- Home
- Entertainment
- విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, దళపతి69 చివరి సినిమా కాదు, మరో మూవీకి కమిట్ అయిన స్టార్ హీరో
విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, దళపతి69 చివరి సినిమా కాదు, మరో మూవీకి కమిట్ అయిన స్టార్ హీరో
విజయ్ ప్రస్తుతం నటిస్తున్న `దళపతి 69` ఆయన చివరి సినిమా అనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఇది చివరి మూవీ కాదు, ఇప్పుడు మరో సినిమాకి కమిట్ అయ్యాడట.

దళపతి విజయ్ సౌత్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరు. ఆయన ఒక్కో మూవీకి రూ.200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. `GOAT` సినిమాకి 200 కోట్లు అందుకున్నారు. ఇప్పుడు 69వ సినిమా చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్న విజయ్, 2026 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 69వ సినిమా తర్వాత నటించనని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
69వ సినిమా తర్వాత 70వ సినిమాలో నటిస్తున్నారట. ఈ క్రమంలో మరో మూవీకి కమిట్ అయ్యారట. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. `దళపతి 69`కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఫ్యాన్స్ కి ఇది సంబరమే. హెచ్.వినోద్ దర్శకత్వంలో 69వ సినిమా ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ దియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ వంటి తారాగణం ఉంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
దళపతి 69వ సినిమా తర్వాత ఒక నెల విశ్రాంతి తీసుకుని 70వ సినిమా స్టార్ట్ చేస్తారట. 2026 ఎన్నికల ముందు విజయ్ రాష్ట్రవ్యాప్త పర్యటన చేయనున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ మూవీస్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట విజయ్. ఈ వార్త విజయ్ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీ చేస్తుంది. మరో రెండు సినిమాలతో తమ అభిమాన హీరోని వెండితెరపై చూసే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది.