- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: పశ్చాతాపంతో కన్నీరు పెట్టుకున్న విన్ని.. తన మాటలతో యష్ ను మరింత మండేలా చేసిన మాళవిక?
Ennenno Janmala Bandham: పశ్చాతాపంతో కన్నీరు పెట్టుకున్న విన్ని.. తన మాటలతో యష్ ను మరింత మండేలా చేసిన మాళవిక?
Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది. వివాహం విషయంలో పదేపదే మోసపోతున్న ఒక వ్యక్తి కన్నీటి గాధ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఖుషి విషయంలో వేరే ఎవరూ కలగజేసుకోవలసిన అవసరం లేదు, నా కూతురి విషయంలో పరాయి వాళ్ల జోక్యం అనవసరం అంటాడు యష్. ఆ మాటలకి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అవేం మాటలు అంటూ మందలిస్తాడు రత్నం. సడన్ గా ఎందుకలా మారిపోయావు వేద ఎంత బాధ పడుతుందో చూడు అంటుంది మాలిని. కళ్ళముందు కనబడేవి అన్ని నిజాలు కాదు.. చెప్పే మాటలు వేరు.. చేసే పనులు వేరు.. అర్థం చేసుకోలేని మూర్ఖుడిని కాదు అంటూ ఖుషిని తీసుకొని వెళ్ళిపోతుంటే అడ్డుగా వెళ్లి నిలబడుతుంది వేద.
ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏం జరిగింది. మీరు ఏదేదో చేస్తున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు. మిమ్మల్ని నేనేమైనా నొప్పించానా నాకు జవాబు చెప్పండి అంటుంది వేద. జవాబు కాదు నా దగ్గర కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోకూడదని అనుకుంటున్నాను అంటాడు యష్. అదే ఏంటో చెప్పండి భర్తగా చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అంటుంది వేద. ఈ బంధాలు బంధుత్వాలు అంతా భ్రమ తెలియకుండా ఒకసారి మోసపోవచ్చు కానీ మళ్లీ మళ్లీ మోసపోవటానికి నేను మూర్ఖుడిని కాదు అంటూ ఆవేశంగా ఖుషి ని తీసుకొని వెళ్ళిపోతాడు యష్.
అసలు వాడు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఎమోషనల్ అవుతుంది మాలిని. యష్ గురించి మనకి తెలిసిందే కదా ఎప్పుడు ఎలా మారుతాడో వాడికే తెలీదు మీరు ఫీల్ అవ్వద్దు అంటూ ఓదారుస్తారు చిత్ర, వసంత్. నా కొడుకు తరపున నేను నీకు సారీ చెప్తున్నాను అంటుంది మాలిని. అలా అనకండి అత్తయ్య ఆయన అనకూడదా నేను పడకూడదా అంటూనే ఖుషి నాకు పరాయిది అంటే నా ప్రాణం కూడా పరాయిదే.ఆమె కోసం నా ప్రాణాన్ని కూడా వదులుకుంటాను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది వేద. బాధపడొద్దు అంటాడు వసంత్. బాధపడను ఎందుకంటే నా భర్త నా బిడ్డ నా బాధ్యత వాళ్ళిద్దరూ ఎప్పటికీ నా సొంతమే అంటుంది వేద.
మరోవైపు వేద మాటలు తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటాడు విన్ని. ఈ చేతులు నీ చుట్టూ వేయటానికి అర్రులు చాచిన నేను ఈరోజు ఎందుకు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాను. నా కంటికి ఈరోజు పసిపాప లాగా కనిపించావు. ఇంతకుముందు అలా ఎందుకు కనిపించలేదు. నీకు ఎంత ద్రోహం చేయాలని చూశాను. నీ లైఫ్ లో నేను హీరోనా, విలన్నా ఫ్రెండ్ నా. నన్ను బెస్ట్ ఫ్రెండ్ ని అన్నావు కదూ ఆ మాటకి పెద్ద కళంకాన్ని నేను అంటూ గిల్టీగా ఫీల్ అవుతాడు. నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావు, ఒకవైపు నీ నుంచి నీ భర్తని విడదీయాలని చూస్తుంటే అదే భర్తని విడదీయొద్దు అంటూ నా దగ్గర నుంచి మాట తీసుకున్నావు.
నేను ఎంత పెద్ద పాపం చేశాను నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు మాట ఇస్తున్నాను ఈ క్షణం నుంచి ఈ విన్ని నీ శ్రేయోభిలాషి. నీకోసం నీ మంచి కోసం ఆరాటపడతాను, నీకు అండగా నిలబడతాను అంటూ బాగా ఎమోషనల్ అవుతాడు విన్ని. మరోవైపు ఎందుకు మమ్మీ నన్ను రెడీ చేస్తుంటే వద్దన్నారు అని తండ్రిని అడుగుతుంది ఖుషి. మమ్మీ చాలా మంచిది మమ్మీకి నేనంటే బోలెడంత ఇష్టం. దయచేసి మమ్మీని ఏమీ అనొద్దు అంటూ తండ్రిని రిక్వెస్ట్ చేస్తుంది. నీకు తెలిసిన మమ్మీ వేరు నేను తెలుసుకున్న మమ్మీ వేరు మమ్మీ మారిపోయింది అనుకుంటాడు యష్.
మరోవైపు వేద దగ్గరికి వచ్చిన సులోచన మీకు కాపురం గురించి ఎందుకు భయంగా ఉంది ఆ రోజు గుడిలో ఆ పెద్దవిడ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. అల్లుడుగారు ఏదో మార్పు వచ్చింది. అందరి ముందు భార్యతో ఇలా ప్రవర్తించవచ్చా. లోపం ఎక్కడ ఉందో నాకు ఏమీ అర్థం కాలేదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది సులోచన. లోపం నీలో ఉంది ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నావు ప్రేమ ఉన్నచోటే కోపం కూడా ఉంటుంది మీ అల్లుడుగారు మీ కూతురికి ఏ లోటు చేయరు అంటూ తల్లికి సర్ది చెప్తుంది వేద. మరోవైపు ఈవినింగ్ నన్ను స్కూల్ నుంచి తీసుకు వెళ్ళటానికి నువ్వు మమ్మీ ఇద్దరు రండి దయచేసి మమ్మీని బాధ పెట్టొద్దు అంటూ క్లాస్ లోకి వెళ్ళిపోతుంది ఖుషి.
యష్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే మాళవిక ఎదురయ్యి నువ్వు డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నావు నీ కూతుర్ని స్కూల్ కి డ్రాప్ చేయడానికి కూడా ఖాళీ లేదా అని అద్దె భార్యకి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో ప్రెసిడెంట్ పోస్టు వచ్చిందని తెలుసుకొని చాలా ఆనందపడుతుంది వేద. ఓవరాక్షన్ ఆపు ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది నాకు ఇందులో నీకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు యష్. ఆ మాటలకి కన్నీరు పెట్టుకుంటుంది వేద.