- Home
- Entertainment
- ఆస్తులు అమ్ముకొని వచ్చాను.. కమెడియన్ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరంజీవితో అది ఇప్పటికీ కొనసాగుతుందంటూ..
ఆస్తులు అమ్ముకొని వచ్చాను.. కమెడియన్ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరంజీవితో అది ఇప్పటికీ కొనసాగుతుందంటూ..
ఒకప్పుడు తనదైన కామెడీతో నవ్వులు పూయించిన హాస్యనటుడు సుధాకర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిరంజీవి, తన ఆస్తులు అమ్ముకోవడం, బ్రహ్మానందం గురించి పలు విషయాలను పంచుకున్నారు.

కమెడియన్ సుధాకర్ ఇటీవల ఓ టీవీ షోస్‌లో పాల్గొన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఆయన సందడి చేశారు. ఇందులో ఫాదర్స్ డే సందర్భంగా తనని ఆహ్వానించి సత్కరించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. `అబ్బబ్బబ్బ ఎంత సంతోషంగా ఉందో` అంటూ తనదైన స్టయిల్‌లో చెప్పి నవ్వించారు. ఆయన ఫ్యామిలీని సైతం షోకి తీసుకురావడం విశేషం. హవభావాలతో, సౌండింగ్‌తో, ఏడుపుతో నవ్వులు పుట్టించడం సుధాకర్ స్పెషాలిటీ, వల్గారిటీ లేకుండా
ఇటీవల ఆయన చనిపోయాడంటూ పుకార్లు వినిపించిన నేపథ్యంలో నటుడు సుధాకర్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, పుకార్లు నమ్మవద్దని తెలిపారు. అయితే ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. అది అందరిని కలిచి వేసింది. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉండటం సంతోషించే విషయం. ఈ సందర్భంగా కమెడియన్ సుధాకర్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన ఇటీవల చెప్పిన ఇంటర్వ్యూ విశేషాలు హల్‌చల్ చేస్తున్నాయి.
కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా హ్యాపీగా ఉందని, ఎన్నో మంచి పాత్రలు చేశానని చెప్పారు. హీరో నుంచి కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశానని, ఏ పాత్ర ఇచ్చినా సంతోషంగా చేసేవాడినని తెలిపారు. తనకు ఇష్టమైన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ అని, ఇష్టమైన ప్రదేశం ఊటీ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పట్లో బ్రహ్మానందం తమ ఇంటికి దగ్గర్లోనే ఉండేవారని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారని తెలిపారు. తమిళనాడులో తనకు ఆస్తులు కూడా ఉండేవని, కానీ వాటిని అమ్మేసినట్టు చెప్పారు. తమిళం తర్వాత తెలుగులో ఎక్కువ అవకాశాలు రావడం ఇక్కడి(హైదరాబాద్)కి షిఫ్ట్ అయినట్టు చెప్పారు. ఈ సందర్భంగా తన కొడుకు కూడా త్వరలో ఇండస్ట్రీలోకి వస్తారని చెప్పారు సుధాకర్.
ఈ సందర్భంగా చిరంజీవితో అనుబంధం గురించి ఓపెన్ అయ్యారు. అప్పట్లో చిరంజీవి, సుధాకర్ మంచి స్నేహితులు, ప్రారంభంలో ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉండేవారు. ఆ విషయాలను షేర్ చేసుకుంటూ, చిరంజీవి, తాను ఒకే రూమ్‌లో ఉండేవాళ్లమని, అలా మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నారు. గతంలో `యముడికి మొగుడు` సినిమాలో తనని నటించాలని పట్టుపట్టారని, అలా ఆ సినిమా చేశానని తెలిపారు. ఈ సినిమా తనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. రవి రాజా పినిశెట్టి రూపొందించిన ఈ చిత్రాన్ని జీవీ నారాయణరావుతో కలిసి సుధాకర్ నిర్మించడం విశేషం.
సుధాకర్ 1978లో `కిజకే పొగుమ్ రెయిల్` తమిళ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. భారతీరాజా దర్శకుడు.రాధిక హీరోయిన్. ఈ సినిమా హిట్ కావడంతో హీరోగా కొనసాగాడు. వరుసగా అనేక తమిళ సినిమాలు చేశారు. అట్నుంచి ఆయన తెలుగుకి టర్న్ తీసుకున్నారు. 1980లో `పవిత్ర ప్రేమ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే తమిళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోగా, తెలుగులో మాత్రం చాలా వరకు ఆయన కమెడియన్‌గానే నటించారు. రెండున్నర దశాబ్దాల పాటు తెలుగు, తమిళంలో 600లకుపైగా చిత్రాలు చేశారు. వీటితోపాటు కన్నడ, మలయాళం, హిందీలో ఒక్కో సినిమా చేశారు. నిర్మాతగానూ నాలుగైదు చిత్రాలను నిర్మించారు.