- Home
- Entertainment
- ప్రేమ పేరుతో అమ్మాయిలనుకు కొట్టడం రాంగ్? కరణ్ షోలో అర్జున్ రెడ్డి వివాదంపై దేవరకొండ షాకింగ్ కామెంట్స్
ప్రేమ పేరుతో అమ్మాయిలనుకు కొట్టడం రాంగ్? కరణ్ షోలో అర్జున్ రెడ్డి వివాదంపై దేవరకొండ షాకింగ్ కామెంట్స్
కాఫీ విత్ కరణ్ షో వేదికగా విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక విజయ్ దేవరకొండకు నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన అర్జున్ రెడ్డి మూవీ వివాదాలపై ఆయన నోరువిప్పారు. హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆసక్తికర వివరణ ఇచ్చారు.

Vijay Devarakonda
నీ కెరీర్ లో అర్జున్ రెడ్డి పెద్ద హిట్, హిందీలో కబీర్ సింగ్ టైటిల్ తో రీమేక్ చేయగా ఇక్కడ కూడా భారీ విజయం సాధించింది. అయితే ఈ మూవీని వివాదాలు చుట్టుముట్టాయి. ఫెమినిస్ట్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రేమ పేరుతో ఆడవాళ్లను కొట్టడం విమర్శల పాలైంది. దీన్ని ఎలా తీసుకుంటావు? నిజ జీవితంలో నీది కూడా అర్జున్ రెడ్డి క్యారెక్టరేనా? అని కరణ్ జోహార్ అడిగారు...
Vijay Devarakonda
ఈ ప్రశ్నలకు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)... నిజ జీవితంలో నాది అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కాదు. ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయాలని చూస్తాం. దర్శకుడు చెప్పింది ఫాలో అవుతాం. నేను అదే చేశాను. నా పాత్ర దర్శకుడు రాసుకున్న విధంగా నటించాను. అంతే కానీ ఫెమినిస్ట్స్ వ్యతిరేకంగా చేయాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాలి అనే ఆలోచన నాకు లేదు.
Vijay Devarakonda
నిజానికి అర్జున్ రెడ్డి(Arjun Reddy Movie) పాత్రను చాలా మంది అమ్మాయిలు ఇష్టపడ్డారు. ఎందుకంటే తన లవర్ ప్రీతీ పట్ల అర్జున్ రెడ్డి ఇంటెన్స్ లవ్ కలిగి ఉంటాడు. ఆమెను అనుక్షణం కాపాడుతూ ధైర్యం, భద్రతా భావం కలిగిస్తూ ఉంటాడు. తప్పుబట్టే అంత చెడు ఏమీ ఆ క్యారెక్టర్ లో లేదని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
విజయ్ దేవరకొండ అభిప్రాయానికి హోస్ట్ కరణ్ జోహార్ మద్దతు తెలిపాడు. తనకు కూడా అర్జున్ రెడ్డి మూవీ చాలా ఇష్టమన్న కరణ్.. కొందరు మహిళలు తనతో ఈ విషయం చెప్పారని అన్నారు. విజయ్ దేవరకొండ తో పాటు షోలో పాల్గొన్న అనన్య పాండే మాత్రం డిఫరెంట్ ఒపీనియన్ వెల్లడించింది. ఆ సినిమా సాంగ్స్ అంటే నాకు ఇష్టం అయితే కంటెంట్ ఒకింత భయపెట్టింది అన్నారు.
కారణం.. సినిమా చాలా మందిని ప్రభావితం చేస్తుంది. ప్రేమ పేరుతో అమ్మాయిలను కొట్టడం, తిట్టడం తప్పుకాదన్న భావన ప్రేక్షకుల్లోకి వెళితే అప్పుడే అది ప్రమాదం అన్నారు. అంత మించి అర్జున్ రెడ్డి పాత్రను విమర్శించాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు, హిందీ వర్షన్స్ లో ఈ మూవీపై మీడియాలో చర్చలు జరిగాయి.
ఈ మూవీలో ఆడవాళ్ళను కించపరిచారని, లింగ సమానత్వం దెబ్బతీశారని, ప్రేమ పేరుతో ప్రేమికురాలిని హింసించడం తప్పంటూ కొందరు ఫెమినిస్ట్స్ డిబేట్స్ లో కూర్చొని తమ వాయిస్ వినిపించారు. అర్జున్ రెడ్డి మూవీలోని ముద్దు సన్నివేశాలు అప్పట్లో ఎంత వివాస్పదమయ్యాయో తెలిసింది . కొందరు పోస్టర్స్ చించేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రానికి వివాదాలు మరింత ప్రచారం తెచ్చిపెట్టాయి. మూవీ పెద్ద విజయం సాధించడంలో ఉపయోగపడ్డాయి. చాలా కాలం తర్వాత కాఫీ విత్ కరణ్ షో వేదికగా ఈ విషయం చర్చకు వచ్చింది.