Vijay Devarakonda: లైగర్ కోసం రౌడీ హీరో ఎంత వసూలు చేస్తున్నాడో తెలుసా..?
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). అవ్వడమే కాదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో తెరెక్కుతున్న లైగర్ సినిమా కోసం రౌడీ హీరో ఎంత వసూలు చేస్తున్నాడు..?
అర్జున్ రెడ్డి(Arjun Reddy)తో ఓవర్ నైట్ స్టార్ గామారి.. గీతగోవిందం సినిమాతో ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సాధించాడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ఫ్యాన్స్ ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకునే విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది. విజయ్ అంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు టాలీవుడ్ లో. మన దగ్గరే కాదు బాలీవుడ్ లో.. కోలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండకు భారీగా ప్యాన్స్ ఉన్నారు.
వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురైనా.. విజయ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పైగా రౌడీ వేర్స్ పేరుతో ఓ బ్రాండ్ ను ఏర్పాటు చేసి.. ఆన్ లైన్ గార్మెంట్ బిజినెస్ లోకి దిగాడు విజయ్. కరోనా టైమ్ లో తన మార్క్ కనిపించేలా మిడిల్ క్లాస్ కు హెల్ప్ కూడా చేశాడే. దాంతో విజయ్ ఇమేజ్ ఇంకా పెరిగిపోయింది. దాంతో పాటు భారీ సినిమా ఆఫర్లు కూడా వెంటపడుతున్నయి రౌడీ హీరోకు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో లైగర్ మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
Vijay Devarakonda
పూరీ జగన్నాథ్(Puri Jagannath) డైరెక్షన్ లో తెరకెకుతున్న లైగర్ మూవీని పూరీ కంటెంట్స్ బ్యానర్ తో పాటు ధర్మ ప్రోడక్షన్స్ కలిపి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో దాదాపు ఐదు భాషల్లో లైగర్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ ను కేటాయించారు. దాంతో పాటు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు కూడా భారీగానే రెమ్యూనరేషన్ ముట్టు జెప్పినట్టు తెలుస్తోంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు 20 కోట్లకు పైనే ముట్టు జెప్పుతున్నట్టు తెలుస్తోంది. సెకండ్ గ్రేడ్ స్టార్ హీరోలలో ఈరేంజ్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో విజయ్ దేవరకొండ ఒక్కడే. అందులోను ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయితే విజయ్ రేంజ్ మారిపోవడం ఖాయం. రెమ్యూనరేషన్ కూడా 30 కోట్ల వరకూ పెరగవచ్చు అంటున్నారు సినీ జనాలు.
లైగర్( Liger) మూవీలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఆడిపాడుతోంది. ఈమూవీలో బాక్సార్ గా కనిపిస్తున్నాడు విజయ్. ఒక పక్కా మాస్ ముంబయ్ ఛాయ్ వాలా పాత్రలో విజయ్ దేవరకొండు నటిస్తున్నాడు. పేద చాయ్ వాలా బాక్సార్ గా సాధించిన విజయాన్ని లైగర్(Liger) మూవీ ద్వారా చూపించబోతున్నారు పూరీ జగన్నాథ్.