'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీ అదిరింది కానీ , ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే మాత్రం
సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించాలంటే వెంకటేష్ తర్వాతే ఎవరైనా. వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి కానుకగా మంగళవారం రోజు విడుదలవుతోంది.
సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించాలంటే వెంకటేష్ తర్వాతే ఎవరైనా. వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి కానుకగా మంగళవారం రోజు విడుదలవుతోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఎక్స్ కాప్, ఎక్స్ లవర్, ఎక్సలెంట్ వైఫ్ అనే కాన్సెప్ట్ తో అనిల్ రావిపూడి తన స్టైల్ లో ఫన్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు ఆల్రెడీ థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. రెండు మాస్ చిత్రాల మధ్య వెంకీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అలరిస్తుంది అనే ఆసక్తి నెలకొంది.
యుఎస్ లో సంక్రాంతికి వస్తున్నాం చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. దీనితో సినిమా విశేషాల్ని ఆడియన్స్ ట్విటర్ లో పోస్ట్ చేస్తున్నారు. సినిమా విశేషాలని తెలియజేస్తున్నారు. భీమ్స్ అందించిన మ్యూజిక్ ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. అనిల్ రావిపూడి ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు. దీనితో సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి పాజిటివ్ బజ్ ఉంది. మరి మూవీ ఎలా ఉంది, ప్రేక్షకులని అలరించిందా లేదా అనేది ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
144 నిమిషాల నిడివితో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. మీనాక్షి చౌదరి, విటివి గణేశన్, నరేష్ పాత్రల పరిచయం తర్వాత వెంకటేష్ ఎంట్రీ ఇస్తారు. వెంకటేష్ ఎంకౌంటర్ స్పెషలిస్ట్ వైడి రాజు పాత్రలో నటిస్తున్నారు. ఘర్షణలో వెంకటేష్ ని చూస్తున్నట్లుగా వెంకీ లుక్స్ అదిరిపోయాయి. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ సన్నివేశాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత సూపర్ హిట్ గోదారి గట్టు సాంగ్ ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ ని అనిల్ రావిపూడి బోర్ కొట్టించకుండా మేనేజ్ చేశారు. మాజీ పోలీస్ అధికారిగా ఉన్న వైడి రాజు ( వెంకటేష్) గోదావరి జిల్లాలో ఫ్యామిలీతో నివసిస్తుంటారు. అతడిని ఒక అసైన్ మెంట్ కోసం మళ్ళీ పిలవడం అనేది ఈ చిత్రంలో మెయిన్ పాయింట్. అనిల్ రావిపూడి స్టైల్ లోనే సినిమా కామెడీ అంశాలతో ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో కామెడీ వర్కౌట్ అయింది. కొన్ని సీన్స్ లో ఇరిటేషన్ తెప్పించేలా ఉంటుంది. కొన్ని అతిగా ఉండే సన్నివేశాలు ఉంటాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది.
ఫస్టాఫ్ లో విలేజ్ సన్నివేశాలు, గోదారి గట్టు సాంగ్, మీను సాంగ్, వెంకటేష్ కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అంతగా ఆకట్టుకోలేదు. అనిల్ రావిపూడి తన ఎఫ్ 2 చిత్ర ఫార్ములానే ఫాలో అయినట్లు ఉన్నారు. లాజిక్స్ పక్కన పెట్టి కామెడీపైనే ఫోకస్ పెట్టారు. అలాంటప్పుడు కామెడీ వర్కౌట్ అయితే ఓకె. లేకుంటే ఆడియన్స్ కి చిరాకు రావడం ఖాయం. కథ కూడా గొప్పగా అనిపించేలా ఉండదు. కొన్ని ఫన్నీ సన్నివేశాలు ఈ చిత్రాన్ని నిలబెట్టాయి.
అనిల్ రావిపూడి ఈ చిత్రంతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అనే ఉద్దేశంతోనే సన్నివేశాలు తెరక్కించినట్లు అనిపిస్తోంది. వెంకటేష్ కొడుకు బుల్లి రాజు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా లేవు.
ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి ఛాయిస్. కాకపోతే కొన్ని ఇరిటేషన్ తెప్పించే సన్నివేశాలు భరించాలి. అదే విధంగా కథ ఆశించకూడదు.ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా ఈ కండిషన్స్ కి ఒకే అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ కామెడీతో సంతృప్తి పరిచేలా ఉంటుంది.