- Home
- Entertainment
- చిరంజీవి అంటే కోహ్లీకి ఎంత పిచ్చో తెలుసా, అండర్ 15 ఆడుతున్నప్పుడు.. మ్యాటర్ తెలిస్తే మతిపోద్ది
చిరంజీవి అంటే కోహ్లీకి ఎంత పిచ్చో తెలుసా, అండర్ 15 ఆడుతున్నప్పుడు.. మ్యాటర్ తెలిస్తే మతిపోద్ది
ఇండియన్ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ పేరు చెబితే ఫ్యాన్స్ ఊగిపోతారు. క్లాసికల్ బ్యాటింగ్ తో కూడా విధ్వసం చేయొచ్చని విరాట్ కోహ్లీ నిరూపించాడు. ప్రపంచ క్రికెట్ ఎప్పటికీ మరచిపోని లెజెండ్ గా కోహ్లీ తన పేరుని చరిత్రలో లిఖించుకున్నాడు.

ఇండియన్ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ పేరు చెబితే ఫ్యాన్స్ ఊగిపోతారు. క్లాసికల్ బ్యాటింగ్ తో కూడా విధ్వసం చేయొచ్చని విరాట్ కోహ్లీ నిరూపించాడు. ప్రపంచ క్రికెట్ ఎప్పటికీ మరచిపోని లెజెండ్ గా కోహ్లీ తన పేరుని చరిత్రలో లిఖించుకున్నాడు. విరాట్ కోహ్లీకి ప్రపంచం మొత్తం కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
విరాట్ కోహ్లీకి క్రికెట్ తర్వాత మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తన ఇష్టాన్ని కోహ్లీ అనేక వేదికలపై బయట పెట్టాడు. పాటలు పాడాడు.. డ్యాన్స్ కూడా చేశాడు. గ్రౌండ్ లో అగ్రెసిన్ గా ఉండే కోహ్లీ మ్యూజిక్ వినిపిస్తే అక్కడ కూడా స్టెప్పులు వేయడం చూశాం. కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న కోహ్లీ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక శిఖరంలా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని అట.
కోహ్లీకి తెలుగు క్రికెటర్స్ లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో ద్వారక రవితేజ ఒకరు. రవితేజ,, కోహ్లీతో అండర్ 15, అండర్ 19 టీమిండియా జట్టుకి ఆడారు. ఆ సమయంలో రవితేజ, కోహ్లీ రూమ్ మేట్స్ అట. ఈ విషయాన్ని రవితేజ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రవితేజ డెక్కన్ ఛార్జెస్ టీం కి ఐపీఎల్ కూడా ఆడాడు
kohli dance
మెగాస్టార్ చిరంజీవి పాటలకు, డ్యాన్స్ కి విరాట్ కోహ్లీ పెద్ద అభిమాని. మేమిద్దరం రూమ్ లో ఉంటే.. టీవీలో చిరంజీవి పాటలు వస్తే కలసి డ్యాన్స్ చేశాం. కొన్నిసార్లు క్యాసెట్ పెట్టుకుని డ్యాన్స్ చేశాం. ఆ విధంగా మా ఇద్దరికీ చిరు అనేది నిక్ నేమ్ గా మారిపోయింది.
దాదాపు ఆరేళ్ళ తర్వాత రీసెంట్ గా కోహ్లీని మీట్ అయ్యాను. కోహ్లీ నన్ను చూడగానే ఫస్ట్ అడిగిన మాట.. చిరు ఎలా ఉన్నావు అని అడిగాడు. చాలా సేపు కోహ్లీతో మాట్లాడానని రవితేజ అన్నారు.
కోహ్లీ, తాను క్రికెట్ ఆడిన బ్యాచ్ లో చాలా మంది టీం ఇండియాకి ఆడారు. తానొక్కడినే మిస్ అయ్యాను అని రవితేజ అన్నారు. ఇషాంత్ శర్మ, అజింక్య రహానే, జడేజా ఇలా చాలా మంది ఆ బ్యాచ్ లో టీమిండియాకి ఆడినట్లు రవితేజ తెలిపారు.