హను రాఘవపూడి మైండ్ గేమ్ తో ఈసినిమాను ఫజిల్ మాదిరిగా క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రీలుక్ తో పాటు తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్ చూస్తుంటే అన్ని సినిమాలకంటే ఇది డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు అర్ధం అవుతుంది. ఈ లుక్ లో ప్రభాస్ ఫేస్, ఐస్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అంతే కాదు ఫౌజీ అంటేనే సైనికుడు అని అర్ధం, ఈలెక్కన చూసుకుంటే ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో ఆయన పాత్రను “పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడిగా, పాండవులకు అండగా నిలిచే కర్ణుడిగా, విలువిద్యలో ఆరితేరిన ఏకలవ్యుడిగా యుద్ధానికి సిద్ధమైన యోధుడు”గా ఎలివేట్ చేశారు.ఈ మాదిరిగా తెలుగులో ఏ సినిమా రాలేదనే చెప్పాలి.

ఇక ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఫెరోషియస్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సైనికుడి పాత్ర చేస్తున్నందున.. యాక్షన్ సీక్వెన్స్‌లుకు ఏమాత్రం కొదవ ఉండదు. అయితే ఎప్పుడో 1930 కాలంలో జరిగిన యుద్ద నేపథ్యాన్ని ఈసినిమాలో ఉపయోగించుకున్నట్టు సమాచారం. దాంతో సినిమా వాతావరణం కూడా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ లు కానీ.. ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉంటాయని అంటున్నారు. ఇక ఈసినమాలో ప్రభాజ్ కు జోడీగా ఇమాన్వీ నటిస్తుండగా, సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Scroll to load tweet…

సైనికుడిగా ప్రభాస్

‘ఫౌజీ’ అంటేనే సైనికుడు అని అర్థం. ఈ టైటిల్ ద్వారానే కథవెనుక అర్ధాన్ని డైరెక్టర్ హను రాఘవపూడి స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాడు. యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ప్రభాస్ ఓ యోధుడిగా కనిపించనున్నాడు. ఇండియాకు ప్రీడం రాకముందు జరిగిన సమరయోధుల పోరాటాలను.. ఈ సినిమాలో చూపించబోతున్నట్టు సమాచారం. ఇక ఈసినిమాకు ట్యాగ్‌లైన్ కూడా – “చరిత్రలో దాగి ఉన్న అధ్యాయాల నుంచి ఓ సైనికుడు అత్యంత ధైర్యవంతమైన కథ” అని ఉంది.

1930వ దశకంలోని కథతో.. ఈసినిమా నేపథ్యం ఉండబోతోంది. ప్రీ లుక్‌ ద్వారానే తెలిపాడు దర్శకుడు. ప్రీలుక్ లో “A Battalion who walks alone”, “Most wanted since 1932” వంటి లైన్లు ఉండగా, ప్రభాస్ ఓ బెటాలియన్ కు లీడర్ గా కనిపించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతే కాదు మరికొంత మంది సమాచారం ప్రకారం. రెండో ప్రపంచ యుద్ధానికి సబంధించిన అంశాలు కూడా ఈసినిమా లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్, మిథున్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌తో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. మేకర్స్ వచ్చే ఏడాది ఆగస్టులో ఫౌజీని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.