- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: నిజం చెప్పి కళ్ళు తెరిపించిన విన్ని.. భార్యని చూడడానికి భయపడుతున్న యష్!
Ennenno Janmala Bandham: నిజం చెప్పి కళ్ళు తెరిపించిన విన్ని.. భార్యని చూడడానికి భయపడుతున్న యష్!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తనకోసం ఎంతో త్యాగం చేస్తున్న భార్యని అపార్థం చేసుకొని దూరం పెడుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నార్మల్ స్టేజ్ కి వచ్చిన యష్ సూటు బూటు వేసుకొని ఆఫీస్ కి బయలుదేరుతాడు. తన దగ్గరికి వచ్చిన కూతుర్ని ఎత్తుకొని ముద్దులాడుతాడు. నీకు ఆరోగ్యం బాగోలేనని రోజులు అమ్మ పడుకోకుండా సేవ చేసింది అని చెప్తుంది ఖుషి. మన యష్ లేచి నిలబడ్డాడు అని ఆనందంగా చెప్తుంది మాలిని. కానీ నిలబెట్టింది మాత్రం నా కోడలు వేదనే తన మొహం చూడు భర్త కోలుకున్నాడని ఎంత వెలిగిపోతుందో అంటాడు రత్నం. యష్ ఇంత త్వరగా కోలుకున్నాడంటే అందుకు కారణం నువ్వే అంటుంది సులోచన.
భార్య భర్తని చూసుకోకపోతే తప్పు కానీ చూసుకుంటే అందులో గొప్పేమీ లేదు అంటుంది వేద. ఆఫీసులో ఆయన బాధ్యత నీదే అంటూ వసంత్ కి అప్పజెప్తుంది వేద. రాముడి రక్షణ లక్ష్మణుడి బాధ్యత నీకేమీ భయం అక్కర్లేదు అంటూ నవ్వుతాడు వసంత్. మరోవైపు ఆఫీసులో ఉన్న యష్ దగ్గరికి వచ్చి ఇంత స్పీడ్గా రికవరీ అయినందుకు హ్యాపీగా ఉంది అంటూ బొకే ఇస్తాడు విన్ని. లేకపోతే మంచం మీదే ఉండిపోతానని ఎక్స్పెక్ట్ చేసావా.
మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడుతావు నీ గురించి నాకు తెలుసు అంటాడు యష్. దేని గురించి మాట్లాడుతున్నావు అంటాడు విన్ని. మా మ్యారేజ్ డే రోజు వేద నిన్ను హాగ్ చేసుకుని ఐ లవ్ యు చెప్పడం నేను చూశాను ఇంకా దాచొద్దు అంటాడు యష్. నువ్వు ఇంత తప్పుగా ఆలోచిస్తావు అనుకోలేదు అసలు తను ఎందుకు అలా చేసిందో తెలుసా అంటూ జరిగిందంతా చెప్తాడు విన్ని. వేద నీకోసం ఎంతో త్యాగం చేసింది. తన జీవితం మొత్తం నీకు ఇచ్చేసింది. తనని మిస్ చేసుకుంటే నీ లైఫ్ ని మిస్ చేసుకున్నట్టే, పైన తను నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, తను పేరున్న డాక్టర్ గా మంచి పొజిషన్లో ఉంది.
తనకి ఏం తక్కువని నిన్ను పెళ్లి చేసుకొని నీకోసం జీవితాన్ని త్యాగం చేసింది? ఆమె కోసం నువ్వు ఏం చేసినా తక్కువే అయినా తను నీ నుంచి ఏమీ ఆశించడం లేదు.నువ్వు కాస్త ప్రేమ చూపిస్తే చాలు ఆ మాత్రానికే వేద ఎంతో సంతోషపడుతుంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విన్ని. నిజం తెలుసుకున్న యష్, వేద పట్ల ఎంత అసహ్యంగా ప్రవర్తించాడో తలుచుకొని బాధపడతాడు. మరోవైపు అభి నీకు వినట్లేదు ఏమన్నాడు అని చెప్పి ఒక నెక్లెస్ చిత్ర కి ఇస్తుంది మాళవిక. కానీ ఆ నెక్లెస్ తీసుకోవటానికి ఇష్టపడదు చిత్ర.
నువ్వు ఈ నెక్లెస్ తీసుకొని తీరాలి లేదంటే ఆ ఇంట్లో నేను చులకన అయిపోతాను చిత్ర మెడలో వేస్తుంది మాళవిక. అక్కడే ఉన్న అబితో మీరు మాట్లాడుతూ ఉండండి నేను జ్యూస్ తీసుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్తుంది మాళవిక. చేరవలసిన వస్తువు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది అంటాడు అభి. నీ గురించి త్వరలోనే మాళవిక తెలుసుకొనే లాగా చేస్తాను అంటుంది చిత్ర. ఇంతలో జ్యూస్ తీసుకుని అక్కడికి వచ్చిన మాళవిక మన పెళ్లి వసంత్ చేస్తాడు వాళ్ళ పెళ్లి నువ్వే చేయాలి అని అభితో చెప్తుంది మాళవిక. మరోవైపు ఇంటికి వచ్చిన భర్తతో త్వరగా ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దాము అంటుంది వేద. తను చెప్పినట్లే ఫ్రెష్ అయ్యి వస్తాడు యష్.
భోజనం దగ్గర కూర్చుని నీ కళ్ళల్లో చూడటానికి కూడా ధైర్యం చాలటం లేదు నీ పట్ల ఎంత తప్పు చేశాను అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. యష్ చెయ్యి నొప్పితో బాధపడడం గమనించిన వేద తనే భోజనం తినిపిస్తుంది.నిన్ను బాధపెట్టిన ఈ గిల్టినెస్ జీవితాంతం నన్ను వదలదు అంటూ కన్నీరు పెట్టుకుంటాడు యష్. అది గమనించిన వేద ఎందుకా కన్నీరు కూరలో కారం ఎక్కువ వేసానా అనుకొని తను కూడా టేస్ట్ చేస్తుంది. కారంగా ఏమీ లేదు కదా రేపటి నుంచి ఈ మాత్రం కారం కూడా వేయను లెండి అంటూ ఉన్న భోజనాన్ని కూడా తినిపిస్తుంది. తరువాయి భాగంలో రూమ్ ని అందంగా రెడీ చేసి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వేద. యష్ మాత్రం బాధతో బయట కూర్చుంటాడు.