- Home
- Entertainment
- ఆమె వచ్చాకే తేజుకి యాక్సిడెంట్ జరిగింది.. సంయుక్త గోల్డెన్ లెగ్ కాదు ఐరన్ లెగ్.. నోరు జారిన డైరెక్టర్
ఆమె వచ్చాకే తేజుకి యాక్సిడెంట్ జరిగింది.. సంయుక్త గోల్డెన్ లెగ్ కాదు ఐరన్ లెగ్.. నోరు జారిన డైరెక్టర్
మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసలు అందుకుంటోంది. టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. నేడు విడుదలైన సాయిధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

టాలీవుడ్ లో హీరోయిన్ల విషయంలో ఎక్కువగా గోల్డెన్ లెగ్.. ఐరన్ లెగ్ అనే మాటలు వినిపిస్తుంటాయి. వాస్తవానికి సినిమా రిజల్ట్ లో ఇతర నటీనటుల పాత్ర ఎంత ఉంటుందో హీరోయిన్ పాత్ర కూడా అంతే. కానీ సినిమా హిట్ అయితే ఆమె గోల్డెన్ లెగ్ అని.. కాకపోతే ఐరన్ లెగ్ అని ఆపాదిస్తుంటారు. గతంలో ఐరన్ లెగ్ అని ముద్ర వేయించుకున్న శృతి హాసన్ ఇప్పుడు స్టార్ హీరోయిన్.
ఒకప్పుడు వరుస హిట్స్ సాధించిన పూజా హెగ్డేకి ఇప్పుడు పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇదే క్రమంలో మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసలు అందుకుంటోంది. టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. నేడు విడుదలైన సాయిధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
రీసెంట్ గా ఇంటర్వ్యూలో విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు సంయుక్త మీనన్ గురించి నోరు జారారు. మీడియా మొత్తం సంయుక్త మీనన్ ని గోల్డెన్ లెగ్ అని పిలవడంపై కార్తీక్ మాట్లాడారు. సంయుక్త మీనన్ బింబిసార చిత్రం రిలీజ్ కాకముందే విరూపాక్ష చిత్రానికి సైన్ చేసింది.
మీరంతా సంయుక్తని గోల్డెన్ లెగ్ అంటున్నారు. సంయుక్త వచ్చాకే సాయిధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయింది అంటూ సరదాగా మాట్లాడుతూనే నోరు జారారు. దీనితో కార్తీక్ వంక సంయుక్త సీరియస్ గా చూసింది. ఆ తర్వాత కార్తీక్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎవరిదీ గోల్డెన్ లెగ్.. ఐరన్ లెగ్ ఉండదు అని అన్నారు.
పక్కనే ఉన్న సాయిధరమ్ తేజ్ సంయుక్త మీనన్ ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉండగా ప్రీమియర్స్ రిపోర్ట్స్ ప్రకారం సంయుక్త మీనన్ నటన ఈ చిత్రంలో మరో స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె అదరగొట్టేసిందట.
విరూపాక్ష చిత్రంతో సంయుక్త మీనన్ ఖాతాలో మరో హిట్ పడ్డట్లే అని అని అంటున్నారు. సుకుమార్ శిష్యుడైన కార్తీక్ దండు ఈ చిత్రంతో డెబ్యూ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. హర్రర్ టచ్ తో ఉన్న కథతో ప్రేక్షకులని సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసే విధంగా థ్రిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.