నయనతారని ఉద్దేశించి విఘ్నేష్ ఎమోషనల్ పోస్ట్.. భార్య బర్త్ డేని స్పెషల్‌గా మార్చిన డైరెక్టర్
లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన జూన్‌లో పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తాజాగా నయనతార బర్త్ డేకి విఘ్నేష్ ఓ ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. రొమాంటిక్ ఫోటోలతో షేర్ చేశారు విఘ్నేష్.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని నయనతార(Nayanthara) ఎన్నో స్ట్రగుల్స్ అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టింది. క్రమంగా ఎదుగుతూ, జీవితంలో అనేక ఆటుపోట్లని చవిచూస్తూ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. నటిగా సౌత్‌లో ఆమెని మించిన స్టార్ హీరోయిన్ మరొకరు లేరనేంతటి ఇమేజ్‌ని సొంతం చేసుకోవడం విశేషం.
రెండుసార్లు ప్రేమలో ఓడిపోయిన నయనతార మూడో సారి గెలిచింది. యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్(Vignesh Shivan)ని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏకంగా సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్‌ని, మరోవైపు సినిమా కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది నయనతార. తాజాగా ఆమె శుక్రవారం(నవంబర్ 18)న తన 38వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నయనతారని ఉద్దేశించి ఓ సుధీర్ఘమైన ఎమోషనల్ నోట్‌ని పంచుకున్నారు విఘ్నేష్ శివన్. ఇది నయన్‌పై ఉన్న ప్రేమని, గౌరవాన్ని తెలియజేస్తుండటం విశేషం.
ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతారతో దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలను పంచుకుంటూ, `ఇది మీతో నా తొమ్మిదవ పుట్టిన రోజు నయన్. ప్రతి పుట్టిన రోజు మీరు ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా, విభిన్నంగా ఉంటారు. ఈ రోజు అందరికంటే ప్రత్యేకమైనది ఎందుకంటే మేం భార్యాభర్తలుగా కలిసి జీవితాన్ని ప్రారంభించాం. అదే సమయంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా అశీర్వదించబడ్డాం.
నేను నిన్న ఎప్పట్నుంచో తెలుసు. నిన్ను శక్తివంతమైన వ్యక్తిగా చూశాను. మీరు ఏమి చేసినా ఆత్మవిశ్వాసంతో, అంకిత భావంతో చేస్తారు. అదే మీ బలం, ఇన్నాళ్లూ నిన్ను డిఫరెంట్ పర్సన్‌గా చూశాను. మీ నిజాయితీకి, ప్రతి విషయంలో మీరు చూపించే సిన్సియారిటీకి ఎల్లప్పుడూ ఇన్‌స్పైర్ అవుతున్నా. కానీ నిన్ను తల్లిగాచూసినప్పుడు మీలో అత్యంత సంతోకరమైన, అత్యంత సంపూర్ణమైన మహిళని చూశాను. నువ్వు ఇప్పుడు కంప్లీట్ పర్సన్ అయ్యావు. చాలా హ్యాపీగానూ మారినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు కంటెంట్‌గా కనిపిస్తున్నావు. చాలా అందంగానూ కనిపిస్తున్నావ్` అని చెప్పారు.
ఇంకా విఘ్నేష్ చెబుతూ, ఇప్పుడు పిల్లలు మీ ముఖాన్ని ముద్దు పెట్టుకోవడం వల్ల మీరు మేకప్ వేసుకోరు. ఇన్ని ఏళ్లల్లో కంటే ఇప్పుడు నువ్వు మరింత అందంగా కనిపిస్తున్నావు. ఇంతటి అందాన్ని నేనెప్పుడూ చూడలేదు. మీ ముఖంలో శాశ్వతమైన చిరునవ్వు, ఆనందం, ఇకపై ఇలానే ఉండాలని ప్రార్థిస్తున్నా.
నేను స్థిరపడ్డాను. జీవితం అందంగా అనిపిస్తుంది. సంతృప్తికరంగా, కృతజ్ఞతాభావంతో కనిపిస్తుంది. మా పుట్టిన రోజులు అందరూ ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మా చిన్న పిల్లలతో అందంరి కలిసి పెరుగుతాం. మనందరం అక్కడ పోరాడటం నేర్చుకుంటున్నాం. అదే సమయంలో అక్కడ పోరాడటాన్ని కూడా అస్వాదిస్తున్నాం. దేవుని ఆశీర్వాదాలు, విశ్వం సాక్షిగా మన కోసం అద్భుతమైన జీవితాన్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రియమైన పొండాటి, తంగేయ్య ఎల్లప్పుడు నా ఉయిర్ అండ్ ఉలగం అంటూ ఎమోషనల్ నోట్‌ని షేర్ చేశారు విగ్నేష్. చిరవగా నయన్‌ని తాను ముద్దుగా ఏమని పిలుస్తాడో కూడా తెలియజేయడం విశేషం. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా ఓ విషయాన్ని స్పష్టం చేశారు విఘ్నేష్. వీరిద్దరిది తొమ్మిదేళ్ల ప్రేమ అనే విషయాన్ని తెలియజేశారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ప్రేమించుకున్న ఈ జంట గత మూడేళ్ల క్రితం నుంచి బయటపడ్డారు. కలిసి డేటింగ్ చేస్తున్నారు. అంతకు ముందు నయనతార శింబు, ప్రభుదేవాల ప్రేమలో పడింది. వారిద్దరి నుంచి బ్రేకప్ తీసుకుని, కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ విఘ్నేష్ ప్రేమలో పడింది. ఈ ప్రేమని నిలబెట్టుకుని పెళ్లి వరకు తీసుకొచ్చింది నయనతార.
నయనతార ఇప్పుడు లేడీ సూపర్ స్టార్‌గా కెరీర్‌ని రన్ చేస్తుంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా నిలుస్తుంది. ఆమె నటించే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు స్టార్ హీరోల సినిమాలకు సమానంగా కలెక్షన్లని రాబడుతుండటం విశేషం. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళ్, మలయాళం, హిందీ కలుపుకుని ఓ పది సినిమాల వరకు ఉండటం విశేషం. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ షారూఖ్‌తో `జవాన్` చిత్రంలో నటిస్తుంది నయనతార.