MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • రాంచరణ్, మహేష్ బాబు లెక్క వేరు..విజయ్ దేవరకొండ విషయంలో ప్లేటు తిప్పేసిన వేణు స్వామి, అలా పోల్చాడేంటి

రాంచరణ్, మహేష్ బాబు లెక్క వేరు..విజయ్ దేవరకొండ విషయంలో ప్లేటు తిప్పేసిన వేణు స్వామి, అలా పోల్చాడేంటి

వేణు స్వామి ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. సెలెబ్రిటీల జాతకాలు చెప్పడంలో వేణు స్వామి దిట్ట. ఎంత స్టార్ హీరో అయినా, బడా రాజకీయ నేత అయినా వారి జాతకాలు ఇవే అంటూ కుండబద్దలు కొట్టేయడం వేణు స్వామి శైలి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 10 2024, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వేణు స్వామి ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. సెలెబ్రిటీల జాతకాలు చెప్పడంలో వేణు స్వామి దిట్ట. ఎంత స్టార్ హీరో అయినా, బడా రాజకీయ నేత అయినా వారి జాతకాలు ఇవే అంటూ కుండబద్దలు కొట్టేయడం వేణు స్వామి శైలి. అయితే కొన్ని సార్లు వేణు స్వామి చెప్పిన జాతకం మిస్ ఫైర్ అయ్యాయి. అయితే మరికొన్ని అంశాలు తాను చెప్పిందే జరిగింది అంటూ వేణు స్వామి బలంగా వాదిస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఉదాహరణకి ఈ ఏడాది ఒక సీఎం జైలుకి వెళతారు అని చెప్పా. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారుగా అని వేణు స్వామి అంటున్నారు. అయితే తాజాగా వేణు స్వామి విజయ్ దేవరకొండ, ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఇటీవల విడుదలయింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. 

38
Actor Vijay Devarakonda

Actor Vijay Devarakonda

ఇటీవల విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీనికి తోడు విజయ్ దేవరకొండ పై ఆన్లైన్ విపరీతమైన నెగిటివిటి ఏర్పడింది. దీనితో ఫ్యామిలీ స్టార్ చిత్ర కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. రిలీజ్ ముందు వరకు ఫ్యామిలీ స్టార్ చిత్రానికి మంచి బజ్ ఉండింది. రిలీజ్ అయ్యాక మూవీ కంటెంట్ విషయంలో విమర్శలు వచ్చాయి. 

48

డైరెక్టర్ పరుశురామ్ కథని చిత్రీకరించిన విధానం ఎవరికీ అంతగా నచ్చలేదు. అయితే దీనిపై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫేక్ రివ్యూల వాళ్ళ విజయ్ దేవరకొండ బలైపోయాడు అని వేణు స్వామి  అంటున్నారు. ఏఈ చిత్రం రిలీజ్ అయిన వెంటనే బేకార్ మూవీ అంటూ రివ్యూలు పెట్టేశారు. దాని ఫలితంగానే ఫ్యామిలీ స్టార్ చిత్రం ఫ్లాప్ అయింది. 

58

నెగిటివ్ పబ్లిసిటీకి విజయ్ దేవరకొండ బలవుతున్నాడు. ఇలాంటి రివ్యూల వాళ్ళ సినిమాకి పోవాలని అనుకున్న వాడు కూడా వెళ్ళడు అని వేణు స్వామి అన్నారు. అయితే ఇప్పుడు వేణు స్వామి విజయ్ దేవరకొండ పై సింపతీతో మాట్లాడారు. కానీ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సంబంధం ఉండడం లేదు. 

68

గతంలో వేణు స్వామి విజయ్ దేవరకొండ జాతకం గురించి చెబుతూ.. విజయ్ దేవరకొండ అనే హీరో జాతకం చూస్తే అతడు టాలీవుడ్ లో ఎక్కువ కాలం నిలబడలేడు అని అర్థం అవుతోందని తెలిపారు. విజయ్ దేవరకొండ జాతకం ఏమాత్రం బాగాలేదు. సడెన్ గా విజయ్ దేవరకొండకి క్రేజ్ వస్తుంది.. అంతలోనే పడిపోతుంది అని అన్నారు. 

78

సడెన్ గా స్టార్ డమ్ రావడం ఎవరికీ మంచిది కాదు. ఉదాహరణకి రాంచరణ్, మహేష్ బాబు లని చూడండి. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చినప్పటికి సడెన్ గా వాళ్ళకి టాప్ స్టార్ డమ్ రాలేదు. రాంచరణ్ ఒక్కో చిత్రంతో తనని తాను నిరూపించుకుంటూ ఎదిగాడు. మహేష్ బాబు రాజకుమారుడు చిత్ర నుంచి ఎదిగారు.  

88

విజయ్ దేవరకొండ జాతకానికి, ప్రభాస్ జాతకానికి దగ్గర పోలికలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ కెరీర్ బాహుబలితో పీక్ కి వెళ్ళింది ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించారు. విజయ్ దేవరకొండ జాతకం అలాంటిది ఇలాంటిది అంటూ స్వయంగా చెప్పిన వేణు స్వామి.. ఇప్పుడు మాత్రం అతడి కెరీర్ రివ్యూలకు బలవుతోంది అంటూ ప్లేటు తిప్పేయడం ఆశ్చర్యకరంగా ఉంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image2
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Recommended image3
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved