- Home
- Entertainment
- తనను తాను అద్దంలో చూసుకోలేకపోయానన్న విద్యా బాలన్, బాలీవుడ్ నిర్మాతపై షాకింగ్ కామెంట్స్..
తనను తాను అద్దంలో చూసుకోలేకపోయానన్న విద్యా బాలన్, బాలీవుడ్ నిర్మాతపై షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ లో డిఫరెంట్ గా ఆలోచించే హీరోయిన్లలో విద్య బాలన్ కూడా ఒకరు. బీ టౌన్ లో తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సాధించిన సినియర్ స్టార్.. తన లైఫ్ లో అతి పెద్ద ఇన్స్ డెంట్ గురించి ఓపెన్ అయ్యారు. ఓ నిర్మాత చేసిన ఘనకార్యం గురించి చెప్పారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో విద్యా బాలన్ ది స్పెషల్ ప్లేస్. బీటౌన్ లో స్పెషల్ సినిమాలకు పెట్టింది పేరు విద్యబాలన్. హీరోయి గా కెరీర్ స్టార్ట్ చేసినా విద్య లేడీ ఒరియెంటెడ్ మూవీస్.. బయోపిక్ సినిమాలతో ఇండస్ట్రీలో తకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సిల్క్ స్మిత బయోపిక్ ది డర్టీ పిక్చర్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది విద్యాబాలన్. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది సీనియర్ స్టార్ హీరోయిన్.
ఇలాంటి సినిమాలు ఒకటి రెండు కాదు.. బాలీవుడ్ లో వరుసగా తనదైన మార్క్ సినిమాలతో అందరిని ఆకర్షించింది. విద్యాబాలన్ కెరీర్ కు కహానీ సినిమా ఎంతో ఉపయోగపడింది.ఈసినిమాతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్.అప్పటి నుంచి వరస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే ఇండస్ట్రీ ఎంట్రీ తనకు అంత ఈజీగా అవ్వలేదంటోంది విద్య బాలన్. చాలా మందిలా తానుకూడా ఎన్నో కష్టాలు.. ఎన్నో అవమానాలను చూశానంటోంది. ఇన్ని అవమానాలతో ఇండస్ట్రీలో ఎలా ఉండాలా అని తాను భయపడినట్టు తెలిపింది.
పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో తను ఎన్నో కష్టాలు పడ్డానంటోంది విద్య బాలన్. అంతే కాదు ఆ అవమానాల వల్ల తనకు ఇండస్ట్రీ అంటేనే ఆసహ్యం వచ్చిందని అంటూ..షాకింగ్ కామెంట్స్ చేసింది. విద్యాబాలన్ నటించిన తాజా సినిమా జల్సా. ఈ మూవీ అమెజాన్ ప్రైంలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లను జోరుగా చేస్తున్నారు టీమ్. అందులో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ కామెంట్స్ చేసింది విద్యాబాలన్.
విద్యా ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. కెరీర్ బిగినింగ్ లో తాను ఎన్నో కష్టాలు బడ్డానంటూ... విద్యా బాలన్ ఎమోషనల్ అయ్యింది. తనను ఎవరు ఎంతలా అవమానించారు చెప్పుకుని బాధపడింది విద్య. మొదట్లో ఓ నిర్మాత తన పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడట. బాడీ షేమింగ్ చేస్తూ అసహ్యంగా చూసేశాడట. అతని ప్రవర్తల వల్ల నేను 6 నెలల పాటు తనను తాను అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడిందట విద్య. ఇదంత 2003లో జరిగిందని విద్యాబాలన్ చెప్పింది.
ఈ అవమానంవల్ల అప్పుడు తాను ఏసినిమాలకు సంతకం చేయలేకపోయానంటోంది. సినిమాలు చేయాలనుకున్న కుదరలేదు. అంతలా ఆ నిర్మాత తీరు తనపై ప్రభావం చూపింది అంటూ చెప్పుకొచ్చింది.అదే సమయంలో కె బాలచందర్ దర్శకత్వంలో రెండు సినిమాలకు సంతకం చేశానని, కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే ఆ ప్రాజెక్ట్స్ నుంచి తనని తొలగించారని చెప్పింది. అంతేకాదు ఆడ్స్ చేసుకుందామంటే.. అందులోనుంచి కూడా తనను తీసేశారంది.
అప్పుడు ఈ సంఘటనలు తనని తీవ్రంగా బాధించాయని, చాలా ఏడ్చానని విద్యా పేర్కొంది. అదే బాధలో మెరైన్ డ్రైవ్ నుంచి బాంద్రా వరకు నడుచుకుంటూ వెళ్లానని ఆమె అన్నారు. అలా తనని దాదాపు 13 సినిమాల నుంచి తీసివేశారని విద్యా బాలన్ తెలిపింది.
కాని వీటి వల్ల తనలో పట్టుదల పరిగిందంటోంది విద్యబాలన్. ఆ తర్వాత మంచి ఫిజిక్ కోసం.. రోజు గంటల తరబడి వ్యాయమం చేసి బరువు తగ్గాననని పేర్కొంది. దాంతో తనను రిజెక్ట్ చేసిన నిర్మాతలే ఫోన్ చేసి సినిమా చేయాలని అడిగారంటోంది విద్యా బాలన్. అయితే వారి ఆఫర్లను మాత్రం తాను సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు చెప్పింది.