- Home
- Entertainment
- 30 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్,వెంకీని కూడా వదలరా..చిరు, బాలయ్య, నాగ్ చేసిందేంటి
30 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్,వెంకీని కూడా వదలరా..చిరు, బాలయ్య, నాగ్ చేసిందేంటి
కొందరు వెంకటేష్ ని ట్రోల్ చేస్తూ కొత్త చర్చకి తెరతీశారు. 30 ఏళ్ళకి పైగా ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్ రొమాన్స్ ఏంటి అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు.

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఇటీవల కొత్త చిత్రం ప్రారంభం అయింది. వీళిద్దరి కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ. ఎఫ్ 2,ఎఫ్3 తర్వాత ఈ కాంబినేషన్ కుదిరింది. ఇటీవల విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ కూడా ఆసక్తిని పెంచింది. పోస్టర్ లో అనిల్ రావిపూడి గన్ను, రోజా పువ్వు, తాళిబొట్టుని కలిపిచూపించాడు. దీనితో ఇది ఏ తరహా కథ అంటూ అంతా చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి వెంకీకి ప్రేయసిగా.. ఐశ్వర్య రాజేష్ భార్యగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కొందరు వెంకటేష్ ని ట్రోల్ చేస్తూ కొత్త చర్చకి తెరతీశారు. 30 ఏళ్ళకి పైగా ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్ రొమాన్స్ ఏంటి అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు.
దీనితో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల ఏజ్ గ్యాప్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. వెంకటేష్ ఏజ్ ప్రస్తుతం 63 ఏళ్ళు. మీనాక్షి చౌదరి వయసు 27 ఏళ్ళు కాగా ఐశ్వర్య రాజేష్ ఏజ్ 34 ఏళ్ళు గా ఉంది. అంటే వెంకీ, మీనాక్షి మధ్య ఏజ్ గ్యాప్ 30 ఏళ్ళ కంటే ఎక్కువే ఉంది. ఇక ఐశ్వర్య రాజేష్ తో పోల్చుకుంటే దాదాపు 30 ఏళ్ళు.
కొందరు వెంకీని ట్రోల్ చేస్తుండగా.. ఇతర నెటిజన్లు కూడా అదే స్థాయిలో రిప్లై ఇస్తున్నారు. వెంకీ మాత్రమే సీనియర్ హీరోలంతా ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న కుర్ర హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తున్నారు అని లెక్కలు బయటకి తీస్తున్నారు. చిరంజీవి దాదాపు 3 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్న కాజల్ తో సినిమా చేశారు. ఖైదీ నెంబర్ 150లో కాజల్ నటించింది. ఆ మూవీ హిట్ కాలేదా అని ప్రశ్నిస్తున్నారు.
అదే విధంగా బాలయ్య ఇటీవల వీర సింహారెడ్డి చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్ తో కలసి నటించారు. శృతి హాసన్ తో పాతికేళ్ల పైగా వయసు వ్యత్యాసం ఉంది. హనీ రోజ్ తో 30 ఏళ్ళ గ్యాప్ ఉంది. ఆ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది కదా అని అంటున్నారు.
అదే విధంగా కింగ్ నాగార్జున నా సామిరంగా చిత్రంతో హిట్ కొట్టాడు. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఆషిక రంగనాథ్ వయసు కేవలం 27 ఏళ్ళు. అంటే వీరిద్దరి మధ్య 30 ఏళ్ళ పైనే గ్యాప్ ఉంది. ఆ చిత్రం కూడా కలెక్షన్స్ పరంగా హిట్ అయింది అని నెటిజన్లు అంటున్నారు. సినిమాల్లో నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ అనేది మ్యాటర్ కాదు అని.. వాళ్ళు ఎలా మెప్పిస్తారు అనేదే ఆడియన్స్ కి ముఖ్యం అని అంటున్నారు.