వెంకటేష్ భార్య ఎంత అదృష్టవంతురాలో తెలుసా..ముద్దుగా ఏమని పిలుస్తాడంటే
విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జనవరి 14న రిలీజ్ అయింది. మరోసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద వెంకీ తన సత్తా చాటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం థియేటర్లకు ఎగబడుతున్నారు.
విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జనవరి 14న రిలీజ్ అయింది. మరోసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద వెంకీ తన సత్తా చాటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం థియేటర్లకు ఎగబడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే క్రేజీ ఎంటర్టైన్మెంట్ ని వెంకీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ద్వారా అందించారు. వెంకీ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది.
ఈ చిత్రంలో వెంకటేష్ పోలీస్ అధికారిగా, నలుగురు పిల్లల తండ్రిగా నటించారు. వెంకీ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్, ప్రేయసి పాత్రలో మీనాక్షి చౌదరి నటించిన సంగతి తెలిసిందే. మీనాక్షి, ఐశ్వర్య ఇద్దరూ పోటీ పడి నటించారు. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
వెంకటేష్ భార్య, భర్తల సెంటిమెంట్ గొడవలు ఉండే చాలా చిత్రాల్లో నటించారు. సుందరకాండ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఎఫ్ 2 లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల్లో భార్య భర్తల సెంటిమెంట్ ఉంటుంది. ఈ జోనర్ ఎంచుకున్న ప్రతి సారి వెంకీ సూపర్ హిట్ కొడుతున్నాడు. ఇక రియల్ లైఫ్ లో వెంకీ తన భార్యతో ఎలా ఉంటాడు ? తన భార్య నీరజని ఎలా చూసుకుంటారు ? అని నెటిజన్లు ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. వెంకటేష్ సతీమణి నీరజ అంతగా మీడియాకి కనిపించే పర్సన్ కాదు. ఆమె మీడియాకి దూరంగా ఉంటారు.
అయితే తమ తల్లి దండ్రుల మధ్య బంధం గురించి వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశ్రిత.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితో మాట్లాడుతూ ఫన్నీ కామెంట్స్ చేసింది. సాధారణంగా తండ్రులు ఇంట్లో కూతుళ్లపై ఎక్కువ ప్రేమ కురిపిస్తారు కదా.. మీ నాన్న ఎవరిపై ఎక్కువ ప్రేమ చూపిస్తారు అని ఐశ్వర్య ప్రశ్నించింది. ఆశ్రిత ఏమాత్రం ఆలోచించకుండా నాన్నకి ఆయన భార్య అంటేనే ఎక్కువ ఇష్టం అని తెలిపింది.
ఎవరైనా బంధువులో, స్నేహితులో ఇంటికి వచ్చి మీ భార్య ఏది అని నాన్నని అడిగితే ఆయన.. పాపం నీరు పడుకుని ఉంది అని చెబుతారు. అమ్మని నాన్న ముద్దుగా మీరు అని పిలుస్తారు. ఫ్యామిలిలో అందరూ డిన్నర్ కి రెడీ అవుతుంటే..మీ భార్య ఏది అని అడుగుతారు. పాపం నీరు ఇంకా రెడీ అవుతోంది అని చెబుతారు. అమ్మ షాపింగ్ కి వెళితే పాపం నీరు షాపింగ్ కి వెళ్ళింది అని చెబుతారు. షాపింగ్ చేయడంలో పాపం ఏముంది అంటూ అందరూ షాక్ అవుతారు. అంతలా వెంకటేష్ తన సతీమణిపై ప్రేమ కురిపిస్తారు అని ఆశ్రిత దగ్గుబాటి తెలిపారు.