MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `వీరసింహారెడ్డి` ఫస్ట్ డే కలెక్షన్లు.. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. నిజమా? ఫేకా?

`వీరసింహారెడ్డి` ఫస్ట్ డే కలెక్షన్లు.. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. నిజమా? ఫేకా?

బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` సినిమా సంక్రాంతి కానుకగా గురువారం(జనవరి 12న) విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టినట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 13 2023, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Veerasimhareddy Review

Veerasimhareddy Review

నందమూరి నటసింహాం బాలకృష్ణ నుంచి వచ్చిన సంక్రాంతి కానుక `వీరసింహారెడ్డి`. ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ గా రూపొందిన ఈ సినిమా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. సినిమాలో కంటెంట్‌ లేకపోయినా యాక్షన్‌ సీన్లని అభిమానులు ఎంజాయ్‌ చేస్తున్నారు. బాలయ్యపై దర్శకుడు గోపీచంద్‌ మలినేని చేసిన ఎలివేషన్లు, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటన, శృతి హాసన్‌ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. 

26
Veerasimhareddy Review

Veerasimhareddy Review

సినిమాకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తుంది. కంటెంట్‌ లేకుండా కేవలం హీరో ఎలివేషన్లు, యాక్షన్‌ సీన్లు తప్ప సినిమాలో అసలు మ్యాటర్‌ లేదనే టాక్‌ క్రిటిక్స్ నుంచి వినిపిస్తుంది. అయితే `అఖండ`తో బాలయ్య సక్సెస్‌ జోరులో ఉండటంతో `వీరసింహారెడ్డి` ఓపెనింగ్స్ కి కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. 
 

36

తాజాగా చిత్ర బృందం మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లని ప్రకటించారు. బాలయ్య ఆల్‌ టైమ్‌ రికార్డ్ సృష్టించినట్టు చెబుతుంది యూనిట్‌. ఏకంగా ఈ సినిమా ఫస్ట్ డే రూ.54కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసినట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ కలెక్షన్ల పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 

46
Veerasimhareddy Review

Veerasimhareddy Review

54కోట్ల గ్రాస్‌లో 32కోట్ల షేర్‌ రాబట్టిందట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 39కోట్ల గ్రాస్‌ సాధించిందని, సుమారు 25కోట్ల షేర్‌ వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కలెక్షన్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు కావడం విశేషం. `వీరసింహారెడ్డి` బాక్సాఫీసు వద్ద ఊచకోతగా అభివర్ణిస్తుంది యూనిట్‌. 
 

56
Veerasimhareddy Review

Veerasimhareddy Review

ఇదిలా ఉంటే అసలు కలెక్షన్లు అంత ఉండవని, ఇవన్నీ ఫేక్‌ కలెక్షన్లు అని ట్రేడ్‌ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.35కోట్లకు మించి ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో టికెట్‌ రేట్లు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలోనూ పెద్దగా రేట్లు పెంచలేదు. ఈ నేపథ్యంలో ఈ స్థాయి కలెక్షన్లు ప్రాక్టికల్‌గా అసాధ్యం అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలిసిందే.
 

66
Veerasimhareddy Review

Veerasimhareddy Review

అయితే చిత్ర బృందాలు ఇటీవల ఫేక్‌ కలెక్షన్లు అనౌన్స్ చేయడం పరిపాటిగా జరుగుతున్న విసయం తెలిసిందే. ఓటీటీ రైట్స్ విషయంలో కావచ్చు, సినిమాపై హైప్‌ పెంచి ఆడియెన్స్ ని ఆకర్షించే ప్రయత్నం కావచ్చు, ఫైనాన్షియర్లు, బయ్యర్ల నుంచి ఒత్తిడి కంట్రోల్‌ చేసే ప్రయత్నం కావచ్చు. ఇలా నిర్మాతలు ఎక్కువగా చూపిస్తుంటారు. `వీరసింహారెడ్డి` విషయంలోనూ అదే జరిగి ఉంటుందని సోషల్‌ మీడియాలో వినిపించే టాక్‌. ఈ లెక్కలు పక్కన పెడితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం `వీరసింహారెడ్డి`ని ఎంజాయ్‌ చేస్తున్నారని చెప్పొచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Recommended image3
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved