ఇదెక్కడి ట్రోలింగ్ బాబోయ్.. లైగర్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ సమంతకి అంటుకుందిగా..
పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ చిత్ర యూనిట్ మొత్తానికి ఒక పీడ కలగా మారిపోయింది. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ, ఛార్మి, అనన్య పాండే ఇలా ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అయిన ఎవరిని వదలకుండా నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ కి దిగుతున్నారు.

పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ చిత్ర యూనిట్ మొత్తానికి ఒక పీడ కలగా మారిపోయింది. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ, ఛార్మి, అనన్య పాండే ఇలా ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అయిన ఎవరిని వదలకుండా నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ కి దిగుతున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకుంటే చివరకి పూరి జగన్నాధ్ పసలేని కథతో విసుగు పుట్టించాడు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బిగ్ డిజాస్టర్ దిశగా సాగుతోంది. లైగర్ మూవీ ప్రభావం తదుపరి పూరి జగన్నాధ్, విజయ్ కాంబోలో తెరకెక్కాల్సిన జనగణమన చిత్రంపై పడనుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతకి జోడిగా 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నాడు. లైగర్ రిజల్ట్ ఎఫెక్ట్ అనుకోని విధంగా సమంతపై పడింది. అది ఎలాగో చూద్దాం.
సోషల్ మీడియాలో నెటిజన్లు అంతా ఖుషి సినిమా భారం మొత్తం సమంతదే అంటూ విజయ్ దేవరకొండపై ట్రోలింగ్ కి దిగారు. విజయ్ దేవరకొండ వరుసగా డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ చిత్రాలతో హ్యాట్రిక్ డిజాస్టర్స్ మూటగట్టుకున్నాడు. ఇక విజయ్ పై హోప్స్ లేవని.. సమంత క్రేజ్ మాత్రమే ఖుషి చిత్రాన్ని నిలబెట్టాలి అంటూ నెటిజన్లు ఫన్నీ పోస్ట్ లు పెడుతున్నారు.
గతంలో నాగ చైతన్యకి ఇలాంటి పరిస్థితే ఉండేది. యుద్ధం శరణం, సవ్యసాచి చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. శైలజారెడ్డి అల్లుడు చిత్రం కొంతవరకు సేవ్ అయింది. ఇక చైతూకు తప్పనిసరి హిట్ అవసరం అనుకున్న టైంలో మజిలీ మూవీ వచ్చింది. చైతు, సమంత కలసిన నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఖుషి చిత్రానికి మజిలీ తెరకెక్కించిన శివ నిర్వాణనే.
సమంత క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదు. పాన్ ఇండియా స్థాయిలో సమంత క్రేజీ నటిగా మారింది. గతంలో వీరిద్దరూ కలసి మహానటి చిత్రంలో నటించారు. ఆ ఫ్యాక్టర్ కూడా ఖుషి చిత్రానికి కలసి రానుంది. లైగర్ తో విజయ్ దేవరకొండకి చాలా డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ కంట్రోల్ కి ఖుషి రిజల్ట్ చాలా కీలకం అని నెటిజన్లు అంటున్నారు.
ఖుషి మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటు సమంత అభిమానులు, అటు విజయ్ దేవరకొండ అభిమానులు అంతా ఖుషిపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి సమంత క్రేజ్ విజయ్ కి కలసి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.