- Home
- Entertainment
- బిగ్ బాస్ 7లోకి విక్రమ్ మూవీ కాల్ గర్ల్ ఎంట్రీ.. ఆయన రికమండ్ చేయడంతో ఛాన్స్, దిమ్మ తిరిగే రెమ్యునరేషన్
బిగ్ బాస్ 7లోకి విక్రమ్ మూవీ కాల్ గర్ల్ ఎంట్రీ.. ఆయన రికమండ్ చేయడంతో ఛాన్స్, దిమ్మ తిరిగే రెమ్యునరేషన్
కమల్ హాసన్ చివరగా నటించిన విక్రమ్ మూవీ కళ్ళు చెదిరే విజయం సాధించింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ హాసన్ నట విశ్వరూపం ప్రదర్శించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కమల్ హాసన్ చివరగా నటించిన విక్రమ్ మూవీ కళ్ళు చెదిరే విజయం సాధించింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ హాసన్ నట విశ్వరూపం ప్రదర్శించారు. కమల్ హాసన్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బాక్సాఫీస్ హిట్ ఈ చిత్రంతో దక్కింది.
ఇప్పుడు కమల్ హాసన్ శంకర్ ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇండియన్ 2 లో నటిస్తూన్న కమల్ తాజాగా బిగ్ బాస్ తమిళ్ 7కి హోస్ట్ గా చేస్తూ బిజీ అయ్యారు. తమిళ బిగ్ బాస్ 7 నిన్ననే ఆదివారం రోజు ఘనంగా ప్రారంభం అయింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7లో ఒక సర్ప్రైజింగ్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చింది.
ఆమె ఎవరో కాదు విక్రమ్ చిత్రంలో కాల్ గర్ల్ గా నటించి సౌండ్ తో ఊపేసిన మయా కృష్ణన్. మాయా కృష్ణన్ వేదికపైకి రాగానే కమల్ హాసన్ కి హగ్ చేసుకుని ఎంతో సంబరపడింది. తనకు అవకాశాలు లేని టైంలో విక్రమ్ మూవీలో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టం అని మాయా కృష్ణన్ బిగ్ బాస్ వేదికపై పేర్కొంది. ఇప్పుడు తనకి మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలిపింది.
విక్రమ్ మూవీలో కాల్ గర్ల్ గా నటించిన మాయా కృష్ణన్.. శృంగార భరితమైన సౌండ్ తో ఆమె చేసిన పెర్ఫామెన్స్ కి అంతా ఫిదా అయ్యారు. ఆ సౌండ్ వల్లే ఆమెకి సౌత్ మొత్తం గుర్తింపు లభించింది. అయితే బిగ్ బాస్ 7 లో ఆమెకి ఛాన్స్ రావడం వెనుక కమల్ హాసన్ హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కమల్ హాసన్ రికమండ్ చేయడంతోనే మాయా కృష్ణన్ కి ఛాన్స్ వచ్చిందట. అంతే కాదు ఆమె రెమ్యునరేషన్ కూడా దిమ్మ తిరిగే విధంగా ఉందని టాక్. వారానికి ఆమె రెమ్యునరేషన్ 2.5 లక్షలుగా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఏది ఏమైనా నటిగా, సెలబ్రిటిగా మరింత పాపులర్ అయ్యేందుకు మాయా కృష్ణన్ కి ఇది మంచి అవకాశం అని అంటున్నారు. మరి బిగ్ బాస్ 7 లో విక్రమ్ బ్యూటీ ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.