- Home
- Entertainment
- Janaki kalaganaledu: మల్లిక కుట్ర నుంచి జానకిని కాపాడిన విష్ణు... ఇలాంటి తోడికోడలు ఉండకూడదు బాబోయ్!
Janaki kalaganaledu: మల్లిక కుట్ర నుంచి జానకిని కాపాడిన విష్ణు... ఇలాంటి తోడికోడలు ఉండకూడదు బాబోయ్!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 26వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... మల్లిక జానకి రామ లను అక్కడ చూస్తుంది.ఇంతట్లో ఆ పక్కింటి పెద్దమ్మ పొయ్య మీద పాలు పెట్టాను అని అక్కడ నుంచి తప్పించుకుంటుంది. మల్లికా కూడా వెళ్ళిపోతూ ఉండగా జానకి మళ్ళికని ఆపుతుంది. మల్లికా భయంతో జానకి అది అంటే అని మాట తడబడుతు ఉండగా విష్ణు, జ్ఞానాంబ గోవిందరాజులు అక్కడికి వస్తారు. ఇంతట్లో జానకి నీకోసం ఏం తెచ్చనో చూడు అని చిన్నపిల్లల ఫోటోలు తెస్తుంది. దీని కోసమైనా జానకి నువ్వు నన్ను ఆపింది అని మల్లిక అనగా ఆ దీనికోసమే మల్లికా అని అంటుంది జానకి.
అప్పుడు మల్లిక హమ్మయ్య ఇది ఏమీ వినలేదు అనుకుంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తోటి కోడలు అని కూడా చూడకుండా సొంత చెల్లికి బిడ్డ పడుతున్నట్టు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు జానకి అని అందరూ జానకిని పొగుడుతూ ఉంటారు.ఇదేంటి ఇలా మార్కులు కొట్టేస్తుంది అని మల్లిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో మల్లికా కూర్చొని టీవీ చూస్తూ ఉండగా జానకి ఫ్రూట్స్ సలాడ్ తెచ్చి ఇస్తుంది. అప్పుడు మల్లికా దాన్ని తింటూ ఉన్నప్పుడు జ్ఞానమ్మ దాన్ని చూసి ఆగు మల్లిక అందులో బొప్పాయి పళ్ళు ఉన్నాయి.
నిన్ను ఎవరు తినమన్నారు. కడుపుతో ఉన్నప్పుడు బొప్పాయి తినకూడదని తెలీదా అని తిడుతుంది .అప్పుడు అందరు అక్కడికి వస్తారు. ఇంతట్లో మల్లికా, నేను చేయలేదు అత్తయ్య గారు జానకి నాకు ఇది చేసి ఇచ్చింది అని అంటుంది. ఇంతట్లో గోవిందరాజు, పక్క వాళ్ళ మీద తొయ్యడం లో ముందు ఉంటావు.జానకి కి బొప్పాయి పళ్ళు వేయకూడదు అని తెలియదు అనుకుంటున్నావా అని అడగగా కావాలంటే మీరు అడగండి మావయ్య గారు అని అంటుంది మల్లిక.సలాడ్ నేనే చేశాను మని అందులో నేను బొప్పాయిపల్లి వేయలేదు అత్తయ్య గారు అని జానకి అంటుంది.
నువ్వు కావాలని చేసేవో లేదో తెలియదు కానీ కడుపు రాలేదు నీకు అని ఎంతో కొంత బాధ ఉంటుంది కదా జానకి. దాని వల్ల పొరపాటున ఇలా జరిగిందేమో అని మల్లికా నటిస్తూ ఉంటుంది. ఇంతటిలో జ్ఞానం జానకిని తిడుతూ నీకు ముందే చెప్పాను చదువు విషయం ద్వారా ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం మానేయకూడదు అని నీవు ఒక తప్పుని చేసేసావు అని అనగా ఇంతట్లో విష్ణు అక్కడికి వచ్చి నేనే అందులో బొప్పాయి కలిపాను అమ్మ. వదిన ఫ్రూట్స్ చేసి పక్కకు వెళ్ళింది ఇంతట్లో బొప్పాయి పళ్ళు చూసి అవి ఆరోగ్యానికి మంచిది అని, తెలియక అందులో కలిపాను నన్ను క్షమించు అని అంటాడు.
అప్పుడు జ్ఞానంభ విష్ణు నీ తిట్టి వదిలేస్తుంది దాని తర్వాత మల్లికా విష్ణు దగ్గరికి వెళ్లి కడుపుతో ఉన్న వాళ్ళని ఆనందంగా చూసుకోవాలని మీకు తెలియదా అయినా జానకి అవి కలిపితే మీరు ఎందుకు అబద్ధం చెప్పారు అని అనగా ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే చెప్పు తో కొడతాను.అవి నువ్వే కలిపవు అని నేను అమ్మ తో చెప్పా అనుకో ఇంక నీకు జీవితంలో ఇంట్లో స్నానం ఇవ్వరు. నువ్వు అక్కడ పళ్ళు కలపడం నేను చూశాను. అసలు నీకు వదిన అంటే ఎందుకు అంత కోపం తను నిన్ను సొంత చెల్లి లా చూసుకుంటున్నారు.
కానీ నువ్వు ఎప్పుడు తనని అమ్మ దగ్గర ఇరికిద్దామా అని చూస్తున్నావు అని విష్ణు అంటాడు. మల్లిక మాత్రం తోటకూడాల మధ్య ఇలాంటి గొడవలు ఉండాల్సిందే మీరు మధ్యలో దొరకండి అని విష్ణుని గట్టిగా తిడుతుంది.ఆ తర్వాత సీన్లో రామ గదిలో మల్లిక గురించి ఆలోచిస్తూ అసలు మల్లికకు మీరు అంటే ఎందుకండీ అంత కోపం అని జానకితో అంటాడు. అప్పుడు ఎవరైనా అంతే జాగ్రత్తగా ఉంటారు. తన బిడ్డకి ప్రమాదం ఉందని తెలిసినప్పుడు అలాగే మాట్లాడాలి మీరు దాని గురించి ఏం భయపడొద్దు అని అంటుంది జానకి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!