- Home
- Entertainment
- తమన్నాను పిచ్చిగా ప్రేమిస్తున్నా.. ఓపెన్ అయిన విజయ్ వర్మ, వైరల్ అవుతున్న కామెంట్స్..
తమన్నాను పిచ్చిగా ప్రేమిస్తున్నా.. ఓపెన్ అయిన విజయ్ వర్మ, వైరల్ అవుతున్న కామెంట్స్..
తమన్నాతో లవ్ విషయంలో ఇన్నాళ్ళకు ఓపెన్ అయ్యాడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ. ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నాని ఓప్పుకున్నాడు విజయ్ వర్మ. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..?

Tamannaah Bhatia, Vijay Varma
మిల్కీ బ్యూటీ.. సీనియర్ హీరోయిన్ తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మధ్య లవ్ ట్రాక్ గురించి తెలిసిందే.. కొంత కాలంగా సీక్రేట్ లవ్ నడిపిస్తున్న ఈ తారలు .. ఈమధ్యే కాస్త ఓపెన్ అవుతుననారు. వీరి మధ్య ఏదో నడుస్తోందన్న వార్త కొంత కాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ రిలీజ్ నేపథ్యంలో వీరి ఆఫ్ స్క్రీన్ లవ్ ట్రాక్ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది.
అయితే వీరు తమ రిలేషన్‌పై... మొదటి నుంచి మౌనం పాటిస్తున్నారు. కాకపోతే. డిన్నర్ డేట్లు.. కలిసి తిరగడాలు కామన్ గా జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరిపై రకరకాల వార్తలు వండి వార్చుతూనే ఉన్నారు. అయితే వీరి మౌనం మాత్రం అందరిలో ఉత్కంఠను పెంచింది. అందరిలో క్యూరియాసిటీ పెంచడంలో ఈజంట సక్సెస్ అయ్యారు.
ఇక తాజాగా తమ ప్రేమ విషయంలో ఓపెన్ అయ్యారు విజయ్ వర్మ తమ్మన్నాపై తన ఫీలింగ్స్ గురించి బయటప పెట్టాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బయటపడ్డాడు.ఆయన మాట్లాడుతూ..మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని నాకిప్పుడు బాగా అర్థమైంది. ఆమెతో ఎంతో ఆనందం గా ఉన్నాను...ఎంతో సంతోషంగా ఉన్నా.. అన్నాడు విజయ్ వర్మ.
అంతే కాదు..తమన్నాను తాను పిచ్చిగా ప్రేమిస్తున్నా... అన్నారు విజయ్ వర్మ. ఆమె నా లైఫ్‌లో అడుగుపెట్టాక విలన్ దశ ముగిసిపోయింది. రొమాంటిక్ దశ మొదలైంది అంటూ... రొమాంటిక్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకూ ఎన్నో విలన్ పాత్రలు చేసిన విజయ్ వర్మ.. తన లైఫ్ లో విలన్ క్యారెక్టర్లు ఇక లేవని.. అన్నీ ప్రేమ పాత్రలే అంటూ హింట్ ఇచ్చారు.
Photo Courtesy: Instagram
ఇక వీరిద్దరు లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సందర్భంగా దగ్గరయ్యారనేది ఒక టాక్. ఈ షూటింగ్ టైమ్ లోనే పరిచయం అయిన వీరు.. మంచి ఫ్రెండ్స్ గా మారి.. ఆతరువాత ప్రేమ బంధంగా మార్చుకున్నారని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ లో వీరి ప్రేమ హాట్ టాపిక్ గా మారింది. విజయ్ బాలీవుడ్ నటుడిగా గుర్తింపు పొందినా.. ఆయన తెలుగువారే.
విజయ్‌తో రిలేషన్‌షిప్‌పై తమన్నా కూడా ఓమారు స్పందించింది. ‘‘ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో సంతోషంగా ఉండగలమనే భావన కలగాలి. విజయ్‌తో నాకు అలాగే అనిపించింది. నేను ఇప్పటివరకూ ఎంతో మంది హీరోలతో కలిసి నటించా. వాళ్లందరి కంటే విజయ్ నాకు ఎంతో స్పెషల్. అతడు నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని, కష్ట సమయంలో నాతోనే ఉంటాడన్న నమ్మకం ఉంది’’ అని ఆమె చెప్పారు.