- Home
- Entertainment
- మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, రూ. 132 కోట్లు పోయాయి... కన్నీళ్లు పెట్టిస్తున్న నటి కవిత వేదన!
మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, రూ. 132 కోట్లు పోయాయి... కన్నీళ్లు పెట్టిస్తున్న నటి కవిత వేదన!
నట కవిత జీవితంలో అనేక విషాదాలు ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ ఆమె కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన వేదన వెళ్లగక్కారు.

Actress Kavitha
బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన కవిత మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. హీరోయిన్ గా రిటైర్ అయ్యాక క్యారెక్టర్ రోల్స్ చేశారు. సీరియల్స్ కూడా చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జీవితంలో చోటు చేసుకున్న విషాదాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు...
Actress Kavitha
ఆమె మాట్లాడుతూ... నా భర్త దశరథ్ రాజ్ వ్యాపారం చేసేవారు. ఆరేళ్ళ క్రితం బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది. తొమ్మిది నెలల వ్యవధిలో రూ. 132 కోట్లు నష్టపోయారు. ఈ విషయాన్ని మా దగ్గర దాచాడు. తనలో తానే మదనపడుతూ అనారోగ్యం బారినపడ్డారు. ఒకరోజు సడన్ గా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళితే బ్రతకడం కష్టం అన్నారు. 11 రోజులు కోమాలో ఉన్నారు. తర్వాత కళ్ళు తెరిచారు. మరో నెల రోజులు ఐసీయూలో చికిత్స అందించాము.
Actress Kavitha
తర్వాత ఆయన్ని కౌన్సిలింగ్ చేయిస్తే వ్యాపారంలో నష్టం వచ్చిన విషయం చెప్పారు. డబ్బు కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా అని నేను మందలించాను. ఆయనలో ధైర్యం నింపి కోలుకునేలా చేశాను... అని కవిత అన్నారు.
నటి జయచిత్రతో తనకు ఎప్పుడూ గొడవలే అని కవిత వెల్లడించారు. జయచిత్ర నన్ను తరచుగా వేధిస్తూ ఉండేది. ఒకసారి సెట్స్ కి ఇద్దరం ఒకే రంగు చీర కట్టుకొని వెళ్ళాము. డైరెక్టర్ నన్ను చీర మార్చుకుని రమన్నారు. జయ చిత్ర.. ఏయ్ చీర మార్చుకోవే అని వేలు చూపించి మాట్లాడింది. అప్పటికే ఆమె ప్రవర్తనతో విసిగిపోయి ఉన్న నేను, మీ పని మీరు చూసుకోండి. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారని హెచ్చరించాను. మా గొడవ కారణంగా ఆ మూవీ ఏడాది ఆగిపోయిందని కవిత నటి జయచిత్రతో విబేధాలపై మాట్లాడారు.
ఇక కరోనా సమయంలో తన జీవితంలో జరిగిన విషాదాన్ని ఆమె గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. కోవిడ్ సోకి నా భర్త మరణించాడు. ఆయన మరణించిన పది రోజులకు కొడుకు కూడా కన్నుమూశాడు. ఆ వేదన నేను భరించలేకపోయాను. మూడు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను, అని కవిత కన్నీరు పెట్టుకున్నారు.
2021లో దేశవ్యాప్తంగా లక్షల మంది కరోనా కారణంగా కన్నుమూశారు. కవిత కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగింది. కొడుకు, భర్త దూరమైన బాధ నుంచి బయటపడేందుకు ఓ సీరియల్ ఒప్పుకున్నాను. షూటింగ్స్ చేస్తుంటే బాధ మరచిపోవచ్చని భావించినట్లు కవిత చెప్పడం జరిగింది.