MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Tollywood updates హీరోగా ధర్మవరపు మేనల్లుడు, సక్సెస్‌లో లవ్ గురు, టెనెంట్‌ ట్రైలర్‌.. జితేందర్‌రెడ్డి సాంగ్..

Tollywood updates హీరోగా ధర్మవరపు మేనల్లుడు, సక్సెస్‌లో లవ్ గురు, టెనెంట్‌ ట్రైలర్‌.. జితేందర్‌రెడ్డి సాంగ్..

హీరోగా స్టార్ కమెడియన్ ధర్మవరుపు మేనల్లుడు, విజయ్ ఆంటోనీ లవ్ గురు షురూ.. జితేందర్ రెడ్డి మూవీ నుంచి  యూత్ ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల ఇలా టాలీవుడ్ అప్ డేట్స్ చూద్దాం. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 14 2024, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అభిరామ్ మూవీస్ బ్యానర్ పై సీనియర్ మేకప్ మ్యాన్ కుమార్ మెట్టుపల్లి నిర్మాతగా, దివాకర్ యడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మ్యాకప్ మ్యాన్. దివంగత ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడు శ్రీకాంత్ అవుటూరి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. పోలూరు ఘటిక చలం డైలాగ్స్, ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. శనివారం ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  దర్శకుడు రవి కుమార్ చౌదరి, నిర్మాతలు లయన్ సాయి వెంకట్, భరత్ పారేపల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా `జితేందర్ రెడ్డి`. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇప్పుడు ఈ సినిమాలో అ ఆ ఇ ఈ ఉ ఊ అంటూ సాగే యూత్ ఫుల్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు.

34

పొలిమేర2' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ 'టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో ప్రియదర్శి ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో సత్యం రాజేష్ ఎమోషనల్ అయ్యారు. 

44

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "లవ్ గురు" ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 11న రిలీజ్ చేశారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసింది. "లవ్ గురు" సినిమా ప్రీమియర్స్ నుంచే మీడియా నుంచి పాజిటివ్ టాక్, మంచి రివ్యూస్ తెచ్చుకుంది. ఫస్ట్ డే థియేటర్స్ లోనూ ప్రేక్షకులు సినిమా తమకు బాగా నచ్చిందనే రెస్పాన్స్ ఇచ్చారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్
Recommended image2
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image3
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved