MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పుష్ప 2: మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన డైలాగ్స్ నిజమేనా?

పుష్ప 2: మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన డైలాగ్స్ నిజమేనా?

పుష్ప 2 సినిమాలో మెగా ఫ్యామిలీని ఉద్దేశించి డైలాగులు పెట్టారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమాలోని కొన్ని డైలాగులను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు సినిమాలో ఉన్న డైలాగులు ఏమిటో తెలుసుకుందాం.

2 Min read
Author : Surya Prakash
Published : Dec 05 2024, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 అల్లు అర్జున్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'పుష్ప 2' ఈరోజు థియేటర్ లలో ప్రేక్షకుల ముందు వచ్చిన సంగతి తెలిసిందే.  బుధవారం సాయంత్రం బెనిఫిట్ షోలతోనే  బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సంపాదించుకున్న ఈ సినిమా  కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది.  అక్కడదాకా అంతే బాగుంది.

అయితే సినిమాలో మెగా ఫ్యామిలీని ఉద్దేశించి డైలాగులు పెట్టారని వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న నేపధ్యంలో అసలు నిజం ఏమిటనేది చూసిన వారికి తప్పించి అర్దం కావటం లేదు. లేని వాళ్లు కొన్ని ఫేక్ పోస్ట్ లు అవి ఫేక్ అని తెలియకుండానే స్ప్రెడ్ చేసేస్తున్నారు. అసలు ఏం జరిగింది. ఏం డైలాగులు పెట్టారు అనేది చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా రచ్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో మూవీలోని కొన్ని డైలాగులుని తమకు అనుకూలంగా మార్చుకుని కొందరు ఈ మంటల రచ్చకి పెట్రోల్ పోసి మరింత ఆజ్యం పోస్తున్నారు  .

ఆ పోస్ట్ లలో ఏముంది అంటే..ఈ సినిమాలో "ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్.. ఆడికీ, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్" అనే డైలాగ్ ఉన్నట్లుగా వైరల్ గా మారింది. ఈ డైలాగ్ తో డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను టార్గెట్ చేశాడా అని అంటున్నారు. అయితే ఈ డైలాగు నిజం కాదు. ఫేక్ డైలాగు ఇది. మరి అసలు నిజంగా సినిమాలో ఉన్నదేమిటి..
 

35
Allu Arjun, #Pushpa2, Sukumar, #kALKI

Allu Arjun, #Pushpa2, Sukumar, #kALKI

పుష్ప 2 సినిమాలో హీరో ఇంట్రడక్షన్ టైమ్ లో ..జపాన్ లో ఉన్న హీరో ...విలన్ తో.. “ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్? మాములుగా చూస్తేనే బాస్ కనిపిస్తాడు. ఇలా తల్లకిందులుగా చూస్తేనే బాస్ లకే బాస్ కనిపిస్తాడు. నేనేరా నీ బాస్. పుష్పాయే బాస్. భూగోళంలో యాడున్నా సరే… నీ యెవ్వా తగ్గేదేలే” అంటాడు. దాన్ని చిరంజీవిని చాలా మంది బాస్ అంటారు కాబట్టి దాన్ని అలా అన్వయించి పోస్ట్ లతో విష ప్రచారం చేస్తున్నారు కొందరు. 

45


అలాగే పుష్ప2  ఇంట్రవెల్ టైమ్ లో ఓ డైలాగు వస్తుంది.   “పుష్ప గాడు తగ్గితే సూడాలని సాలా మంది ఎదురు చూస్తా ఉండారు”అని. అది కథలో భాగంగా అక్కడ అవసరమైన డైలాగు. అయితే దీన్ని కూడా మెగా కాంపౌండ్ కు వర్తింప చేస్తూ వైరల్ చేస్తున్నారు.  సినిమాలో పావలా వాటా డైలాగుని కూడా మరో విధంగా ప్రచారం చేస్తున్నారు.  
 

55

  ‘పుష్ప ది రూల్‌’కి అన్ని చోట్ల నుంచీ ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక హీరోయిన్ గా మూడేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’కు  సీక్వెల్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమైంది.

భారీ అంచనాల మధ్య గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. బుధవారం సాయంత్రం పలు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌ ప్రదర్శించారు. అల్లు అర్జున్‌ యాక్టింగ్‌ అద్భుతంగా ఉందని సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved