ఓటీటీలోకి విజయ్ దేవరకొండ `కింగ్డమ్` మూవీ.. ఇంకా ఒక్కరోజే, ఎక్కడ చూడొచ్చంటే?
విజయ్ దేవరకొండ ఇటీవల `కింగ్డమ్` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. థియేటర్లో డీసెంట్‌గా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

`కింగ్డమ్`తో రచ్చ చేసిన విజయ్ దేవరకొండ
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చివరగా `కింగ్డమ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. గత నెల ఎండింగ్‌లో(జులై 31) విడుదలైన ఈ మూవీ థియేటర్లలో మిశ్రమ స్పందన రాబట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. ఓపెనింగ్స్ భారీగానే రాబట్టుకుంది. వీకెండ్ వరకు సత్తా చాటిన ఈ మూవీ ఆ తర్వాత డీలా పడిపోయింది. బయ్యర్లకి కొంత నష్టాలను తీసుకొచ్చింది. కాకపోతే వరుస పరాజయాల్లో ఉన్న విజయ్‌కి మాత్రం కాస్త ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. ఆయన తలెత్తుకునేలా చేసింది.
ఓటీటీలోకి రాబోతున్న `కింగ్డమ్`
`కింగ్డమ్` మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని సితార ఎంటరటైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. థియేటర్లో యావరేజ్‌గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది. మరో ఒక్క రోజులోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
నెట్ ఫ్లిక్స్ లోకి `కింగ్డమ్` మూవీ
`కింగ్డమ్` మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతుంది. ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా విడుదలైన 28 రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రావడం విశేషం. మరి థియేటర్లో హిట్‌గా నిలవలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో అయినా సత్తాని చాటుతుందా? ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి.
`కింగ్డమ్` కథ ఇదే
`కింగ్డమ్` మూవీ కథేంటంటే? విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములు. తండ్రి ఆగడాలను భరించలేక సత్యదేవ్ తండ్రిని హత్య చేసి పారిపోతాడు. శ్రీలంకకి వెళ్లిపోతాడు. అక్కడ తెలుగు వారు స్థానిక గోల్డ్ మాఫియా కింద వర్కర్లుగా పనిచేస్తుంటారు. గోల్డ్ స్మగ్లింగ్‌కి సహాయం చేస్తుంటారు. పారిపోయిన సత్యదేవ్.. శ్రీలంక తెలుగు వారి వద్ద పెరిగి, వారికి నాయకుడిగా ఎదుగుతాడు. మరోవైపు విజయ్ దేవరకొండ ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్‌గా జాబ్ కొడతాడు. చిన్నప్పట్నుంచి అన్న కోసం వెతుకుతుంటాడు. విజయ్‌లోని ఫైర్‌ని, తెలివిని గమనించిన ఒక అధికారి స్పైగా మారుస్తాడు. శ్రీలంకలో జరుగుతున్న ఈ స్మగ్లింగ్‌కి సంబంధించిన సమాచారం అందించాలని పంపిస్తాడు. అంతేకాదు అక్కడే మీ అన్న ఉన్నాడని చెబుతాడు. మరి విజయ్ శ్రీలంకకి వెళ్లి ఏం చేశాడు? తన అన్నని ఎలా కలుసుకున్నాడు? అక్కడ మాఫియాని అంతం చేసేందుకు తాను ఏం చేశాడనేది సినిమా కథ.